చేతిలో రెండు టమాటోలు పెట్టి దొబ్బేశావ్‌ కదే.. ప్రేమకు నమస్కారం టైటిల్‌ వీడియో | Shanmukh Jaswanth Movie Premaku Namaskaram Title Announcement Video | Sakshi
Sakshi News home page

చేతిలో రెండు టమాటోలు పెట్టి దొబ్బేశావ్‌ కదే.. ప్రేమకు నమస్కారం టైటిల్‌ వీడియో

Sep 16 2025 11:34 AM | Updated on Sep 16 2025 12:55 PM

Shanmukh Jaswanth Movie Premaku Namaskaram Title Announcement Video

సోషల్‌ మీడియా నుంచి సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బిగ్‌బాస్‌, పలు వెబ్‌ సిరీస్‌లతో యూత్‌కు దగ్గరైన షణ్ముఖ్‌ ఇప్పుడు ప్రేమకు నమస్కారం (Premaku Namaskaram) అంటూ థియేటర్స్‌లోకి రానున్నాడు. ఈ మేరకు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను పంచుకున్నారు. ప్రేమలో విఫలమైన వారందరూ బార్‌లోనే కలుస్తారని ఈ ట్రెండ్‌ను ఇంతటితో ఆపేయాలని చెబుతూ షణ్ముఖ్‌ తెరపైకి వస్తాడు. సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన కొందరు ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

కొత్తదనంతో కూడిన చిత్రాలను  తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.  ఈ క్రమంలోనే   సోషల్‌మీడియాలో సన్సేషన్‌ సృష్టించిన వారు  వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌ చిత్రంతో యూట్యూబ్‌ సన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే  యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ప్రేమకు నమస్కారం అనే చిత్రంతో రానున్నారు. ఇందులో ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రముఖ నటుడు శివాజీ, నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రవడ, భార్గవ్‌ మన్నె నిర్మిస్తున్న ఈ  చిత్రానికి వి. భీమ శంకర్‌ దర్శకుడు. మంగళవారం హీరో షణ్ముఖ్‌ జస్వంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి  'ప్రేమకు నమస్కారం'  అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు.  టైటిల్‌ గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉంది.

ఈ గ్లింప్స్‌ వీడియోను గమనిస్తే.. ఇదొక యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. లవ్‌ ఫెయిల్యూర్స్‌.. లవ్‌ బ్రేకప్‌ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌ తమకు ఎలా హ్యాండ్‌ ఇచ్చారు అని చెప్పుకునే  బాధలు ఫన్నీగా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్‌ ఇది పాన్‌ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్‌ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్‌ అవుతాయి.టోటల్‌గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement