
తిరుపతి: ఎన్నికలకు ముందు 143 అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌లు కలిసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 06) నగరిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడారు.
అమరావతిని దోచుకోవడానికి మాత్రమే అధికారాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోతూ చంద్రబాబు మాట్లాడారని,, నేడు మహిళల పై అగాయుత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రోజా. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రశ్నించేందుకకే ఉన్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతుంటే.. అది ఆయనకు తెలియదా? అని నిలదీశారు రోజా. ఒకవేళ రైతుల సమస్యలు తెలియకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు. చిత్తూరు జిల్లాలో కిలోమీటర్ల మేర మామిడి రైతు రాత్రి, పగలు అనేది తేడా లేకుండా ఎదురుచూస్తున్నాడని, వారికి మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని విమర్శించారు.