సిరి ప్రవర్తనపై షణ్ముఖ్‌ తల్లి ఆగ్రహం! | Bigg Boss 5 Telugu: Shanmukh Mother May Warns Siri Hanmanth | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: సిరికి షణ్ముఖ్‌ తల్లి వార్నింగ్‌!

Nov 25 2021 5:48 PM | Updated on Nov 25 2021 7:37 PM

Bigg Boss 5 Telugu: Shanmukh Mother May Warns Siri Hanmanth - Sakshi

ది. షణ్ముఖ్‌ తల్లి కూడా వీళ్ల ప్రవర్తనపై ఆగ్రహంతో ఉందట! మాటిమాటికీ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడాన్ని తప్పుపట్టిందట!

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్‌ షో చూస్తున్నవాళ్లకు షణ్ముఖ్‌, సిరి ఫ్రెండ్‌షిప్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. షణ్ను, సిరిలలో ఏ ఒక్కరు టాస్క్‌ గెలిచినా ఇద్దరూ దాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ సీజన్‌లో తొలి కెప్టెన్‌గా సిరి నిలిస్తే చివరి కెప్టెన్‌గా షణ్ను నిలిచాడని తెగ సంబరపడిపోయింది సిరి.

ఇదిలా వుంటే వీళ్ల ఫ్రెండ్‌షిప్‌ కొన్నిసార్లు హద్దులు మీరుతోందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఎప్పటినుంచో కామెంట్లు చేస్తున్నారు. అంతెందుకు, సిరి, షణ్ను కూడా ఏదో తప్పు చేస్తున్నట్లుగా భయపడిపోయారు. ఇద్దరికీ ఆల్‌రెడీ లవర్స్‌ ఉన్నప్పటికీ హౌస్‌లో ఒకరికొకరం ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోతున్నామని, ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని సంఘర్షణకు లోనయ్యారు.

తాజాగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సిరి తల్లి కూడా వీళ్ల ఫ్రెండ్‌షిప్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదివరకే శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరిగిన సిరి.. షణ్నును హత్తుకోవడం నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. తప్పు చేస్తున్నావంటూ కూతురును హెచ్చరించింది. ఆమె మాటలతో హౌస్‌ అంతా షాకైంది. షణ్ముఖ్‌ తల్లి కూడా వీళ్ల ప్రవర్తనపై ఆగ్రహంతో ఉందట! మాటిమాటికీ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడాన్ని తప్పుపట్టిందట! షణ్నుతో ఇలా ఉండటం కరెక్ట్‌ కాదు అని సిరికి ముఖం మీదే చెప్పినట్లు సమాచారం. మరి పేరెంట్స్‌ హెచ్చరికలతోనైనా సిరి- షణ్నులో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement