‘మోదీకి విజ్ఞప్తి.. NDA అంటే నారా నకిలీ డిస్టిలరీస్‌ అమ్మడమే’ | RK Roja Demands CBI Probe in AP Fake Liquor Case | Slams Chandrababu Over Corruption Allegations | Sakshi
Sakshi News home page

‘మోదీకి విజ్ఞప్తి.. NDA అంటే నారా నకిలీ డిస్టిలరీస్‌ అమ్మడమే’

Oct 12 2025 12:26 PM | Updated on Oct 12 2025 12:55 PM

Ex Minister RK Roja Serious Comments On CM Chandrababu

సాక్షి, నగరి: ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్‌ అమ్మడమే(NDA) అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం(AP Liquor Case) మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు(CM Chandrababu) డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్‌ జగన్‌ కాపాడారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసేశారు. కానీ, టీడీపీ నాయకుల మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం. ఎన్డీయే అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్‌ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు?.

సాక్ష్యాలతో దొరికిన పచ్చ బ్యాచ్‌..
దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సాక్ష్యాలతో సహా  దొరికిపోయారు. ఏ జిల్లాలో చూసినా మన మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా కట్టే పరిస్థితి కాదు. ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెడిపేస్తూ  వాళ్ళ మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గులేకుండా మళ్ళీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

మహిళా ద్రోహి చంద్రబాబు.. 
చంద్రబాబు మొదటి నుంచి  మహిళా ద్రోహి. మహిళలు అంటే గౌరవం లేదు. ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మరి ఆడవాళ్ళ మానప్రాణాలకు ఏం విలువ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు.  చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వీటివల్ల మహిళల మాన, ప్రాణాలకి హాని కలుగుతుంది. ఏపీలో 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్లపై లైంగిక దాడులు జరిగాయి. ఎంత మందిని హత్య చేశారు. కొంత మంది మహిళలు అదృశ్యం కాగా.. ఇప్పటివరకు కూడా దొరకలేదు’ అని విమర్శలు చేశారు.

కమీషన్లు, దందాలు బయటకు రావాలి..
తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కోవర్టు అయితే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్‌ ఎలా ఇచ్చారు.. ఎందుకిచ్చారు?. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. మైన్స్‌, వైన్స్‌లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్‌ రెచ్చిపోతోంది. ప్రధాని మోదీకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలి అని డిమాండ్‌ చేశారు. 

తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్సార్‌సీపీ కోవర్టులు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. ఈ లిక్కర్ కేసుకి మూలం సురేంద్ర నాయుడు అనే వ్యక్తి.. లోకేష్‌కు ఎంత సన్నిహితులు అనేది అందరూ కూడా గమనించాలి. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య చేసిన వ్యక్తి. జీవితకాలం శిక్ష ఉంది. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక  క్షమాభిక్ష పెట్టించారు. అతడిని బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబు క్రిమినల్స్‌కు ఆశ్రయం ఇచ్చారు అని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement