టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి.. ఇదే సినిమాటిక్‌లో వచ్చిన హనుమాన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటింస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది.
మహాకాళి చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆయన తన పాత్ర చిత్రీకరణను కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర ఎలా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించి కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్ (PVCU)లో భాగంగా ‘అధీర’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్‌జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు.


