breaking news
	
		
	
  liquor bussiness
- 
      
                   
                                                       ‘మోదీకి విజ్ఞప్తి.. NDA అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే’సాక్షి, నగరి: ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే(NDA) అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం(AP Liquor Case) మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు(CM Chandrababu) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసేశారు. కానీ, టీడీపీ నాయకుల మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం. ఎన్డీయే అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు?.సాక్ష్యాలతో దొరికిన పచ్చ బ్యాచ్..దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. ఏ జిల్లాలో చూసినా మన మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా కట్టే పరిస్థితి కాదు. ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెడిపేస్తూ వాళ్ళ మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గులేకుండా మళ్ళీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.మహిళా ద్రోహి చంద్రబాబు.. చంద్రబాబు మొదటి నుంచి మహిళా ద్రోహి. మహిళలు అంటే గౌరవం లేదు. ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మరి ఆడవాళ్ళ మానప్రాణాలకు ఏం విలువ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వీటివల్ల మహిళల మాన, ప్రాణాలకి హాని కలుగుతుంది. ఏపీలో 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్లపై లైంగిక దాడులు జరిగాయి. ఎంత మందిని హత్య చేశారు. కొంత మంది మహిళలు అదృశ్యం కాగా.. ఇప్పటివరకు కూడా దొరకలేదు’ అని విమర్శలు చేశారు.కమీషన్లు, దందాలు బయటకు రావాలి..తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ కోవర్టు అయితే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు.. ఎందుకిచ్చారు?. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మైన్స్, వైన్స్‌లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతోంది. ప్రధాని మోదీకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలి అని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్సార్సీపీ కోవర్టులు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. ఈ లిక్కర్ కేసుకి మూలం సురేంద్ర నాయుడు అనే వ్యక్తి.. లోకేష్‌కు ఎంత సన్నిహితులు అనేది అందరూ కూడా గమనించాలి. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య చేసిన వ్యక్తి. జీవితకాలం శిక్ష ఉంది. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక క్షమాభిక్ష పెట్టించారు. అతడిని బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబు క్రిమినల్స్‌కు ఆశ్రయం ఇచ్చారు అని మండిపడ్డారు.
- 
  
      దందాకు పచ్చజెండా .. మద్యం ప్రియులకు బాదుడు
- 
      
                   
                                 రింగ్ అయ్యూరు!
 విజయనగరం రూరల్ : మద్యం వ్యాపారులు మరోసారి రింగ్ అయ్యూరు. 2014-15 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 202 మద్యం దుకాణాలకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. శుక్రవారం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి జిల్లాలో 187 దుకాణాలకు దరఖాస్తులు రాగా 40 దుకాణాలకు ఒకొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి. దీంతో వ్యాపారులు రింగ్ అయినట్టు స్పష్టమైంది. దుకాణాల కేటాయింపునకు అధికారులు నిర్వహించే టెండర్లు, లాటరీ ప్రక్రియకు ముందే ఆయూ ప్రాంతాల్లోని వ్యాపారులు రహస్య సమావేశాలను నిర్వహించి సింగిల్ కోటేషన్‌తో టెండర్లను దక్కించుకున్నట్టు సమాచా రం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండిపడినట్టు స్పష్టమవుతుంది.
 
 ఏజేసీ ఆధ్వర్యంలో లాటరీ...
 లాటరీ ప్రక్రియను ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు సమక్షంలో శనివారం నిర్వహించారు. పార్వతీపురం డివిజన్ లో 66 మద్యం దుకాణాలుండగా 59 దుకాణాలకు 577 దరఖాస్తులు వచ్చాయి. విజయనగరం డివిజన్లో 136 మద్యం దుకాణాలుండగా 128 దుకాణాలకు 1002 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం డివిజన్లో ఏడు దుకాణాలకు, విజయనగరం డివిజన్లో ఎనిమిది దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. లాటరీ ప్రక్రియ లో మొదట సింగిల్ దరఖాస్తులు వచ్చిన దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించినట్లు ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు ప్రకటించారు. ముందుగా జిల్లాలోని 13 సర్కిల్ కార్యాలయాల పరిధిలోని షీల్డ్ బాక్సులను తెరిచి దరఖాస్తుదారులకు చూపించారు. అనంతరం విజయనగరం యూనిట్ పరిధిలోని సర్కిల్ కార్యాల యాల్లోని దుకాణాలకు లాటరీని నిర్వహించారు. లాటరీ లో దుకాణాలను దక్కించుకున్న వారికి ఏజేసీ నాగేశ్వరరావు తాత్కాలిక లెసైన్సులను అందజేశారు. 
 
 గందరగోళంగా లాటరీ ప్రక్రియ
 మద్యం దుకాణాలకు శనివారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ గందరగోళంగా మారింది. పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లాటరీ ప్రక్రియకు దరఖాస్తుదారులు పోటెత్తటంతో వారిని నియంత్రించటం అధికారులకు తలనొప్పిగా మారింది. 187 దుకాణాలకు 1580 మంది దరఖాస్తు చేసుకోగా వారందరూ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫంక్షన్ హాల్ చిన్నది కావటం అదే సమయానికి భారీ వర్షం కురవటం తో వారంతా హాల్లోకి చొచ్చుకొచ్చారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిం చి వారిని నియంత్రించారు.
 
 రూ.82 కోట్ల ఆదాయం
 జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా ప్రభుత్వానికి రూ.82 కోట్లకు పైబడి ఆదాయం లభించనుం ది. రూ. లక్షల శ్లాబ్ ఉన్న దుకాణానికి దరఖాస్తు రాలే దు. అలాగే రూ.32.5 లక్షల శ్లాబ్ ఉన్న 13 దుకాణాల కు, రూ.45 లక్షలు శ్లాబ్ ఉన్న దుకాణానికి దరఖాస్తులు రాకపోవటంతో రూ.4.32 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయూనికి గండి పడింది. 202 దుకాణాలు లాటరీలో వెళి తే ప్రభుత్వానికి రూ.86 కోట్ల ఆదాయం లభించనుంది.
 
 ధరఖాస్తు ఫీజు ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం
 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ఫీజు రూపంలో రూ.3.95 కోట్ల ఆదాయం లభించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది 202 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయగా 187 మద్యం దుకాణాలకు 1580 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల ఫీజు రూ.25 వేలు కాగా, 1580 దరఖాస్తులకు రూ.3.95 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి 202 మద్యం దుకాణాలకుగాను 190 దుకాణాలకు 1592 దరఖాస్తులు రాగా రూ.3.98 కోట్లు ఆదాయం లభించిందన్నారు. నూతన మద్యం విధానం ద్వారా జిల్లాలో జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు నాలుగు శ్లాబ్లుగా విభజించారు. మొదటి శ్లాబ్‌లో రూ. 64లక్షలు కాగా, రెండవ శ్లాబ్‌లో రూ.45 లక్షలు, మూడవ శ్లాబ్‌లో రూ.36లక్షలు, నాల్గవ శ్లాబ్‌లో రూ. 32.5 లక్షలుగా నిర్ణయించటం జరి గిందన్నారు. దరఖాస్తులు రాని 15 మద్యం దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందన్నారు. మద్యం దుకాణాలు దక్కని దరఖాస్తుదారులు కలెక్టరేట్లోని ఈసీ కార్యాలయంలో ఈఎండీ డీడీలను సోమవారం తిరిగి పొందవచ్చునని ఆయన తెలిపారు.
 
 


