‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?’ | Fromer Minister RK Roja Takes On Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?’

Jun 17 2025 4:30 PM | Updated on Jun 17 2025 5:09 PM

Fromer Minister RK Roja Takes On Chandrababu Sarkar

తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళన చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై మాజీ మంత్రి, ఆర్‌కే రోజా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే రక్షణ ఇదేనా? చంద్రబాబు సర్కారును నిలదీశారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేదని ధ్వజమెత్తారు. 

‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?, మహిళలపై అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజని చంద్రబాబు బడాయి మాటలు చెప్తున్నారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో దారుణం జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నారు?, రాష్ట్రమంతా అరాచకం రాజ్యమేలుతోంది. మహిళ హోంమంత్రిగా ఉండికూడా ఉపయోగం లేదు. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం కూడా హోంమంత్రికి లేదా?, వీడియో కాల్ చేసి మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనం’ అని మండిపడ్డారు ఆర్‌కే రోజా.

Advertisement
 
Advertisement
Advertisement