Bigg Boss Telugu 5 Promo: మళ్లీ లీక్ చేసిన బిగ్‌బాస్, అతడే ఆఖరి కెప్టెన్!

Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ హౌస్‌లో చివరి కెప్టెన్ కోసం పోటీ జరుగుతోంది. ఎలాగైనా ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్ కెప్టెన్‌గా నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలే నిజమంటూ తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. ఇందులో షణ్ను చేతికి బ్యాండ్ ఉండటంతో అతడే కెప్టెన్ అయ్యాడని చెప్పకనే చెప్పాడు. ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయానని పింకీ బోరుమని ఏడ్చేయగా ఆమె కోసం సన్నీ, మానస్ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు.
ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ బీబీ ఎక్స్‌ప్రెస్ అనే టాస్క్ ఇచ్చాడు. చుక్‌చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా హౌస్‌మేట్స్ బోగీల్లా మారుతారు. మొదటిసారి వీరంతా సరదాగా గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఈ గేమ్‌ను ఆస్వాదించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!