Bigg Boss Telugu 5: హేట్ యు అంటూనే ష‌ణ్నుకు సిరి కౌగిలింత‌లు, ఆ వెంట‌నే ఏడుపు

Bigg Boss Telugu 5: Siri Hanmanth Hugs Shanmukh Jaswanth - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 75: కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో ర‌వికి సూప‌ర్ ప‌వ‌ర్‌ తీసుకునే ఛాన్స్ రాగా అత‌డు మాత్రం ఈ అవ‌కాశాన్ని స‌న్నీకిస్తాన‌న్నాడు. 25 బంగారు ముత్యాలు చెల్లించి ఈ ప‌వ‌ర్‌ను పొందాల‌ని స‌న్నీకి చెప్పాడు. అయితే స‌న్నీ మాత్రం త‌న‌కు ఏ ప‌వ‌ర్ వ‌ద్ద‌ని మొండికేశాడు. రంగంలోకి దిగిన‌ ఇంటిస‌భ్యులు అత‌డిని ఎలాగోలా ఒప్పించారు. ఇంత‌కీ ప‌వ‌రేంటంటే.. మైన్‌లోకి వెళ్లే హౌస్‌మేట్స్‌లో నుంచి ఒక‌రిని తొల‌గించి వారి స్థానంలో వెళ్లి ఆడాలి.

ఎదుటివాళ్ల‌ను గ్రూప్ గేమ్ అని మంద‌లించే ర‌వి, శ్రీరామ్‌, యానీ కుమ్మ‌క్కై గేమ్‌ ఆడారు. శ్రీరామ్ త‌న ద‌గ్గ‌రున్న  ముత్యాల‌ను యానీకి ఇద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే దాన్నో దొంగ‌తనంలా సీన్ క్రియేట్ చేశారు. అప్ప‌టిదాకా దొంగ‌తనం చేస్తే త‌ప్ప‌న్న ర‌వి.. ఎందుకాల‌స్యం, వెంట‌నే వెళ్లి దొబ్బేయండి అని సూచించ‌డం గ‌మనార్హం. దీంతో యానీ... అంద‌రిముందూ ఏదో దొంగ‌త‌నం చేసిన‌ట్లుగా క‌వ‌రింగ్ ఇస్త‌ శ్రీరామ్ ముత్యాలు తీసేసుకుంది.

స‌న్నీ ఏదో ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్నాడ‌ని అర్థ‌మైన కాజ‌ల్ అత‌డి వెంటే న‌డిచింది. నా తోక‌లాగా వెన‌కే వ‌స్తున్నావేంటి? అని చిరాకుప‌డ్డాడు స‌న్నీ. దీంతో మిగ‌తా హౌస్‌మేట్స్ ఆమెకిలా జ‌ర‌గాల్సిందే అన్న‌ట్లుగా ఓ లుక్కిచ్చారు. అంద‌రి ముందు త‌న‌ను అవ‌మానించాడ‌ని కాజ‌ల్ ఏడ్చేయ‌గా స‌న్నీ సారీ చెప్పి ఆమెను ఓదార్చాడు. త‌న‌కిచ్చిన‌ ప‌వ‌ర్‌ను కూడా ఆమెకు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు కానీ అది కుద‌ర‌ద‌ని తేల్చాడు సంచాల‌కుడైన‌ ర‌వి. దీంతో అత‌డు త‌న ప‌వ‌ర్‌నుప‌యోగించి శ్రీరామ్ స్థానంలో మైన్‌లోకి వెళ్లి అయిష్టంగా గేమ్ ఆడాడు. మొత్తంగా గేమ్ ముగిసేస‌రికి మాన‌స్‌, ప్రియాంక‌, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండ‌ర్లుగా నిలిచారు.

కాజ‌ల్ బాధ‌ప‌డితేనే నా క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతాయి, అలాంటిది ఆమె డిస్‌క‌నెక్టెడ్ అని ముఖం మీదే చెప్తే ఎలా ఉంటుంద‌న్నాడు మాన‌స్‌. అందుకే కాజ‌ల్‌తో మాట్లాడ‌ట్లేద‌ని స‌న్నీతో చెప్పాడు. అటు ప్రియాంక‌తోనూ మాట‌లు బంద్ చేశాడు. మ‌రోప‌క్క ష‌ణ్ముఖ్.. ప‌దేప‌దే దీప్తి సున‌య‌న‌ను గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. త‌ర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేప‌ర్ మీద రాసిచ్చింది. ఫీలైన ష‌ణ్ను సారీ చెప్పి హ‌గ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అత‌డికి హ‌గ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మ‌రోప‌క్క పింకీ.. త‌న‌ను ఫ్రెండ్‌గా కాక‌పోయినా క‌నీసం మ‌నిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మాన‌స్‌ను వేడుకుంది. ఇదిలా వుటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచ‌ర్‌ యానీ సొంతమ‌వ‌గా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది.

త‌ర్వాత ఇంటిస‌భ్యుల‌తో కొన్ని క్ష‌ణాలు ఇంటికి అంకితం అనే స‌ర‌దా టాస్క్ ఆడించాడు బిగ్‌బాస్‌. ఇందులో జంట‌లుగా విడిపోయిన హౌస్‌మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూత‌ద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. ఫైన‌ల్‌గా మాత్రం ఎక్కువ పాయింట్లతో యానీ మాస్ట‌ర్‌- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచ‌ర్ గెలుపొందింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top