Deepthi Sunaina Support To Shanmukh Jaswanth In Bigg Boss 5 Telugu Last Week: బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు హీరోలుగా ఉన్నా హౌస్‌లోకి వచ్చాక నెగిటివిటి పెరగొచ్చు. ఈ సీజన్‌లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్నూపై ఈ మధ్యకాలంలో నెగిటివిటి పెరిగింది. పైకి ఫ్రెండ్ అని చెప్పినా సిరితో హగ్గులు ఆడియెన్స్‌కు ఏమాత్రం రుచించడం లేదు.

ఇప్పటికే సిరికి ఎంగేజ్‌మెంట్ కావడం, షణ్నూ..దీప్తి సునయనతో లవ్‌లో ఉండటంతో వీరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. హగ్గులు తగ్గించుకోమని స్వయంగా సిరి తల్లి సూచించినా వీళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వీరిద్దరి ప్రవర్తనపై వస్తున్న నెగిటివిటి బట్టి షణ్నూ టైటిల్ రేసు నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది.

వచ్చే వారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో షణ్నూకి సపోర్ట్ చేసేందుకు దీప్తి సునయన రంగంలోకి దిగింది. 'బిగ్‌బాస్ షోను చూసి షణ్ముఖ్ క్యారెక్టర్‌ని అంచనా వేయకుండి. అది కేవలం ఒక గేమ్ షో అని గుర్తుపెట్టుకోండి. షణ్నూ ఎంతో మంచివాడు. అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయనివ్వండి. మీ అంచనాలకు తగ్గట్లు రీచ్ అవ్వాలని అనుకోకండి. మీకు నచ్చినట్టు కాకుండా వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి.. అతనేంటో అతనిలా ఉన్నాడు.

ఎవరిమీదా ద్వేషం వద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి మీరు సపోర్ట్ చేయండి. నా మద్దతు ఇప్పటికీ, ఎప్పటికీ షణ్నూకే ఉంటుంది. అతను సంతోషంగా ఉండడమే నాకు కావాలి' అంటూ దీప్తి సునయన తన ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.


