
సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి రూరల్ మండలం వైఎస్సార్‌సీపీ మాజీ కన్వీనర్ సుదర్శన్ నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సుదర్శన్ నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మేలపట్టు గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా.. సుదర్శన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సుదర్శన్ నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదర్శన్ నాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని.. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. రోజా వెంట మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం విభాగ అధ్యక్షులు ఉన్నారు.
