breaking news
Bigg Boss 5 Telugu Promo
-
ప్రపోజ్ చేసిన హీరోయిన్, గాల్లో తేలిపోయిన సన్నీ
Bigg Boss Telugu 5, BB Telugu Grand Finale Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరినీ బిగ్‌బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, నాని, సాయిపల్లవి, కృతీశెట్టి, జగపతిబాబు.. వీళ్లేకాక మరెంతోమంది సింగర్లు, నటీనటులు, సెలబ్రిటీలు షోలో సందడి చేశారు. తారల తళుకుబెళుకులతో బిగ్‌బాస్ స్టేజీ మరింత కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఫైనలిస్ట్ సన్నీకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఆలియాభట్. తన ఫేవరెట్ హీరోయిన్ అయిన ఆమె కళ్లముందు స్టేజీపై కనిపించగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సన్నీ. అతడికి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆలియా ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. ఇది కలా? నిజమా? అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌తో ఐ లవ్యూ చెప్పించుకున్న సన్నీ ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయం. అటు సరయూ నాగార్జునను డేట్‌కు వెళ్దామని అడిగింది. దీనికి సరేనంటూ తలూపిన నాగ్.. గ్రాండ్ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని పచ్చజెండా ఊపాడు. ఇక స్టార్ సెలబ్రిటీలు చేసిన హంగామా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ స్టేజ్‌పై బాలయ్య డైలాగ్ చెప్పిన ఆలియాభట్
Bigg boss 5 Telugu Grand Finale Latest Promo Released: బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్‌గా ముస్తాబయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 5మచ్ సర్ప్రైజ్లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రముఖ సినీ స్టార్స్‌ని రంగంలోకి దించారు. వరుస గెస్ట్‌లతో స్టేజ్ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి ప్రముఖ ప్రేమ జంట, 'బ్రహ్మస్త్ర' టీం నుంచి రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్లు సందడి చేశారు. అంతేకాకుండా ఆలియా.. బాలయ్య ఫేమస్ డైలాగ్ దబిడిదిబిడే.. అంటూ డైలాగ్ చెప్పడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' నుంచి రాజమౌళి, 'శ్యామ్ సింగరాయ్' నుంచి నాని, కృతిశెట్టి, సాయి పల్లవి , 'పరంపర' మూవీ టీం నుంచి జగపతి బాబు, నవీన్‌చంద్ర బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వీరితో పాటు పుష్ప నుంచి సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. All set for #BiggBossTelugu5 Grand Finale evening with lots of surprises and Five much fun!#BBTeluguGrandFinale today at 6 PM on #StarMaa #BiggBossTelugu #FiveMuchFun pic.twitter.com/XETApXv0cN — starmaa (@StarMaa) December 19, 2021 -
డేటింగ్ యాప్‌లో ఓ అమ్మాయిని కలిశా: సన్నీ
Bigg Boss 5 Telugu, Five Time Fun Before The Grand Finale: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కథ రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ముగియనుంది. ఈ కథలో ఎవరు హీరో అయ్యారు? కాదు కాదు ప్రేక్షకులు ఎవరిని హీరో చేశారన్న ప్రశ్నకు రేపు సమాధానం దొరకనుంది. దానికన్నా ముందు ఫైనలిస్టులను సరదాగా నవ్వించేందుకు ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. గత సీజన్ల కంటెస్టెంట్లను పంపించి ప్రస్తుతం ఉన్న హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకోమన్నాడు. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారిపోవడంతో అందరూ పగలబడి నవ్వారు. ఇక అఖిల్ సార్థక్.. మీరెప్పుడైనా డేటింగ్ యాప్‌లో ఎవర్నైనా కలిశారా? అని అడిగాడు. దీనికి సన్నీ ఆన్సరిస్తూ.. 'ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కానీ ఆమె నా ముచ్చట వదిలేసి తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తూ పోయింది' అని చెప్పడంతో హౌస్మేట్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. మరి ఈ సరదా ఎపిసోడ్‌ను చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
టాస్క్‌లో ఫైట్.. సిరి రెచ్చగొట్టిందా? లేక సన్నీ రెచ్చిపోయాడా?
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ ఇంట్లో పాత టాస్కులనే మరోసారి ఆడిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాళ్లను కంటిన్యూగా ఆడించే టాస్క్‌లో సిరి, సన్నీ, షణ్ముఖ్ పాల్గొన్నారు. తాళ్లను పట్టుకుని ఎవరు ఎక్కువసేపు కదుపుతూ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ ఆటలో సిరి ఎక్కువసేపు తాళ్లను కదపలేక అవుట్ అయింది. దీంతో పక్కకు వచ్చిన సిరి షణ్ను గెలవాలంటూ అతడిని ఎంకరేజ్ చేసింది. అక్కడిదాకా బానే ఉంది కానీ సన్నీ సరిగా ఆడట్లేదంటూ సరదాగా మాట్లాడింది. ఇది దృష్టిలో పెట్టుకున్న సన్నీ.. ఓడిపోయావ్ కదా అని ఆటపట్టించాడు. దీంతో చిర్రెత్తిపోయిన సిరి.. నువ్వూ ఓడిపోయావు.. షణ్ను ఒక్కడే గట్టిగా ఆడాడు అని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను సరదాగా అన్నానని సన్నీ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఓడిపోయావు అన్నది జోకా? అని సీరియస్ అయింది. అది మజాక్లో అన్నానని సన్నీ చెప్పగా సిరి మాత్రం నాతో జోకులెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చింది. అలా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ చల్లారిందా? లేదా? అన్నది ఎపిసోడ్లో తేలనుంది. -
అప్పుడు ఇప్పుడు మానసే విన్నర్!!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఏం చేయాలో అటు కంటెస్టెంట్లకే కాదు, ఇటు బిగ్‌బాస్‌కు కూడా పాలు పోవట్లేదు. నిన్న అయితే హౌస్మేట్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి దాగుడుమూతలు ఆడుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ కూడా వారిదారిలోకే వచ్చాడు. ఇంతకుముందు ఆడిన టాస్కులనే మళ్లీ మళ్లీ ఆడించాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. లేబుల్ లేదు మచ్చా గేమ్‌లో షణ్ముఖ్, మానస్ పోటీపడగా మానస్ గెలిచినట్లు సమాచారం. బెలూన్స్ టాస్క్‌లో షణ్ను గెలిచినట్లు లీకైంది. కొన్ని శబ్ధాలను ప్లే చేసి అవేంటో పసిగట్టి రాయాలన్న టాస్క్‌లో సన్నీ బెకబెక సౌండ్‌ను Frogకు బదులుగా Forg అని తప్పుగా రాయడంతో అందరూ పగలబడి నవ్వారు. సిరి అయితే ఏకంగా అది కప్ప కాదంటూ ఎలుక అని రాసింది. దీంతో కప్పకు, ఎలుకకు ఉన్న సంబంధాన్ని చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఫన్నీ టాస్కులతో సరదాగా గడిచిపోనున్నట్లు కనిపిస్తోంది. -
ఎప్పుడూ చెప్పలేదు, హమీదాను చాలా మిస్సవుతున్నా: శ్రీరామ్ ఎమోషనల్
Bigg Boss 5 Telugu Promo: రోజులు గడిచేకొద్దీ కంటెస్టెంట్లలో టెన్షన్ పెరుగుతోంది. టైటిల్ గెలిచేదెవరని ఇటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంద రోజుల్లో ఎన్నో టాస్కులు ఆడించిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ గడిచిన జ్ఞాపకాలను తడిమి చూసుకునేందుకు కావాల్సినంత సమయాన్నిచ్చాడు. అందులో భాగంగా వారి సంతోష, చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఫైనలిస్టులు. 'టెడ్డీబేర్ టాస్కులో నేను, యానీ మాస్టర్, సన్నీ గెలిచాక సంతోషంతో హగ్గిచ్చుకున్నాం..' అంటూ తను చూపిస్తున్న ఫొటో వెనకాల స్టోరీ చెప్పుకొచ్చాడు మానస్. జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయా అంటే అది అమ్మ రాసిన లెటర్ కళ్లముందే ముక్కలవడం.. అని బాధపడ్డాడు షణ్ను. బ్రిక్స్ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఈ టాస్క్‌కు ముందే షణ్నును ఫేక్ ఫ్రెండ్ అన్నాను. కానీ అది తప్పని బ్రిక్స్ ఛాలెంజ్‌లో నిరూపించాడు అని పేర్కొంది సిరి. నేనెప్పుడూ చెప్పలేదు కానీ హమీదాను చాలా మిస్సవుతున్నా, ఆమె ఉండుంటే లోన్ రేంజర్ అనే పేరు వచ్చేది కాదు, ఈ జర్నీలో ఆమెను మిస్సయ్యాను అన్నాడు శ్రీరామ్. -
బిగ్‌బాస్ జర్నీ.. చిన్నపిల్లలా గెంతులేసిన సిరి
Bigg Boss 5 Telugu Today Promo: మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌కు ఎండ్ కార్డు పడనుంది. ఈ క్రమంలో ఫైనలిస్టులకు వారి జర్నీ వీడియోలు చూపిస్తూ ఎపిసోడ్‌ను నెట్టుకొస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే శ్రీరామచంద్ర, మానస్, షణ్ముఖ్, సన్నీల ఏవీలు చూపించగా తాజాగా సిరి హౌస్‌లో కూడగట్టుకున్న జ్ఞాపకాలను ఆమె కళ్లకు కట్టినట్లు చూపించాడు బిగ్‌బాస్. తన ఫొటోలను చూసుకుని తెగ సంతోషించింది సిరి. ఆనందం పట్టలేక చిన్నపిల్లలా గంతులేసింది. 'మీరు నమ్మినదాన్ని కోసం మీ గొంతును గట్టిగా వినిపించారు. బిగ్‌బాస్ ఇల్లు ఎన్నో భావోద్వేగాల నిధి అయితే అందులోని సిరి మీరు..' అంటూ సిరి గురించి గట్టిగానే ఎలివేషన్స్ ఇచ్చారు. హౌస్‌లో అన్ని యాంగిల్స్ చూపించిన సిరి జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
Bigg Boss 5 Telugu: సన్నీ.. సమయం వచ్చేసింది.. బిగ్‌బాస్ ప్రశంసలు
సన్నీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్. హౌస్‌లో ఎంత కోపం ప్రదర్శించాడో అంతే ప్రేమను పంచాడు. అందరిని నవ్విస్తూ బెస్ట్ ఎంటర్టైనర్గా నిలిచాడు. నామినేషన్స్‌ని నవ్వుతూ స్వీకరించి.. ప్రేక్షకుల మనసు గెలుచుకొని టాప్ 5కి చేరాడు. సన్నీ ఆట, మాట ప్రేక్షకులను బాగా నచ్చింది.. అందుకే చాలా వారాలు నామినేట్ అవుతూ వచ్చినప్పటికీ.. ప్రతిసారి అతన్ని సేవ్ చేస్తూనే వచ్చారు. ఈ ఆదివారం (డిసెంబర్ 19)తో బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి శుభం కార్డు పడనుంది. దీంతో హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్, సన్నీలకు తమ తమ జర్నీలను చూపిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే శ్రీరామ్, మానస్‌ల బ్యూటిఫుల్ జర్నీ చూపించిన బిగ్‌బాస్.. తాజాగా సన్నీ బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించి, ఆనందపరిచాడు. హౌస్ లో సన్నీ మెమొరీస్ కి సంబంధించిన ఫొటోలన్నీ వేర్వేరు ప్లేసెస్ లో పెట్టి, సన్నీని ఆహ్వానించాడు. తన ఫోటోలను చూసి సన్నీ నవ్వుకున్నాడు. అక్కడ ఓ కోతి బొమ్మ ఉండే.. ‘ఓ కాజల్ ఎట్లున్నావ్.. బాగున్నావా’అంటూ తనదైన శైలీలో కామెడీ చేసి నవ్వులు పూయించాడు. ఇక పక్కనే ఉన్న కేక్ ముక్క ఉంటే.. దాన్నీ తీసుకొని వాసన చూసి.. 'వెయిట్ ఫర్ ది క్లైమాక్స్' అంటూ వేరో చోటుకి వెళ్లిపోయాడు. ఆ తరువాత బిగ్ బాస్ సన్నీను ప్రశంసిస్తూ.. 'సరదా.. సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలవుతాయని మీరు గుర్తుచేశారు. గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చి ఎంటర్టైనర్గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చే మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా.. పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన ప్రయాణమే మళ్లీ రుజువు చేస్తోంది. అప్నా టైం ఆయేగా.. సన్నీ.. మీ సమయమొచ్చేసింది' అంటూ సన్నీని ఓ రేంజ్లో పొగిడేశాడు బిగ్‌బాస్. మరి హౌస్‌లో సన్నీ ఇంకెంత కామెడీ చేశారో నేటి ఎపిసోడ్లో చూడాల్సిందే. -
Bigg Boss 5 Telugu: అధైర్య పడలేదు..షణ్ముఖ్‌పై బిగ్‌బాస్ ప్రశంసలు
Bigg Boss 5 Telugu Today Promo: బుల్లి తెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో ఐదు రోజులు ఈ రీయాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. ఈ ఆదివారం(డిసెంబర్ 19) గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు ఉన్నారు. వారికి మధురజ్ఞాపకాలను అందిస్తున్నాడు బిగ్‌బాస్. నిన్నటి ఎపిసోడ్లో శ్రీరామ్, మానస్‌ల బిగ్‌బాస్ జర్నీ చూపించి, వారిలో జోష్ నింపాడు. ఇక నేడు మిగిలిన ఇంటి సభ్యులై జర్నీ చూపించినట్లు తెలుస్తోంది. వాళ్లు గేమ్ ఎలా ఆడారు? బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల ప్రయాణం ఎలా జరిగింది? తదితర విషయాల్ని వీడియో రూపంలో వారికి చూపించాడు. ఈ క్రమంలో షణ్ముఖ్ ఆనందంతో చిందులేశాడు. ‘ఎంత మంది మిమ్మల్ని నామినేట్ చేసినా అధైర్య పడకుండా ఆటను ఫినాలే వరకూ తీసుకొచ్చారు’అంటూ బిగ్‌బాస్ షణ్ముఖ్‌పై ప్రశంసలు కురిపించాడు. -
అలా ఆడటం మానస్ వల్లే సాధ్యం!
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ట్రోఫీ.. హౌస్‌లో ఉన్న అందరి కళ్లు ఇప్పుడు దాని మీదే ఉన్నాయి. ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అని కసిమీదున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటిదాకా టాప్ 5లో చోటు సంపాదించడం కోసం కష్టపడ్డ హౌస్మేట్స్.. తమకు టైటిల్‌ను సొంతం చేసే బాధ్యతను అభిమానుల భుజాలపై వేశారు. ఈ వారం ప్రేక్షకులు వేసే ఓట్లతో విన్నర్ ఎవరనేది డిసైడ్ కానుంది. ఇదిలా ఉంటే ఫైనలిస్టులకు బిగ్‌బాస్ వారి జర్నీ వీడియోలు చూపించాడు. ఆనందపు క్షణాలతో పాటు మర్చిపోలేని మధురానుభూతులను బాధాకరమైన సంఘటలను, పోట్లాటలను.. ఇలా అన్నింటినీ ఏవీ వేసి చూపించడంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. 'ఈ ఇంట్లో మీ ప్రయాణం గాయకుడిగా మొదలైంది. ఒక్కోవారం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆటలో మీరు చూపించిన పటిమ, స్నేహితుల కోసం నిలబడ్డ తీరు ప్రపంచానికి ఒక కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ముంచే కెరటాలు ఎన్ని ఉన్నా వాటిపై ఈదుకుంటూ వచ్చి ఉదయించే సూర్యుడు ఒక్కడే..' అంటూ శ్రీరామ్‌ను మెచ్చుకున్నాడు బిగ్‌బాస్. 'స్నేహం కోసం మీరు నిలబడ్డ తీరు ప్రతిఒక్కరినీ హత్తుకుంది. కొందరు తెలివితో మరికొందరు మనసుతో ఆడతారు. కానీ మీరు మనసు, తెలివిని సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమైంది' అని మానస్‌పై ప్రశంసలు కురిపించాడు బిగ్‌బాస్. -
కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ప్రియ, షాక్‌లో ప్రియాంక!
Bigg Boss 5 Telugu, Transgender Priyanka Singh about Actress Priya: ప్రియ, ప్రియాంక.. పేర్లే కాదు.. వారి అభిరుచులూ కలిశాయి. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా మిగతా ఒకరు తల్లడిల్లిపోయేవారు. అంతలా క్లోజ్ అయ్యారిద్దరూ. తాజాగా ప్రియాంకసింగ్కు మర్చిపోలేని బహుమతిచ్చింది నటి ప్రియ. ఎంతో ఖరీదైన డైమండ్ రింగ్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్ రింగ్ ఉంది.. ఇది నేను ఊహించలేదు. థాంక్యూ, లవ్ యూ అక్కా.. అంటూ డైమండ్ రింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. దీని గురించి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రియక్కలో అమ్మను చూసుకున్నా.. ఆమె మనసు వెన్నలాంటిది. దుబాయ్ నుంచి బావగారు అక్కకోసం డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. కానీ అక్క ఈ ఉంగరం నీకోసమే, నువ్వే పెట్టుకో అని నాకు బహుకరించింది. ఆ డైమండ్ రింగ్ కన్నా ప్రియ అక్క నాకు పెద్ద డైమండ్..' అంటూ ప్రియతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది పింకీ. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
సిరి పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా?: జెస్సీ ఫైర్
Bigg Boss Telugu 5, Model Jaswanth Fires On Siri, Shannu: బిగ్‌బాస్ జర్నీ ముగింపుకు చేరుకుంది. మరోవారంలో విజేత ఎవరనేది తేలిపోనుంది. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లపై ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాకపోయినా అందులో కొన్నింటిని నిన్నటి ఎపిసోడ్లో అడిగి హౌస్మేట్స్ నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ రోజు మాత్రం ఏకంగా బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ ఆరుగురికి ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. 'షణ్ను ఇది చాలా సీరియస్.. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో, జనాలు ఏం అనుకుంటున్నారో? అని ఎప్పుడైనా ఆలోచించావా?' అని సూటిగా ప్రశ్నించాడు జెస్సీ. అలాగే సిరికి సైతం గట్టిగానే క్లాస్ పీకాడు. 'నువ్వు బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా సిరి, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను అదీ ఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, అవసరమా నీకు' అని తిట్టినంత పని చేశాడు జెస్సీ. ఇక ప్రియాంక సింగ్.. ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? లేదా నటించావా? అని మానస్‌ను నిలదీసింది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించని హౌస్మేట్స్ మరి వీటికి ఏమని సమాధానాలిచ్చారో చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
ఫినాలేలో అడుగుపెట్టిన ఐదుగురు కంటెస్టెంట్లు!
Bigg Boss Telugu 5 Promo: పంతొమ్మిది మందితో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణంలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో నేడు ఒకరు హౌస్‌ను వీడనున్నారు. అయితే ఎలిమినేట్ అయింది కాజల్ అంటూ లీకువీరులు ఒకరోజు ముందే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. కాజల్ ఎలిమినేషన్‌ను నాగార్జున అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలింది. కాజల్ నిష్క్రమణ అనంతరం హౌస్‌లో ఉన్న మానస్, సిరి, షణ్ను, శ్రీరామ్, సన్నీ ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్ మొదటి ఫైనలిస్టుగా నిలవగా నిన్నటి ఎపిసోడ్లో సన్నీ ఫైనల్లో అడుగుపెట్టినట్లు వెల్లడించారు. నేటి ఎపిసోడ్లో సన్నీ చేతుల మీదుగా సిరి, సిరి చేతుల మీదుగా షణ్ముఖ్‌లను ఫైనలిస్టులుగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత నాగార్జున మానస్ సేవ్ అయి ఫైనల్‌కు వెళ్తున్నట్లు వెల్లడించనున్నారట. అయితే వీటన్నింటికన్నాముందు ఇది లాస్ట్ సండే అంటూ నాగ్.. వారితో సరదా టాస్కులు ఆడించినట్లు కనిపిస్తోంది. మరి ఈ ఫన్ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి! -
సిరిని కంట్రోల్లో పెడుతున్నానని అంగీకరించిన షణ్ను!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న సంఘటనలపైనే కాకుండా కంటెస్టెంట్లపై కూడా ప్రేక్షకులకు అనేక అనుమానాలున్నాయి. వాటిలో కొన్నింటికి నేడు సమాధానం దొరకనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఇంటిసభ్యులందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాలన్నాడు నాగ్. అందులో భాగంగా శ్రీరామ్‌కు.. ఇప్పుడు మీరు షణ్ను గ్రూప్‌లో ఉన్నారా అన్న ప్రశ్న ఎదురైంది. ఈ క్వశ్చన్ చూసి అవాక్కైన షణ్ను.. నాకో గ్రూప్ కూడా ఉందా? అంటూ నవ్వుకున్నాడు. మానస్‌కు మరో వింత ప్రశ్న ఎదురైంది. ఆడియన్స్ దగ్గర మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌గా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? అని ఓ ప్రేక్షకుడు సూటిగా ప్రశ్నించాడు. ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ఊహించలేదని సిరి షాకైంది. ఇక షణ్ముఖ్‌కు.. 'సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? తనని తనలా ఎందుకు ఉండనివ్వరు?' అని ఆడియన్స్‌లో ఒకరైన సునీత ప్రశ్నించింది. నిజంగానే కంట్రోల్ చేస్తున్నావా? అని శ్రీరామ్ ప్రశ్నించగా అంత లేదన్నట్లు సిరి మాట్లాడింది. కానీ షణ్ను మాత్రం నువ్వు కంట్రోల్ అవ్వనిదే ఎవరూ ఆ క్వశ్చన్ వేయరంటూ ఆమెను నియంత్రిస్తున్నానని అంగీకరించాడు. 'మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?' అని ఓ ప్రేక్షకుడు కాజల్‌ను నిలదీశాడు. కానీ అదంత మంచి ప్రశ్నలా కనిపించకపోవడంతో కాజల్ ఏడ్చేసింది. అటు శ్రీరామ్ మాత్రం ఈ క్వశ్చన్‌ను నేను కాజల్‌ను ఇదివరకే అడిగానంటూ సిరి, షణ్నులతో చెప్పుకొచ్చాడు. మరి ఈ ప్రశ్నలకు హౌస్మేట్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
ఆవేశంలో షణ్ను, ఒక్క హగ్గుతో ఇంప్రెస్ చేసిన సిరి
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కథ కంచికి చేరుకునే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఫన్నీ టాస్కులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు బిగ్‌బాస్. ఇందుకోసం కంటెస్టెంట్లు స్టార్ హీరోహీరోయిన్లుగా మారారు. షణ్ముఖ్ సూర్యగా, కాజల్ శ్రీదేవిగా, సన్నీ బాలయ్యగా, శ్రీరామ్ చిరంజీవిగా, మానస్ పవన్ కల్యాణ్‌గా, సిరి జెనీలియాగా నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లు తమ పాత్రల్లో జీవిస్తూ ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్మేట్స్. తాజాగా ఈ ఫన్ ధమాకా రెట్టింపు అయినట్లు కనిపిస్తోంది. శ్రీదేవిగా కాజల్ భూలోకంలో తన అంగులీకం(ఉంగరం) పోయిందని తెగ వెతుకుతున్న విషయం తెలిసిందే కదా! అయితే ఆమె అంగులీకాన్ని వెతికిపెట్టమని సింగం షణ్నుని సాయం కోరింది. కానీ అతడు సాయం చేయాల్సింది పోయి గద్దించి భయపెట్టాడు. దీంతో ఈ అంగులీకం లొల్లి బాలయ్యదాకా చేరింది. షణ్నును ఇంప్రెస్ చేస్తే నీ ఉంగరం నీకు వస్తుందన్నాడు సన్నీ. దీంతో సిరి తన దగ్గరున్న మంత్రదండాన్ని ఉపయోగించింది. వెంటనే వెళ్లి షణ్ముఖ్‌ను హత్తుకోవడంతో అతడు కూల్ అయ్యాడు. -
బిగ్‌బాస్‌లోకి పింకీ.. మానస్‌తో మసాజ్ కూడా.. అదెలా అంటారా?
బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 13 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షోకి కొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీరామ్ మినహా మిగతావారంతా నామినేషన్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆ ఆరుగురికి రోల్ ప్లే అనే టాస్క్‌లు ఇచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక కాజల్ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే మంగళవారం ఎపిసోడ్లో నవ్వులే వర్షం కురిచేలా కనిపిస్తోంది. -
ఫస్ట్ ప్లేస్‌లో నేను కాదు షణ్ను ఉండాలి: సిరి
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో శ్రీరామ్ టికెట్ టు ఫినాలే ట్రోఫీ అందుకుని ఇప్పటికే ఫినాలేలో అడుగుపెట్టాడు. కాబట్టి అతడు ఈ వారం నామినేషన్లో లేనట్లే! మిగతా ఐదుగురు ఇంటిసభ్యులైన సన్నీ, షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్ టాప్ 5లో చోటు దక్కించుకునేందుకు పోరాడుతున్నారు. పద్నాలుగో వారం వీరంతా నామినేషన్లో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. హౌస్మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో మొదటి నుంచి ఆరు స్థానాల వరకు ర్యాంకులిచ్చుకోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదట్లో ఫస్ట్ ప్లేస్ తనకే కావాలన్న సిరి తర్వాత మాత్రం షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నానంది. అదేంటి? నిన్ను నువ్వు ఫస్ట్ ర్యాంక్‌లో చూసుకోవా? అని శ్రీరామ్ ప్రశ్నించగా లేదని అడ్డంగా తలూపింది. సిరి కంటే కొంచెం తక్కువగా ఆడతావంటూ షణ్ను ఆరో ర్యాంక్ దగ్గర నిలబడటమే కరెక్ట్ అంది కాజల్. గేమ్ ఇలా ఆడటం తప్పంటే ఆరో స్థానంలో నిల్చుంటానంటూ టాప్ 6 బోర్డు దగ్గర నిలబడ్డాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పినట్లు అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తారా? లేదా? అన్నది చూడాలి! -
సన్నీ నెంబర్ 1, షణ్ముఖ్ ర్యాంక్ ఎంతంటే?
Bigg Boss 5 Telugu Promo: అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందంటూ బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఆరు వరకు ఎవరెవరు ఏయే ర్యాంకుల్లో ఉండాలో నిర్ణయించుకుని వాటి వెనకాల నిల్చుండాలని ఆదేశించాడు. దీంతో షణ్ముఖ్, సన్నీ, కాజల్, సిరి ఫస్ట్ ర్యాంకు నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడ్డారు. మరీ ముఖ్యంగా కాజల్ మాత్రం మొదటి స్థానంలో నిల్చుండాలని తహతహలాడింది. అయితే సన్నీ అందుకు ఒప్పుకోలేదు. అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదంటూ డైలాగులు వల్లించాడు. అయితే మొత్తానికి సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాలుగో ప్లేస్‌లో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో ర్యాంక్ వద్ద సిరి నిలబడ్డారట! అంటే హౌస్మేట్స్ అభిప్రాయం మేరకు సిరి వచ్చే వారం వెళ్లిపోతే మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెడతారన్నమాట! ఇంటిసభ్యులు సన్నీని విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నర్‌గా తేల్చారు. కానీ వీళ్లమధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో ఈ ఇద్దరిలో ఎవరు విజేత అని ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది. -
బిగ్‌బాస్ హౌస్‌లో అపరిచితుడు, మహానటి ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండేగా మార్చేందుకు సరికొత్త గేమ్స్‌తో ముందుకు వచ్చాడు నాగ్. ఈ క్రమంలో కొన్ని సినిమా పాత్రలను కంటెస్టెంట్లు ఒకరికొకరు అంకితమిచ్చుకోవాలని ఆదేశించాడు. ఈ క్రమంలో మహానటి పోస్టర్ చూడగానే సన్నీ తడుముకోకుండా ప్రియాంక పేరు చెప్పాడు. సావిత్రితో పోలుస్తున్నందుకు పింకీ ఉప్పొంగిపోగా... నిన్ను సావిత్రితో పోల్చలేదమ్మా.. బాగా నటించే వ్యక్తివని అర్థం అంటూ ఆమె గాలి తీసేశాడు. ఇంకొకరిని కంట్రోల్లో పెట్టే డా.వశీకరన్ పాత్ర షణ్నుకు బాగా సెట్టవుతుందని చెప్పింది సిరి. అంటే అతడు తనని కంట్రోల్లో పెడతాడని చెప్తూ వాపోయింది. సన్నీ అర్జున్‌రెడ్డి అని, శ్రీరామ్ రేలంగి మావయ్య అని, మానస్ అపరిచితుడు అని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరు సింపతీ కోసం ప్రయత్నిస్తారని నాగ్ ప్రశ్నించగా మానస్ కాజల్ పేరు చెప్పాడు. నా వాళ్లే నన్నిలా అంటే ఎలారా? అని కాజల్ చెప్పాల్సిన డైలాగ్‌ను నాగ్ ఇమిటేట్ చేయడంతో అంతా ఘొల్లుమని నవ్వారు. -
సన్నీతో సారీ చెప్పించిన నాగ్, సిరిపై సెటైర్లు
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ ప్రియులు పొద్దుటి నుంచి ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి సహనానికి పరీక్ష పెట్టిన బిగ్‌బాస్ టీం ఎట్టకేలకు ప్రోమో వదిలింది. ఇందులో కింగ్ నాగార్జున కంటెస్టెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకున్నాడు. సిరి.. తనను తిడుతున్నాడని షణ్ముఖ్ మీద ఫిర్యాదు చేసింది. కాజల్.. నా మీద అరిచేస్తున్నాడంటూ సన్నీపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నాగ్.. సన్నీతో ఆమెకు సారీ చెప్పించాడు. సిరి హెలికాప్టర్ సౌండ్‌ను కనిపెట్టలేకపోయిన విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ ఆమెపై సెటైర్లు వేశాడు. మీ ఊర్లో ట్రాక్టర్ సౌండ్ అలాగే వస్తుందా? అని కౌంటరిచ్చాడు. మరోపక్క శ్రీరామ్ సేఫ్ అయితేనే అతడికి ఫస్ట్ ఫైనలిస్టు ట్రోఫీ దక్కుతుందన్నాడు నాగ్. ఎలాగో శ్రీరామ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈరోజు శ్రీరామ్ టికెట్ టు ఫినాలేలో గెలిచిన ట్రోఫీని తన సొంతం చేసుకోబోతున్నాడన్న మాట! -
సిరి కోసం ఆడుతున్న షణ్ను, ఆమెను గెలిపిస్తాడా?
Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale: బిగ్‌బాస్ షో 13వ వారం ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునేందుకు బిగ్‌బాస్ 'టికెట్ టు పినాలే' ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి ఈ గేమ్‌లో కొనసాగుతుండగా కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ రేసు నుంచి తప్పుకున్నారు. ఏ ఛాలెంజ్ ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు సిరి.. మెమొరీ తప్ప ఏదైనా సరే అని బదులిచ్చింది. మెమొరీ ఎందుకు వద్దంటున్నావని మానస్ ప్రశ్నించగా.. అది నీకుంది, కానీ మాకు లేదు అని ఆన్సరివ్వడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. కాజల్‌తో తిరిగి సైకోలా మారావంటూ మానస్‌తో జోక్ చేశాడు సన్నీ. చివరగా ఫోకస్ అనే ఛాలెంజ్ ఎంపిక చేసుకోగా ఇందులో శబ్ధాల సౌండు వినిపిస్తే దాన్ని వరుసగా బోర్డు మీద రాయాలి. అయితే అందరూ సరిగ్గా రాస్తే సిరి మాత్రం హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని రాయడం విశేషం. తర్వాత అక్యురసీ ఛాలెంజ్‌లో అన్ని బల్బ్స్ వెలిగేలా స్విచ్ ఆన్ చేయాలి. ఈ గేమ్‌లో షణ్ను సిరి తరపున గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఐస్ క్యూబ్స్ టాస్క్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ సిరి నడవలేకపోతోంది. దీంతో నిన్నటి గేమ్‌లో సిరి తరపున ఆడి ఆమెను గెలిపించిన షణ్ను తన గేమ్‌లో మాత్రం ఓడిపోయాడు. మరి నేడు కూడా ఆమె కోసం ఆడుతున్న షణ్ను సిరిని గెలిపిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
టికెట్ టు ఫినాలే రేసులో నుంచి వాళ్లు అవుట్!
Bigg Boss Telugu 5: ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క.. ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు ముఖ్యం.. ఫినాలేలో అడుగుపెట్టామా? లేదా? అన్నది పాయింట్! ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా ఫినాలే టికెట్ కోసం రేసు మొదలు పెట్టారు. మరి హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు టికెట్ సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఎండురెన్స్, స్పీడ్ టాస్క్‌లు పూర్తవగా ముచ్చటగా మూడో టాస్క్ కూడా ప్రారంభమైనట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. స్కిల్ చాలెంజ్‌లో శ్రీరామ్, సిరి మినహా మిగతా అందరూ ఆడినట్లు కనిపించింది. నిన్నటి ఐస్‌క్యూబ్స్ గేమ్ ఫలితం కారణంగా సిరి, శ్రీరామ్ లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. దీంతో వీరిద్దరి తరపున షణ్ను, సన్నీ గేమ్ ఆడినట్లు సమాచారం! మొత్తానికి మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ ఫైనల్ గేమ్‌కు అర్హత సాధించగా, కాజల్, ప్రియాంక, షణ్ను రేసు నుంచి అవుట్ అయినట్లు వినికిడి! మరి ఆ నలుగురిలో ఎవరు ముందుగా ఫినాలేలో అడుగుపెడతారో చూడాలి! -
టికెట్ టు ఫినాలే: ఆధిక్యంలో మానస్, ఆ ఇద్దరు వెనుకంజ!
Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale Task: బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నివారాల పాటు ఉండటం ఒకెత్తు అయితే, టాప్ 5కి చేరుకోవడం మరో ఎత్తు. ఎలాగో ఇంతదాకా వచ్చాం కాబట్టి ఫైనల్లో కాలు పెట్టాల్సిందేనని కంటెస్టెంట్లు ధృడ నిశ్చయంతో ఉన్నారు. అలాంటివారికి బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్‌తో శుభవార్తను అందజేశాడు. ఈ టాస్క్‌లో గెలిచినవారు నేరుగా ఫైనల్‌కు వెళ్తారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో 'టికెట్ టు ఫినాలే' మొదటి లెవల్ నడుస్తోంది. ఇందులో ఐస్ క్యూబ్స్‌పై నిల్చొని పక్కవారి బంతులు లాక్కునేదానిమీద ఫోకస్ పెట్టాలి. ఈ గేమ్‌లో సిరి, సన్నీ మధ్య ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. దీంతో సిరి ఏడ్చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఒకరిని విలన్ చేయడానికి సిరి రెడీగా ఉంటుందని చిరాకుపడ్డాడు సన్నీ. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే మానస్ ఎక్కువ పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడట! శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా కాజల్, ప్రియాంక చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలో ఫినాలేకు ఎవరు ముందుగా బెర్త్ ఖాయం చేసుకుంటారో చూడాలి! -
బిగ్‌బాస్ బంపరాఫర్.. ‘ఫినాలే’కు చేరిందెవరు?
Bigg Boss 5 Telugu Today Promo, Ticket To Finale: బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ దిగ్విజయంగా 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. వారిలో కెప్టెన్ షణ్ముఖ్, సన్నీ మినహా.. మిగతా ఇంటి సభ్యులంతా నామినేషన్లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులంతా టాప్ 5లో ఉండాలని కలలు కంటున్నారు. ఈ ఒక్కవారం సేవ్ అయితే చాలు తర్వాత ఎలాగైనా నెట్టుకురావొచ్చనే భావనలో ఇంటి సభ్యులు ఉన్నారు. ఈక్రమంలో కంటెస్టెంట్స్‌కి బంపరాఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునే అవకాశం కల్పించాడు. దానికోసం ‘టికెట్ టు ఫినాలే’అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా మూడు చాలెంజ్‌లు ఇచ్చాడు. వాటిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెలిస్తే వారే నేరుగా ఫినాలేకు సెలెక్ట్ అవుతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్’టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్ గెలిచిందెవరు? మిగతా రెండు టాస్క్‌లు ఏంటి? చివరకు ‘టికెట్ టు ఫినాలే’ ను ఎవరు సొంతం చేసుకున్నారు?అనేది తెలియాలంటే బిగ్‌బాస్ షోని ఫాలో కావాల్సిందే. -
నామినేషన్స్‌లో ఐదుగురు! షాకిచ్చిన పింకీ!
Bigg Boss Telugu 5 Promo, 13th Week Nominations: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌ను వీడటంతో హౌస్‌మేట్స్‌లో గుబులు మొదలైంది. వీరి టెన్షన్‌ను రెట్టింపు చేస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ మొదలయ్యాయి. నామినేట్ చేయాలనుకున్న ఇంటిసభ్యుల ముఖం ఉన్న బాల్‌ను కాలితో తన్ని గేటు అవతల పడేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. సన్నీ శ్రీరామ్‌ను నామినేట్ చేయగా పింకీ ఎవరిని చేయాలా అని ఆలోచనలో పడింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ప్రియాంక ఏకంగా మానస్‌ను నామినేట్ చేసిందట. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య కాస్త గొడవ కూడా జరిగినట్లు వినికిడి! అంతేకాకుండా గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ చేసిన కాజల్‌ను సైతం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం సిరి, కాజల్, మానస్, శ్రీరామ్, ప్రియాంక సింగ్ నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్‌తో పాటు సన్నీ సైతం ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. -
ఎలిమినేషన్‌ను మార్చే అధికారం సన్నీ చేతుల్లో!
Bigg Boss Telugu 5 Promo: సండే అంటే ఫన్డే మాత్రమే కాదు ఎలిమినేషన్డే కూడా! ఈ వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో సిరి, శ్రీరామ్, సన్నీ నిన్నటి ఎపిసోడ్‌లోనే సేవ్ అయ్యారు. మిగతావారిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది నేడు అధికారికంగా వెల్లడి కానుంది. ఈ ఎలిమినేషన్ ఘట్టంపై తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. రవి, కాజల్ ఇద్దరూ ఎలిమినేషన్ అంచుల్లో ఉన్నట్లు చూపించారు. వీరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం మీలో ఒక్కరికే ఉందని నాగ్ వెల్లడించాడు. దీంతో సన్నీ తనకు దక్కిన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గార్డెన్ ఏరియాలోకి పట్టుకొచ్చాడు. మరి సన్నీ ఆ పాస్‌ను ఉపయోగించి ఆ ఇద్దరిలో ఎవరినైనా సేవ్ చేశాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే సన్నీ ఆ పాస్‌ను వాడలేదట! రవి ఎలిమినేట్ అయ్యాడట! అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా నేటితో ఎక్స్పైర్ అయినట్లు ప్రకటించి షాకిచ్చాడట నాగ్.. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
బిగ్‌బాస్‌లోకి దీప్తి సునయన.. సంతోషంలో షణ్నూ
Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Entry In Saturday Episode: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ మరింత స్పెషల్‌గా ముస్తాబైంది. ఇప్పటికే ఫ్యామిలీ టైం అంటూ కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆహ్వానించారు. ఇక ఈ ఎపిసోడ్లో దీప్తి సునయన ఎంట్రీ హైలెట్‌గా నిలిచింది. తొలుత షణ్నూ కోసం అతని అన్నయ్య మాత్రమే వచ్చారని నాగార్జున చెప్పగా షణ్ముక్ కాస్త నిరాశ చెందాడు. అయితే ఆలోపే దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చి అతని మూడ్‌ను మార్చేసింది. దీప్తిని చూడగానే 1000 వాలా బల్బులా షణ్నూ ముఖం వెలిగిపోయింది. 'సచ్చినోడా..నిన్ను చాలా మిస్సయ్యాను' అంటూ దీప్తి చెప్పగా..షణ్నూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. కాగా దీప్తి సునయన ఎంట్రీతో షణ్నూ ఆట ఇకనైనా కాస్తా మారుతుందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిరి-షణ్నూల రిలేషన్ గురించి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేస్తారేమో చూడాలి. #DeepthiSunaina is here for #Shanmukh..Ika katha ela undo chudali#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/7JCfLDYRhm — starmaa (@StarMaa) November 27, 2021 -
బిగ్‌బాస్‌లో సిరి బాయ్‌ఫ్రెండ్.. 'వదిలేస్తున్నావా సిరి' అంటూ సూటి ప్రశ్న
బిగ్‌బాస్‌లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి.దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూసే అవకాశం రావడంతో హౌస్మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవి, కాజల్ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఫ్యామిలీలోనే ఒకరిని మాత్రమే బిగ్‌బాస్‌లోకి అనుమతించారు. తాజాగా హౌస్మేట్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి డబుల్ ఎమోషన్స్‌ని బయటకు రప్పించడానికి మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ సహా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. శ్రీహాన్‌ను చూడగానే సిరి తలదించుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ 'వదిలేస్తున్నావా సిరి'.. అంటూ శ్రీహాన్ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్ అయ్యింది సిరి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న శ్రీహాన్..అలా 'వదిలేస్తున్నావా సిరి'.. అని ఎందుకు అడిగాడు అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8 — starmaa (@StarMaa) November 27, 2021 -
కూతుర్ని చూడగానే ఎమోషనల్ అయిన యాంకర్ రవి
Bigg Boss 5 Telugu Today Promo, Anchor Ravi Gets Emotional: బిగ్‌బాస్ హౌస్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి. ఇప్పటికే కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు ఎంటర్ అవగా, నేటి ఎపిసోడ్లో యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబర్లు చెప్పడంతో పాటు సరదాగా ఆడిస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Daughter ni chusaka #Ravi emotions are priceless ❤️ #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/RZLbVj0sIT — starmaa (@StarMaa) November 26, 2021 -
పాన్‌షాప్ పెట్టి చదివించాను, ఎన్నో మాటలు పడ్డాను: సిరి తల్లి
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌తో రణరంగంగా మారిన బిగ్‌బాస్ హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో చల్లబడిపోయింది. ఆవేశంతో చిందులు తొక్కిన కంటెస్టెంట్లు వారి ఆత్మీయులను చూడగానే మెత్తబడిపోయారు. కొన్ని వారాల తర్వాత కన్నవారు, కట్టుకున్నవారు కళ్ల ముందుకు రావడంతో ఎమోషల్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కాజల్ భర్త, కూతురు హౌస్‌లో అడుగుపెట్టగా నేడు శ్రీరామ్ సోదరి, సిరి తల్లి, మానస్ తల్లి, సన్నీ తల్లి ఇంట్లోకి వస్తున్నట్లు ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్. సన్నీ తన తల్లిని చూడగానే నిన్ను ఎక్కడో చూశానే అంటూ సరదాగా మాట్లాడాడు. మానస్ తల్లి అయితే తన వాక్చాతుర్యంతో హౌస్మేట్స్ అందరినీ ఇట్టే కలుపుకుపోయింది. 'నాకు, మానస్‌కు మీలాంటి అమ్మాయిని చూడండి' అని శ్రీరామ్ అడగ్గా.. 'బయట హమీదా వెయిటింగేమో' అని మానస్ తల్లి పంచ్ ఇచ్చింది. దీంతో శ్రీరామ్ సిగ్గుతో ముఖం దాచుకున్నాడు. 'సిరికి ఊహ తెలిసినప్పుడే డాడీ చనిపోయారు, పాన్ షాప్ పెట్టి ఆమెను చదివించాను. జనాలతో ఎన్నో మాటలు పడ్డాను. ఈ బిగ్‌బాస్‌ను కోట్లాది మంది చూస్తున్నారు. నన్ను బిగ్‌బాస్ సిరి తల్లిగా గుర్తుపడుతున్నారు' అంటూ భావోద్వేగానికి లోనైంది సిరి తల్లి. బాత్రూంకి వెళ్లాలనుకున్న షణ్నును లోనికి వెళ్లనీయకుండా పాజ్ అంటూ అతడిని కదలకుండా ఉండమన్నాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్మేట్స్ అతడిని అమ్మాయిగా అందంగా ముస్తాబు చేశారు. -
ఇట్స్ ఫ్యామిలీ టైమ్: కూతుర్ని హత్తుకుని ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్‌లో గొడవలతో దద్దరిల్లిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో నేడు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. గతేడాది కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల గాజు అద్దంలో నుంచే చూసి మాట్లాడేలా షరతులు విధించారు. కానీ ఈసారి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో హౌస్మేట్స్ కుటుంబ సభ్యులను మూడు రోజులపాటు క్వారంటైన్లో ఉంచి నేరుగా ఇంట్లోకి పంపించారు. బీబీ ఎక్స్‌ప్రెస్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్లను కదలకుండా ఆగుమన్న సమయంలో వారి కుటుంబ సభ్యులను లోనికి పంపించి సర్ప్రైజ్ చేశాడు బిగ్‌బాస్. ఈక్రమంలో నేడు కాజల్ భర్త, కూతురు ఇంట్లో అడుగుపెట్టారు. వారిని చూడగానే కాజల్ ఎమోషనల్ అయింది. తల్లీకూతుళ్లు ఒకరినొకరు హత్తుకుని ఏడ్చారు. ఇక కాజల్ గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు. 'మీ మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తుందా?' అని శ్రీరామ్ అడగ్గా అందుకు కాజల్ కూతురు అవునంటూ పవన్ కల్యాణ్ స్టైల్లో ఆన్సరిచ్చింది. తర్వాత శ్రీరామ్ కోసం ఆమె సోదరిని పంపించినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ తనకోసం ఎవరిని పంపిస్తున్నారో ముందే చెప్తే తన మైండ్‌ను ప్రిపేర్ చేసుకుంటానని కెమెరాకు విన్నవించాడు. అయితే నెట్టింట వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లోకి వస్తుండగా వీకెండ్ ఎపిసోడ్లో దీప్తి సునయనను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట! మరి ఇది నిజమేనా? ఇందులో ఏదైనా ట్విస్టు ఉంటుందా? అన్నది చూడాలి! -
మళ్లీ లీక్ చేసిన బిగ్‌బాస్, అతడే చిట్టచివరి కెప్టెన్!
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ హౌస్‌లో చివరి కెప్టెన్ కోసం పోటీ జరుగుతోంది. ఎలాగైనా ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్ కెప్టెన్‌గా నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలే నిజమంటూ తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. ఇందులో షణ్ను చేతికి బ్యాండ్ ఉండటంతో అతడే కెప్టెన్ అయ్యాడని చెప్పకనే చెప్పాడు. ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయానని పింకీ బోరుమని ఏడ్చేయగా ఆమె కోసం సన్నీ, మానస్ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ బీబీ ఎక్స్‌ప్రెస్ అనే టాస్క్ ఇచ్చాడు. చుక్‌చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా హౌస్మేట్స్ బోగీల్లా మారుతారు. మొదటిసారి వీరంతా సరదాగా గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఈ గేమ్‌ను ఆస్వాదించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: నియంతలా శ్రీరామ్.. కెప్టెన్ అయ్యే అర్హత కాజల్‌కు లేదా?
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ అలా ముగిసిందో లేదో.. ఇంతలోనే ‘కెప్టెన్సీ టాస్క్’ అంటూ ఇంటి సభ్యుల మధ్య మరో చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ చాలా ఆసక్తి కనబర్చుతున్నారు. దీని కోసం ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. అందులో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్ వరకు వాళ్లు సేఫ్ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. ఈ టాస్క్‌లో ముందుగా సిరి నియంత సింహాసనం ఎక్కి..‘ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అమ్మాయిలు వాట్ టు డు.. వాట్ నాట్ టు డు’అంటూ హౌస్‌మేట్స్‌ని నవ్వించింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో మొదలైన గొడవను కెప్టెన్సీ టాస్క్‌లోనూ కంటిన్యూ చేశారు కాజల్, శ్రీరామ్. చాలెంజ్‌లో ఓడిన కాజల్, రవిలలో ఒకరిని సేవ్ చేసే చాన్స్ శ్రీరామ్‌కు వచ్చింది. ‘నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా’అని కాజల్ అడగ్గా, ‘నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్ అయితే ఏం చేసేదానివి’ అని శ్రీరామ్ ప్రశ్నించారు. కెప్టెన్ అయితే ఫెరింజన్లో కూర్చును’అని సమాధానం చెప్పింది కాజల్. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని శ్రీరామ్..అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్ బ్యాండ్ వేసుకోవాలి అంటూ రవిని సేవ్ చేశాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్ అయిందెవరో తెలియాలంటే.. ఆ వారం ఎపిసోడ్ చూడాల్సిందే. -
కాజల్‌పై భగ్గుమన్న శ్రీరామ్, దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన సన్నీ
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ కథ కంచికి చేరుకుంటోంది. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణంలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరంతా ఎవరికి వారు టాప్ 5కి చేరుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమలో నుంచి ఒకరిని పంపించే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈమేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై భగ్గుమని లేచాడు శ్రీరామ్. అందరూ ఒకరిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్ నుంచి సైడ్ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి పాస్ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్.. నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించాడు. తర్వాత సన్నీతోనూ పోట్లాటకు దిగాడు. సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్ అని ఒప్పుకున్నాడు. అంతెందుకు, నేను, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్.. ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్ డైలాగ్ విసరగా.. 'ఆ గ్రూపుకు నేను లీడర్‌ను' అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు సన్నీ. ఇదిలా వుంటే కెప్టెన్ మానస్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం! -
సిరి.. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం: రాజ్ తరుణ్
Bigg Boss Telugu 5, Anubhavinchu Raja Team Visits Bigg Boss House: బిగ్‌బాస్ షోలో అనుభవించు రాజా చిత్రయూనిట్ సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేశారు. రాజ్ తరుణ్‌ను చూడగానే సిరి ఎగిరి గంతేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని రాజ్ తరుణ్ చెప్పడంతో సిరి తెగ సిగ్గుపడిపోగా వెంటనే.. నీక్కాదులే అంటూ కౌంటరిచ్చాడు. తర్వాత ఇంటిసభ్యులకు డ్రాయింగ్ గేమ్‌తో కంటెస్టెంట్లను గుర్తించమని టాస్క్ ఆడించారు. ఇందులో ప్రియాంక పిచ్చిగీతలు ఒక్క మానస్‌కు మాత్రమే అర్థమయ్యాయి. ఆమె గీసిన గీతలను బట్టి అది శ్రీరామ్ అని మానస్ ఆన్సరివ్వడంతో అందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. నామినేషన్స్ నుంచి అందరూ సేవ్ అవగా చివర్లో ప్రియాంక, యానీ ఇద్దరు మాత్రమే మిగిలినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఇద్దరిలో యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి అదెంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
సన్నీ మీద పగ తీర్చుకున్నావా?: రవికి నాగ్ సూటి ప్రశ్న
Bigg Boss Telugu 5 Promo, Gold Evariki? Coal Evariki?: కంటెస్టెంట్ల తప్పొప్పులను సరిదిద్దేందుకు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో యాంకర్ రవికి స్ట్రాంగ్ కోటింగ్ పడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. బాగా ఆడిన వాళ్లకు గోల్డ్, వరస్ట్ పర్ఫామర్స్కు కోల్(బొగ్గు) ఇవ్వాలని చెప్పాడు నాగ్. రవి వరస్ట్‌గా ఆడింది సన్నీ అంటూ అతడి చేతికి బొగ్గందించాడు. దీంతో నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావా? అని రవిని సూటిగా ప్రశ్నించాడు. దీనికతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. టీషర్ట్స్ సరిగ్గా వేసుకోవాలని చెప్తూ ఉన్నా అతడు వినిపించుకోలేదని తప్పు సన్నీమీదకు తోసేశాడు. అయితే సన్నీ.. రూల్ బుక్‌లో టీ షర్ట్ పూర్తిగా ధరించాలని ఉందే తప్ప సరిగ్గా ధరించాలని రాసి లేదని చెప్పుకొచ్చాడు. ఇతడి వాదనతో ఏకీభవించని నాగ్.. మరి మానస్ మొదటి నుంచే ఎలా సరిగ్గా వేసుకున్నాడని తిరిగి ప్రశ్నించాడు. దొరికితే దొంగ అంటూ కాజల్ గేమ్‌పైనా సెటైర్లు వేశాడు. ఇక శ్రీరామ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో తనకొచ్చిన పవర్‌ను రవికిచ్చిన విషయం తెలిసిందేగా. అది నెగెటివ్ పవర్ అని తెలియగానే రవి ముఖం మాడిపోయింది. దీన్ని ప్రస్తావించిన నాగ్.. అతడికి బకరా రవి అన్న పేరు సరిగ్గా సెట్టవుతుందన్నాడు. ఇదిలా వుంటే హౌస్మేట్స్ ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోనున్నారనేది నేటి ఎపిసోడ్లో తెలియనుంది. -
హౌస్‌లో అవసరమా?.. దీప్తిని మిస్ అవుతే వెళ్లిపో
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ ఉండదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, కలిసిపోయినా, కబుర్లు చెప్పుకున్నా అన్నీ వాళ్ల మధ్యే! ఇల్లు గుర్తురాకుండా ఎవరికి వారు బిగ్‌బాస్ హౌస్‌లో తమకు నచ్చిన వ్యక్తులతో బాండ్ ఏర్పరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోనూ ఇదే జరిగింది. ఒక్కొక్కరూ ఒక్కో వ్యక్తికి కనెక్ట్ అయ్యారు. అలా సిరి- షణ్ముఖ్ క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారారు. కానీ కొన్నిసార్లు వారి చేష్టలు చూసిన నెటిజన్లు ఇది ఫ్రెండ్షిప్ కాదని, మరేదో అయ్యుంటుందని కామెంట్లు చేశారు. మొన్న షణ్ను.. తనను వెళ్లిపో.. అన్నందుకే సిరి ఏకంగా బాత్రూంలో దూరి తల బాదుకుని తనను తాను గాయపర్చుకుంది. ఈ చర్య అటు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. దీంతో వీళ్ల వ్యవహారమేంటో తేల్చుదామని డిసైడ్ అయ్యాడు నాగ్. నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావు? అని సిరిని నిలదీశాడు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా? అని ప్రశ్నించాడు. ఏం జరుగుతుందో చెప్పమని అడిగాడు. దీనికి సిరి.. ఏం జరుగుతుందో తనకే క్లారిటీ లేదని చెప్తూ ఏడ్చేసింది. కోట్లమంది నిన్నుచూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలి, అంతేకానీ అయ్యో ఇలా మాత్రం ఉండకూడదు అనుకోవద్దని చెప్తూ ఆమె పరువు తీశాడు. దీంతో ఓపెన్ అయిన సిరి.. షణ్నుతో ఎందుకు కనెక్షన్ వస్తుందో అర్థం కావట్లేదని వాపోయింది. ఇదే ప్రశ్న షణ్నుని అడగ్గా అతడు మానసికంగా వీక్ అయ్యానన్నాడు. తన ప్రేయసి దీప్తి సునయనను మిస్ అవుతున్నానని చెప్పాడు. అంతలా మిస్ అవుతే ఈ క్షణమే వెళ్లిపో అంటూ బిగ్‌బాస్ ఇంటి గేట్లు తెరిచాడు నాగ్. మరి షణ్ను.. సిరితో తన బంధాన్ని ఏమని నిర్వచిస్తాడు? వారి మనసులో జరుగుతున్న మానసిక సంఘర్షణకు నేటితోనైనా తెరపడుతుందా? అన్నది చూడాలి! -
యాక్టింగ్ నెం.1, ఇద్దరూ కాలిపోతే సన్నీ మిగులుతాడు
Bigg Boss Telugu 5, Sunny Wins Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే ఈ పాస్ కోసం ఇంటిసభ్యులు పోటీపడుతున్నారు. ఆ పాస్‌ను దక్కించుకునేందుకు బిగ్‌బాస్ 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగగానే ఫైర్ ఇంజన్ వ్యాన్‌లో కూర్చున్న ఇద్దరు ఇంటిసభ్యులు.. ఎదురుగా ఉన్న రెండు ఫొటోల్లోనుంచి ఒకరిని సేవ్ చేసి మరొకరి ఫొటోను కాల్చేయాలి. చివరి వరకు ఎవరి ఫొటో అయితే కాలకుండా ఉంటుందో వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుంది. ఈ క్రమంలో బజర్ మోగగానే మానస్, కాజల్ ట్రక్ ఎక్కారు. వీరికి ఎదురుగా యానీ, సిరి ఫొటోలు దర్శనమివ్వడంతో ఇద్దరూ తలలు పట్టుకున్నారు. మానస్.. యానీని సేవ్ చేయాలనుకుంటే, సిరి మాత్రం కాజల్‌ను సేవ్ చేద్దామంటుంది. కానీ వీళ్లిద్దరూ కాలిపోతే సన్నీ మిగులుతాడు అని చెప్తుంది కాజల్. ఒకరిని సేవ్ చేసే అధికారం ఉన్నప్పుడు ఇద్దరి ఫొటోలు కాల్చేయడం కరెక్ట్ కాదంటాడు రవి. మొత్తంగా ఈ గేమ్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క యానీ.. పింకీని యాక్టింగ్ నెంబర్ 1 అనడంతో ఆమె విరుచుకుపడింది. -
ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్న సన్నీ! కానీ వాడేది ఎవరికి?
Bigg Boss 5 Telugu Promo, Eviction Free Pass Task: బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది గెల్చుకున్న కంటెస్టెంట్ ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే వేరే ఎవరినైనా సేవ్ చేయవచ్చు. ఈ పాస్‌ను పొందడం కోసం బిగ్‌బాస్ నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా ఫైర్ అలారమ్ మోగినప్పుడు ఏ ఇద్దరు ట్రక్కులోకి వెళతారో వారు బర్నింగ్ హౌస్‌లో నుంచి ఒకరిని సేవ్ చేస్తూ మరొకరి ఫొటోను కాల్చేసే అధికారం పొందుతారు. అలా చివరి వరకు ఎవరి ఫొటో అయితే కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు పాస్ దక్కుతుంది. అయితే తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కన్నా జనాల ఓటింగే ముఖ్యం అని బిగ్‌బాస్‌కు షాకిచ్చాడు షణ్ముఖ్. ప్రేక్షకుల వల్లే ఇక్కడిదాకా వచ్చానని, గెలుపైనా, ఓటమైనా వాళ్ల చేతుల్లో నుంచి తీసుకోవాలని ఉందని చెప్పింది సిరి. అంటే షణ్ను- సిరి తమకు ఈ పాస్ అక్కర్లేదని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో సన్నీ గెలిచినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. అదే నిజమైతే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఈ వారమే వాడతాడా? ఒకవేళ వాడితే తనకోసం వాడతాడా? ఇతరులను సేవ్ చేయడానికి ఉపయోగిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది! -
నాకు నువ్వు అక్కర్లేదు, నేను ఒంటరివాడిని: ఏడ్చేసిన షణ్ను
Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth Feels Alone: గొడవపడటం, తిరిగి కలిసిపోవడం కామన్.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కూడా కంటెస్టెంట్లు టాప్ లేచిపోయేలా అరుచుకుంటారు, ఆ తర్వాత తిరిగి కలిసిపోతారు. కానీ ఆ గొడవలను మాత్రం చాలామటుకు మనుసులోనే పెట్టుకుని నామినేషన్స్ సమయంలో దాన్ని బయటకు తీస్తుంటారు. ఇది బిగ్‌బాస్ హౌస్‌లో సర్వసాధారణమైపోయింది. తాజాగా సిరి, షణ్ముఖ్ వాదులాడుకుంటున్నట్లు ప్రోమో వదిలారు. ఏ విషయానికో బాగా హర్టయిన షణ్ను ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. అతడిని అలా చూడలేకపోయిన సిరి షణ్నును ఓదార్చాలనుకుంది. కానీ అతడు మాత్రం 'నేను ఏడ్వటం వల్ల నువ్వేం తక్కువైపోవు, నేనే తక్కువవుతాను, నువ్వు పైకి వెళ్తావు. నా దగ్గరకు రాకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో' అని చెప్పాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని, నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ఏడ్చుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. షణ్ను బతిమాలినా సిరి గడియ తీయలేదు. కంగారుపడ్డ హౌస్మేట్స్ పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని బతిమాలడంతో చివరలో డోర్ తెరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సిరి, షణ్నుకు మధ్య ఏం జరిగింది? ఈ గొడవకు ఎవరు కారణం? షణ్ను ఎందుకు ఒంటరిగా ఫీలవుతున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్: నామినేషన్స్ రచ్చ.. యానీ వెకిలి నవ్వులు.. కాజల్ ఫైర్
బిగ్‌బాస్ ఐదో సీజన్ పదివారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. ఇక నుంచి గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతి చిన్న అంశం.. ఎలిమినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇంటి సభ్యులు ఆచి, తూచి ఆటను ఆడుతున్నారు. ఇంట్లో ఉన్న తొమ్మిది మందికి 11వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ‘అందరికీ మనసులో ఉన్న నిజాలు బయటపెట్టే ధైర్యం ఉండదు. నిజాలను నిర్భయంగా నిలదీసే అవకాశమే ఈరోజు జరిగే నామినేషన్’అంటూ ఇంటి సభ్యులను రెచ్చగొట్టాడు బిగ్‌బాస్. ఏ వ్యక్తినైనా నామినేట్ చేస్తే.. అందుకు గల కారణాలను ధైర్యంగా చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో.. ఇంటి సభ్యులు తమలో దాగిఉన్న కోపాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా సన్నీని టార్గెట్ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్లో తనకు ఫేక్ ట్యాగ్ ఇచ్చిన సన్నీని నామినేట్ చేశాడు రవి. ‘నీ తప్పు నీకు చెబితే.. నేను ఎలా ఫేక్ అనిపించానో నాకు అర్థం కాలేదు’అని రవి అడగ్గా.. ‘అందరి ముందు నాది బ్యాడ్ బిహేవియర్ అని చెప్పడాన్ని తీసుకోలేకపోయాను. నా గురించి నువ్వు మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే ఫేక్ అన్నాను. అయినా అది నా అభిప్రాయం. దాన్ని ఎవ్వరూ మార్చలేరు’అని సన్నీ బదులు ఇచ్చాడు. షణ్ముఖ్.. కాజల్‌ని నామినేట్ చేస్తూ... తన వల్లే ఇంటి సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయని, ఆమె బయటకు వెళ్లే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని కాజల్ తిప్పికొట్టింది.తన వల్ల ఇంట్లో ఒక్క గొడవ కూడా కాలేదని బదులు ఇస్తుండగా , యానీ మాస్టర్ వెకిలి నవ్వులు నవ్వింది. మరి ఈ వారం నామినేషన్లో ఎవరు ఉన్నారు? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నామినేషన్ రచ్చ ఎలా ఉందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
'టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లీ' యానీ నాగిణి డ్యాన్స్
Bigg Boss 5 Telugu Promo, Anee Vs Kajal: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ బీబీ హోటల్లో సరదాగా ఉన్న కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్క్ టవర్‌లో ఉంది పవర్లో మాత్రం కొట్లాటలకు దిగారు. సిరి, సన్నీ, కాజల్, రవి కెప్టెన్సీకి పోటీ పడగా మిగతా ఇంటిసభ్యులు వారికి మద్దతిచ్చారు. ఈ క్రమంలో కాజల్.. రవికి సపోర్ట్ చేస్తున్న యానీ మాస్టర్‌కు కితకితలు పెట్టి ఆమె ఆటను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఎప్పటిలాగే యానీ దీన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంది. ఇలా చేశావంటే ఈ టాస్క్‌లో నీపై అనర్హత వేటు వేస్తానని కాజల్‌ను హెచ్చరించింది. నువ్వు ఈ గేమ్‌లో ఓడిపోయాక ఎవరికి సపోర్ట్ చేస్తున్నావని అడిగింది. అందుకామె రవికి అని సమాధానమివ్వడంతో షాకైన యానీ.. రవికి సపోర్ట్ అంటూనే అతడికి మద్దతుగా నిలబడ్డవాళ్లకు గిలిగింతలు పెడతావా? అని నిలదీసింది. ఇందుకు కాజల్ నా గేమ్ అదే అని చెప్పింది. ఈ సమాధానంతో షాకైన యానీ.. 'నన్ను టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లి' అంటూ ఆవేశపడుతూ నాగిని డ్యాన్స్ చేసింది. 'నా పైసలు దొంగిలించావు, ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదు' అని విమర్శించింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు యానీ విశ్వరూపాన్ని చూసి మహానటి సాంగ్ ఆమెకు డెడికేట్ చేస్తున్నారు. ఆమె ఎందుకిలా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదని కామెంట్లు చేస్తున్నారు. -
ఎట్టకేలకు నామినేషన్ నుంచి తప్పించుకున్న రవి!
Bigg Boss Telugu 5, Ravi New Captain!: బుల్లితెర మీద హీరో అయిన యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో హీరో కాలేకపోతున్నాడు. బోలెడంత పాపులారిటీ, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మొదట్లో ఆడవాళ్ల గొడవల్లో ఇరుక్కుని, మాటలు మార్చుతూ, అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పుతూ జాతీయ ఛానల్లో తన పరువు తానే తీసుకున్నాడు. ఇలా చాలాసార్లు అబద్ధం చెప్తూ అడ్డంగా దొరికిపోయిన రవిపై హౌస్మేట్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా హౌస్‌లో జరిగిన బీబీ హోటల్ టాస్క్‌లో హోటల్ సిబ్బంది సేవలను చెడగొట్టాలని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందుకోసం అతడు కావాలని సన్నీ బెడ్ మీద నీళ్లు పోయడం, కాజల్ డబ్బులు దొంగిలించడం, కాజల్ వాటర్ బాటిల్లో కారం కలపడం వంటి పనులు చేశాడు. అయితే ఇవన్నీ రవియే చేశాడని అందరూ అనుమానపడ్డారు. పైగా అతడికి పైసా టిప్పు ఇవ్వద్దని ఓ నిర్ణయానికి వచ్చారు, కానీ ఈ మాట మీద ఎవరూ నిలబడలేదు అది వేరే విషయం. సీక్రెట్ టాస్క్ అంటేనే ఎవరికీ అనుమానం రాకుండా అప్పగించిన పనిని పూర్తి చేయడం. కానీ ఇక్కడ అందరికీ రవి సీక్రెట్ టాస్క్ చేస్తున్నాడని తెలిసిపోయింది. అయినప్పటికీ అతడు కెప్టెన్సీ పోటీదారుడిగా సెలక్ట్ అవడం, తర్వాతి గేమ్‌లో కెప్టెన్ అవడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. ఏదేమైనా ప్రతివారం నామినేషన్లో ఉంటున్న రవి ఎట్టకేలకు కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాడు. దీంతో వచ్చేవారం రవి నామినేషన్ టెన్షన్ లేకుండా హాయిగా గుండెల మీద చేతులేసి నిద్రపోవచ్చు. -
గేమ్ ఆడితే తంతా, అప్పడం అయితవ్!: సిరికి సన్నీ వార్నింగ్
Bigg Boss 5 Telugu Promo, Sunny Vs Shannu: ఈ వారం బిగ్‌బాస్ షో ఏ గొడవా లేకుండా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో సన్నీ, షణ్ముఖ్ తగవులాడారు. కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్లిద్దరూ పోట్లాటకు దిగారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్ 10వ వారం 'టవర్‌లో ఉంది పవర్' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కెప్టెన్సీ కంటెండర్లు సిరి, సన్నీ, రవి, కాజల్ తాము చేసిన టవర్‌ను కాపాడుకుంటూనే ఇతరుల టవర్‌ను కూల్చాల్సి ఉంటుంది. దీనికి ఇంటిసభ్యుల సాయం కూడా తీసుకోవచ్చు. అయితే తన టవర్ కూల్చాలనుకుంటున్న సన్నీని గట్టిగా పట్టేసుకుని ఆపే ప్రయత్నం చేసింది సిరి. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నన్నెందుకు పట్టుకున్నావని ఆవేశంతో ఊగిపోయాడు. 'నేను గేమ్ ఆడితే తంతా మరి! అప్పడం అయితవ్' అంటూ సిరికి వార్నింగ్ ఇచ్చాడు. ఇది నచ్చని షణ్ముఖ్ తనేం అనలేదు కదా అని సిరిని వెనకసుకొచ్చాడు. దీంతో మరింత ఉడికెత్తిపోయిన సన్నీ.. నువ్వాగు అంటూ అతడి మీదమీదకొచ్చాడు. దీంతో సీరియస్ అయిన షణ్ను.. నువ్వు తన్నలేవు? రా వచ్చి తన్ను అంటూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు. ఆడపిల్లను పంపించి నువ్వు మాట్లాడుతున్నావు, చేతగాని ఆటలు ఆడుతున్నావని ఫైర్ అయ్యాడు సన్నీ. మరి వీరిద్దరి మధ్య గొడవలు ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి! -
బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కండీషన్! పైసలిస్తేనే ఫుడ్!
Bigg Boss 5 Telugu Promo: బీబీ హోటల్ స్టాఫ్‌ను అతిథులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సకల సేవలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ప్రవర్తనతో స్టాఫ్ సిబ్బంది విసిగి వేసారినట్లు కనిపిస్తోంది. ఎంత పని చేసినా ఒక్కరూ పైసా ఇవ్వడం లేదని యానీ మాస్టర్ ఏడ్చేసింది. అయినప్పటికీ అతిథులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బతిమాలితే పనులు జరగవని అర్థం అయిన హోటల్ సిబ్బంది షణ్ముఖ్, శ్రీరామ్, రవి, యానీ ఓ నిర్ణయానికి వచ్చారు. అతిథులకు తిండి పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. 10 వేల రూపాయలు ఇస్తేనే ఫుడ్ పెడతామని వెల్లడించారు. ఇదెక్కడి కండీషన్ అని సిరి, మానస్, సన్నీ, ప్రియాంక, కాజల్ నోరెళ్లబెట్టారు. మరి వీరికి ఫుడ్ దొరుకుతుందా? లేదా? లేదంటే హోటల్లో ఫుడ్ దొంగిలించారా? అసలేం జరిగిందనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
పేరుకు రిచ్.. కానీ చేసేది దొంగతనం!
Bigg Boss Telugu 5 Latest Promo: గతంలో ఇచ్చిన బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌ను ఉన్నదున్నట్లుగా దింపాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో బీబీ హోటల్ రన్ అవుతోంది. ఇందులో జీవితంలోనే మొట్టమొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్‌కు వచ్చిన వ్యక్తిలా సన్నీ ఇరగదీస్తుంటే డాన్ కూతురిగా సిరి రెచ్చిపోతోంది. ఇక హనీమూన్ జంట కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పూలపాన్పుపై సన్నీ పడుకుని యానీకి రావాల్సిన టిప్పును చెడగొట్టాడు. షణ్ముఖ్, శ్రీరామ్, యానీ.. అతిథులకు అన్ని సపర్యలు చేసినా ఒక్కరూ సరిగా టిప్ ఇవ్వకపోవడంతో అసహనానికి లోనయ్యారు. తన దగ్గర దొంగిలించిన 1700 రూపాయలు తిరిగి ఇచ్చేదాకా పైసా టిప్పు కూడా ఇవ్వమని తెగేసి చెప్పింది కాజల్. అయితే మేము సర్వీసులు ఆపేస్తామని ఎదురు తిరిగాడు రవి. దీంతో సిరి, మానస్, కాజల్ హోటల్లో ఫుడ్ దొంగతనం చేసి తిన్నారు. మరి ఈ దొంగతనంపై హోటల్ సిబ్బంది ఎలా స్పందిస్తారు? దీనికి తగ్గ రుసుము వారి దగ్గరి నుంచి రాబడతారా? లేదా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: అందుకే ప్రియాంకకు సపోర్ట్ చేయం.. హిజ్రా ఫౌండర్ -
రవికి సీక్రెట్ టాస్క్, షణ్నును ఆడేసుకున్న సిరి
Bigg Boss Telugu 5 Today Promo: మరీ ఎక్కువగా ఆలోచిస్తే అన్నీ అనుమానాలే పుట్టుకొస్తాయి. బిగ్‌బాస్ కేక్ పంపించి ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంది? అని అడిగితే ఏ ఒక్కరూ టచ్ చేయలేకపోయారు. దీనివల్ల నామినేషన్లో పడతామేమో, లేదంటే నేరుగా ఎలిమినేట్ చేస్తారేమో అని రకరకాలుగా ఆలోచించారు. అయితే సన్నీ మాత్రం ఏదైతే అది అవుతుందని ఆ కేక్‌ను చటుక్కుమని తీసి లటుక్కున తినేశాడు. ఖరాబైతదని తింటున్నానంటూ కవరింగ్ ఇచ్చాడు. మరో ప్రోమోలో గత సీజన్‌లోని బీబీ హోటల్ టాస్క్ మరోసారి ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర, షణ్ముఖ్ చెఫ్స్ అండ్ వెయిటర్లుగా, మానస్- ప్రియాంక హనీమూన్ జంటగా, సన్నీ మొదటిసారి ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చిన గెస్ట్‌గా నటించాల్సి ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోయిన సిరి.. షణ్నుతో సపర్యలు చేయించుకుంది. దీంతో అతడు సిరితో అంత ఈజీ కాదు అని ఉన్నమాటనే పాట రూపంలో పాడుకున్నాడు. మరోవైపు బిగ్‌బాస్ యాంకర్ రవికి మరోసారి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి రవి ఆ సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా? బీబీ హోటల్లో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో రచ్చ చేసారో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో: ప్రియాంకపై సన్నీ సెటైర్లు
Bigg Boss 5 Telugu Today Promo: కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ఓ గిఫ్ట్ పంపాడు. నోరూరించే ఫుడ్ ఐటమ్‌ను పంపి ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది? అని అడిగాడు. దీంతో ఇంటిసభ్యులు దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. ఇది చూసిన సన్నీ 'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?' అని అడిగాడు. కాజల్ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ యానీ మాస్టర్ మాత్రం వద్దని వారించింది. ఇక శ్రీరామ్ అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరగా యానీ.. తాను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి తనకే అర్హత ఉందని చెప్పింది. అయితే ఇంటిసభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని చూసింది. ఇంతలో ప్రియాంక.. నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగా సన్నీ.. నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో, పో లోపలికి.. అని ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ కేక్ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? అనేది తెలియాలంటే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
షాక్: జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపేసిన బిగ్‌బాస్
Bigg Boss 5 Telugu: Jaswanth Out From BB5 House for Health Issues: బిగ్‌బాస్ సీజన్-5లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి(సోమవారం)ఎపిసోడ్లో సైతం జెస్సీ అస్వస్థతకు గురవగా, అతన్ని సీక్రెట్ రూంలో ఉంచి చికిత్స అందించారు. అయితే అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడం సహా సమస్య పెద్దది కావడంతో బిగ్‌బాస్ జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపించాడు. ఈ ఊహించని పరిణామంతో హౌస్మేట్స్ షాక్‌కి గురయ్యారు. ముఖ్యంగా జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్ సిరి, షణ్నుక్ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా కాసేపటి క్రితమే ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో సంపూర్ణేష్ బాబు, తర్వాత గంగవ్వ, నోయల్ ఇలా గేమ్ మధ్య నుంచి బయటకు వచ్చేసిన వారే.మరోవైపు జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని టాక్ వినిపిస్తుంది. Health issue valla #Jessie house bayatiki vellalsi undi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/GDDNA5VNyc — starmaa (@StarMaa) November 9, 2021 -
రెండోసారి జైలుపాలైన నాగిని!
సండే ఫండే అంటూనే నాగార్జున బిగ్‌బాస్ ఇంట్లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని హౌస్‌మేట్స్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. తొలుత సన్నీ తటపటాయిస్తూనే షణ్నును వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డాడు. మానస్ కూడా షణ్నునే వరస్ట్ అని పేర్కొన్నాడు. శ్రీరామ్ వరస్ట్ పర్ఫామర్ అన్న ట్యాగ్‌ను కాజల్‌కు ఇచ్చాడు. తర్వాత యానీ వంతు రాగా.. ఆమె ఎలాగో నేనే చెత్తగా ఆడానంటుందని మైండ్‌లో బలంగా ఫిక్సైన కాజల్.. ఈ ట్యాగ్ ఎందుకు తీయడం? నేనే ఉంచుకుంటానులేనని చెప్పుకొచ్చింది. దీంతో చిరాకుపడ్డ యానీ.. ఇదే సార్ ప్రాబ్లమ్ అంటూ నాగ్ ముందు ఇరిటేట్ అయింది. అయితే యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డట్లు ప్రోమోలో తెలుస్తోంది. మొత్తానికి ఈ టాస్క్‌లో ఎక్కువమంది కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మరోసారి జైల్లో పడిందని సమాచారం! ఇక ఈ వారం గేమ్‌లో విశ్వరూపం చూపించే విశ్వ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే బిగ్‌బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను కోల్పోతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. -
వాళ్లెవరూ కాదు, ఆ కంటెస్టెంటే సుందరి: శ్రీరామ్
Bigg Boss 5 Telugu Promo: నాగార్జున క్లాస్ పీకిన తర్వాత హౌస్‌లో చాలా మార్పులు వచ్చాయి. సన్నీ తన కోపాన్ని వదిలేసి చాలా కూల్ అయిపోయాడు. దీంతో అతడితో ఎప్పుడూ గొడవ పడే శ్రీరామ్, షణ్ముఖ్ కూడా సన్నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇందుకు తాజా ప్రోమోనే నిదర్శనం. ఒక పాట ప్లే చేసిన నాగ్.. దీనికి సరిపోయే సుందరి ఎవరని ప్రశ్నించాడు. హౌస్‌లో నలుగురు అమ్మాయిలు ఉన్నప్పటికీ శ్రీరామ్ మాత్రం వాళ్లందరినీ కాదని సన్నీ పేరు చెప్పాడు. దీంతో నవ్వాపుకోలేకపోయిన నాగ్ చివరికి సన్నీని సుందరిని చేశారని కామెంట్ చేస్తాడు. నేనెవర్ని గేమ్‌లో ఇంటిసభ్యులు ఒకరినొకరిని ఇమిటేట్ చేయడంతో పాటు డ్యాన్సులు చేశారు. ఈ క్రమంలో షణ్ను, సన్నీ కలిసి స్టెప్పులేశారు. ఇది చూసిన నెటిజన్లు మార్పు మంచిదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సన్నీ, మానస్ స్నేహాన్ని మిస్ అవుతున్నామంటున్నారు మరికొందరు. -
ఈ విలన్ లేకపోతే నేను హీరో కాలేను: షణ్ను
ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. దాదాపు అందరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. తాజాగా నాగార్జున వీరికి.. మీకు హౌస్‌లో ఎవరు హీరో? ఎవరు విలన్? అనే గేమ్ ఆడించారు. దీంతో యానీ.. కాజల్‌ను విలన్ అని తేల్చేసింది. ప్రియాంక, శ్రీరామ్.. సిరిని విలన్‌గా పేర్కొన్నట్లు కనిపిస్తోంది. ఇక రవి, షణ్ను ఇద్దరూ ఒకరికొకరు విలన్ ట్యాగ్ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా షణ్ను.. ఈ విలన్ లేకపోతే తాను హీరో అవలేనని చెప్పుకొచ్చాడు. ఇక ప్రియాంక.. తనకు మానస్ హీరో అని చెప్పగా అతడు కాకుండా వేరే పేరు చెప్పమని అడిగాడు నాగ్. నిన్ను ఎంత ఏడిపించినా అతడే హీరోనా? అని ప్రశ్నించగా అవునని తలూపుతూ సిగ్గుపడిపోయింది పింకీ. ఇక సిరి.. షణ్ను ఎప్పుడూ హీరోనే అంటూ అతడికి హీరో ట్యాగ్ ఇచ్చింది. దీంతో వీళ్ల ఫ్రెండ్షిప్ను చూసి సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. ఇక సన్నీకి ఎవరూ విలన్, హీరో ట్యాగ్ ఇవ్వకపోవడంతో తెగ బాధపడిపోయాడు. ఏదో ఒకటి ఇచ్చి చావచ్చు కదా అన్నాడు. దీంతో నాగ్.. సన్నీ విలన్‌కు, హీరోకు మధ్యలో ఉండే కమెడియన్ అని సెటైర్ వేశాడు. -
షణ్ను మీద ప్రతీకారం తీర్చుకున్న రవి!
ప్రతివారం యాంకర్ రవి మీద విరుచుకుపడే నాగార్జున ఈసారి మాత్రం అతడిని మెచ్చుకున్నాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవి కష్టాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాడు. నీకు నరకం అంటే ఏంటో చూపించారు కదా! ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు నాగ్. ఇంకేముందీ.. ఏది దొరికితే అది కలిపి వరుసగా నాలుగైదు గ్లాసుల డ్రింక్ తాగిపించి తనను అష్టకష్టాలు పెట్టిన షణ్ముఖ్‌ను ఓ ఆటాడుకున్నాడు రవి. నచ్చినవి, నచ్చనవి అన్నీ కలిపి జ్యూస్ తయారు చేశాడు. ఆ జ్యూస్‌ను షణ్ను కళ్లు మూసుకుని తాగి అవస్థలు పడ్డాడు. తర్వాత శ్రీరామ్ తను ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నీని ఎంచుకున్నాడు. ఉల్లిపాయ తింటూ జ్యూస్ తాగమని శ్రీరామ్ చెప్పగా ఏదో జన్మలో నువ్వు నాకు మొగుడివయ్యుంటావన్నాడు సన్నీ. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇంకా ఎవరెవరు ఎలా పగ తీర్చుకున్నారో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బిగ్‌బాస్: తొమ్మిదో వారం కెప్టెన్‌గా ఊహించని కంటెస్టెంట్!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఓ కొలిక్కి చేరినట్లే కనిపిస్తోంది. 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్' టాస్క్‌లో విలన్లు గెలిచినట్లు సమాచారం. దీంతో ఆ టీమ్‌లో ఉన్న రవి, యానీ, సన్నీ విశ్వ, సిరి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. అయితే కెప్టెన్సీ పోటీలో యానీ విజయం సాధించి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఆమె కష్టానికి ఇంటిసభ్యుల సహకారం తోడవడంతోనే యానీ కెప్టెన్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె ఎవరిని రేషన్ మేనేజర్‌గా ఎంచుకుంటారో చూడాలి! కాగా ప్రస్తుతం హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో విశ్వ, సిరి, జెస్సీ, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ ఇదివరకే కెప్టెన్సీని అనుభవించారు. కానీ కాజల్, రవి, ప్రియాంక, మానస్ మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ కాలేకపోయారు. ప్రతిసారి ఎలాగైనా గెలుద్దామని కెప్టెన్సీ కోసం గట్టిగా పోటీపడినప్పటికీ చివరి క్షణంలో ఓటమిపాలవుతున్నారు కెప్టెన్ కోసం పోటీపడుతూ చివరిదాకా వచ్చి ఆగిపోతున్నారు. మరి రానున్నరోజుల్లో వీరు కెప్టెన్ అవుతారో, లేదో చూడాలి! -
షణ్నుకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలీదు, అతడు ఫేక్: ఏడ్చేసిన సిరి
Bigg Boss Telugu Promo: బిగ్‌బాస్ అనుకుంటే ఏదైనా చేయగలడు. ఫ్రెండ్స్‌ను బద్ధ శత్రువులుగా, శత్రువులను మిత్రువులుగా మార్చగలడు. ప్రస్తుతం హౌస్‌లో సిరి, షణ్నుకు మధ్య ఫైట్ నడుస్తోంది. గత రెండు రోజులుగా వీరి మధ్యనున్న మనస్పర్థలు, గొడవలు నేడు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. స్నేహితుడిగా తనకు సపోర్ట్ చేయాల్సినవాడే జెన్యూన్‌గా ఆడలేదని విమర్శించడం, అందరి ముందే తనను దారుణంగా నిందించడం, కావాలని గొడవ చేయడం వంటి విషయాలను తట్టుకోలేకపోయింది సిరి. మరోసారి భోరుమని ఏడ్చేస్తూ షణ్ను మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. 'అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు, వాడికి ఫ్రెండ్షిప్ విలువ తెలిస్తే కదా! అంతా ఫేక్, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ఉంటున్నాడు. నా ఫ్రెండ్షిప్కు వాల్యూ లేకుండా అయిపోయింది' అంటూ భోరుమని ఏడ్చేసింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు షణ్ను తన స్నేహాన్ని పక్కనపెట్టి సంచాలకుడిగా, కెప్టెన్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని, అతడు ఫేక్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. సిరి అనవసరంగా మరీ ఎమోషనల్ అయిపోయి అటు తన గేమ్‌తో పాటు షణ్ను గేమ్ కూడా నాశనం చేస్తోందంటున్నారు. మరి షణ్ను ఈ పరిస్థితిని ఎలా డీల్ చేస్తాడో చూడాలి! -
యాటిట్యూడ్‌తో సన్నీని మళ్లీ రెచ్చగొట్టిన షణ్ను
బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు ఒకరినొకరు తోసుకుంటూ నెట్టేసుకుంటూ గొడవలకు దిగుతున్నారు. అలా నెట్టేయడం కరెక్ట్ కాదని విశ్వకు సూచించాడు మానస్.. ఇదిలా వుంటే స్వాప్ ఆప్షన్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తమ టీమ్‌లోని ఒకరిని మరొక టీమ్‌లోని ఒకరితో స్వాప్(మార్పు) చేసుకోవాలని చెప్పాడు. దీంతో తమ టీమ్‌లో నుంచి ఎవరిని పంపించి అవతలి టీమ్‌లో నుంచి ఎవరిని తీసుకోవాలా? అని ఆలోచనలో పడ్డారు హౌస్మేట్స్. అయితే సన్నీ.. ఇదొక ఆప్షన్ మాత్రమేనని చెప్పగా షణ్ముఖ్ మధ్యలో అడ్డుకుంటూ ఇది ఆప్షన్ కాదని చెప్పుకొచ్చాడు. అవకాశం ఇస్తున్నాం అంటే అదొక ఆప్షన్ మాత్రమేనని.. తెలుగులో ఎవరికైనా ఇదే అర్థమవుతుందని సన్నీ పేర్కొనగా అయితే నేను ఇంగ్లీషులో విన్నాను అని ఫైర్ అయ్యాడు షణ్ను. నేను చాలా కూల్‌గా చెప్తున్నా.. అని సన్నీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ ఏసీ వేయలేదు, వేడిగా ఉందని అతడు కౌంటరిచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ మధ్య మరోసారి లొల్లి షురూ అయింది. నాకూ యాటిట్యూడ్ ఉంటుంది, కానీ అది వేరే ఉంటుంది అని సన్నీ వార్నింగ్ ఇవ్వగా చూపించమని రెచ్చగొట్టాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పిన స్వాప్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమేనా? లేదా తప్పనిసరిగా స్వాప్ చేయాల్సిందేనా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
టార్గెట్ ప్రియాంక.. షణ్నుతో అవసరం లేదన్న సిరి
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ప్రారంభమై అప్పుడే 50 రోజులు పూర్తైపోయింది. ఇప్పటివరకు పలువురు కంటెస్టెంట్లు కెప్టెన్‌గా ఎన్నికవగా కొంతమంది కెప్టెన్సీ పోటీదారుల వరకు వచ్చి ఆగిపోయారు. అలాంటివారు ఈసారి ఎలాగైనా కెప్టెన్ అయి తీరాలని గట్టి కసి మీదున్నారు. ఈ క్రమంలో రవి టాస్క్‌లో సూపర్ హీరోస్ ఇచ్చిన అరాచకమైన టాస్కులను కూడా అతి సునాయాసంగా పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇక శ్రీరామ్ కూడా తన శక్తి మేర ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తాజా ప్రోమో చూస్తుంటే ఈసారి ప్రియాంక వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. సూపర్ విలన్స్ టీమ్ పింకీను టార్గెట్ చేసింది. పేడస్నానం, రంగు మీద పోసుకోవడం వంటివే కాకుండా తనకు ఇష్టం లేని జ్యూస్‌లు తాగమని ఇచ్చాడు రవి. దీంతో పింకీ ఏడుపు ముఖం పెట్టింది. కానీ ఆమె మాటలు వింటుంటే దాన్ని తాగడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేను నా కోసం ఆడుతున్నాను అన్న పింకీ మాట విన్న రవి.. దీని కోసం కదా, మీ అన్నయ్యలంతా ఎదురుచూస్తోంది అన్నాడు. ఇది విన్న మానస్.. కవర్ డ్రైవ్ అని గాలి తీసేశాడు. మరోపక్క ఈ సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ సిరి, షణ్నుల మధ్య అగాధాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. నాతో నీకేదైనా ప్రాబ్లమా షణ్ను? అని సిరి అడగ్గా అతడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడతాను అని చెప్పాడు. దీనికి సిరి అప్పుడు నువ్వు మాట్లాడినా నాకవసరం లేదు అని తేల్చేసింది. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో విలన్స్ టీమ్ గెలిచినట్లు సమాచారం! అంటే హీరోస్ టీమ్‌లో పింకీ, శ్రీరామ్ గెలిచినప్పటికీ వాళ్ల టీమ్ ఓడిపోయింది. -
తోసేశారంటూ మొత్తుకున్న సిరిపై షణ్ముఖ్ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం ఫైట్ నడుస్తోంది. ఇంటిసభ్యులను విలన్స్, హీరోస్ అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు బిగ్‌బాస్. రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ విలన్స్ టీమ్‌లో ఉండగా మిగిలినవారంతా హీరోస్ టీమ్‌లో ఉన్నారు. విలన్స్ టీమ్ వాళ్లను ఎమోషనల్‌గా దెబ్బ తీయాలని ప్లానులు రచిస్తున్నాడు బ్రహ్మ అలియాస్ షణ్ముఖ్. దీన్ని వెంటనే అమల్లో పెట్టాడు శ్రీరామ్. తన జుట్టు తీసేయబోతున్న జెస్సీతో అతడి కోసం తన లెటర్‌ను త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. మరోవైపు గేమ్‌లో ప్రియాంక ఎవరి మీదో బాగానే ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సిరి.. తనను నిర్దాక్షిణ్యంగా తోసేశారంటూ గగ్గోలు పెట్టింది. అయితే షణ్ను మాత్రం ఊరికే అన్నింటికి కంప్లైంట్ చేయకు, నువ్వు చేసింది కూడా మాట్లాడు అని కౌంటరివ్వడం గమనార్హం. ఇక ఈ వారం కెప్టెన్ షణ్ను మినహా మిగిలిన 10 మంది నామినేషన్లోకి వచ్చారు. కానీ వారిలో ఇద్దరు మానస్, యానీ సూపర్ పవర్స్ సాయంతో సేవ్ అయ్యారు. దీంతో ఈ వారం 8 మంది నామినేషన్లో నిలిచారు. -
Bigg Boss 5 Telugu: దుస్తులిప్పి నిలబడటానికైనా రెడీ: రవి
Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదోవారం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్ మినహా ఇంటి సభ్యులందరిని నామినేషన్స్‌కి పంపిన బిగ్‌బాస్.. టాస్క్పేరుతో ఇద్దరిని సేఫ్ జోన్లోకి పంపాడు. దీంతో ఈ వారం నామినేషన్లో ఎనిమిదిమంది ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసిందో లేదో.. ఇంటి సభ్యులకు మరో గండం వచ్చిపడింది. అదే కెప్టెన్సీ టాస్క్. ఇందులో భాగంగా ఈ వారం ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనికోసం ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. విలన్స్ టీమ్‌లో రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ ఉన్నారు. టీమ్‌ని రవి లీడ్ చేస్తున్నాడని, అతన్ని పడగొడితే టీమ్ మొత్తం సెట్ అయిపోతుందని షణ్ముఖ్ తన టీమ్ సభ్యులకు చెబుతున్నారు. మరోవైపు యాంకర్ రవి టాస్క్ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా’అని తన సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. రవిని టార్గెట్ చేసిన హీరోస్ టీమ్.. అతనికి ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అయితే రవి మాత్రం అన్నింటికీ తెగించి టాస్క్‌లు ఆడుతున్నాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: యానీ మాస్టర్‌కు స్పెషల్ పవర్.. సేఫ్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ ఇంట్లో తొమ్మిదోవారంలో 10 మంది నామినేషన్లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. ఇంటి సభ్యులంతా నామినేషన్లోకి వచ్చేశారు. అయితే ఆ 10 మంది నుంచి కొంతమందిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. దీని కోసం ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఏ సభ్యుడైతే తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని గార్డెన్ ఏరియాలోని సేఫ్ జోన్ డోర్‌లోకి ముందుగా వెళతారో వారు సేఫ్ అవుతారు... చివరగా వెళ్లేవారితో పాటు.. వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. దీంతో పాటు ఇంటి సభ్యులకు మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. గతవారం ఓ టాస్క్‌లో విజయం పొందిన యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్పెషల్ పవర్ ద్వారా ఒక కంటెస్టెంట్‌ను సేఫ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఆ స్పెషల్ పవర్ ద్వారా సేఫ్ అయ్యేది ఎవరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 5 Telugu: ఆ 10 మందికి సూపర్ చాన్స్.. పాపం కాజల్!
బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా..మిగిలిన సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల సేఫ్ అయ్యాడు. అయితే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: లోబో అన్ని లక్షలు వెనకేసుకున్నాడా?) గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్‌లోకి తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని పరుగెత్తాలి. వీరిలో ఎవరైతే చివరిగా సేఫ్‌జోన్ డోర్‌లోకి వెళ్లారో.. ఆ సభ్యుడితో పాటు అతని చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. ఈ గేమ్‌లో కాజల్, శ్రీరామచంద్ర తొలి రౌండ్లోనే డేంజర్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాజల్ ఫోటో ఉన్న బ్యాగును తీసుకున్న శ్రీరామచంద్ర.. ముందుగా గార్జెన్ ఏరియాలోకి వచ్చినప్పటికీ.. కావాలనే సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్లనట్లు తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి.. నామినేషన్స్ నుంచి బయటపడ్డారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే. -
రా, వచ్చి కొట్టు.. వెయిట్ చేస్తున్నా: సన్నీని రెచ్చగొట్టిన షణ్ను
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీని ఆపడం ఎవరివల్లా కావట్లేదు. అతడి ఆవేశాన్ని చల్లార్చడం ఒక్క నాగార్జున వల్లే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఇంటిసభ్యులను రెండుగా విభజించిన బిగ్‌బాస్ వారికి పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. దీనికి షణ్ముఖ్ సంచాకుడిగా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ 50 పూరీలు ముందుగా రెడీ చేసినప్పటికీ షణ్ను.. యానీ మాస్టర్ టీమ్ చేసిన పూరీలే పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ వారిని గెలిపించాడు. అయితే జైల్లో ఈ టాస్క్‌ను మొదటి నుంచీ గమనిస్తోన్న సన్నీ.. పాపం వాళ్లు కష్టపడి చేశారని పేర్కొన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తది, వేరేవాళ్ల కష్టం కనిపించదా? మాట్లాడేందుకైనా బుద్ధి ఉండాలి అని మండిపడింది. సన్నీ మీదకు ఫైర్ అవడంతో శ్రీరామ్, షణ్ముఖ్ నవ్వాపుకోలేకపోయారు. హౌస్‌లో కొంతమంది బాధపడుతుంటే నవ్వుతున్నావు, అది కరెక్ట్ కాదు, బయటకొస్తా ఆగు అని సూచించాడు. దీంతో షణ్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు సన్నీ. దీంతో అతడిని మరింత రెచ్చగొడుతూ షణ్ను.. అయితే కొట్టు మరి వెయిట్ చేస్తున్నా అని సవాల్ చేశాడు. మరి సన్నీ జైలు నుంచి బయటకొచ్చాక ఏం జరిగింది? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
తన్నడం కరెక్టా?: సన్నీ ఫొటో చించి పడేసిన నాగ్
Bigg Boss 5 Telugu Promo: కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద లొల్లే జరిగింది. టాస్క్ ముగిసి షణ్ముఖ్ కెప్టెన్ అయినా కూడా సన్నీ, మానస్ దాన్నే తలుచుకుంటూ ఓపక్క బాధపడుతూ, మరోపక్క హౌస్మేట్స్ మీద నిప్పులు చెరిగారు. ముఖ్యంఆ ఆ టాస్క్‌లో సంచాలకుడిగా వ్యవహరించిన జెస్సీని ఆడేసుకున్నారు. అతడు కూడా వీళ్లిద్దరికీ గట్టిగానే సమాధానమిచ్చాడు. తాజాగా ఈ గొడవను ప్రస్తావిస్తూ సన్నీని ఆడేసుకున్నా హోస్ట్ నాగ్. తొండిగా ఆడటమేంటని కాజల్ మీద సెటైర్ వేశాడు నాగ్. హౌస్‌లో ఏమైనా అన్యాయం జరుగుతోందా? అని నాగ్ అడగ్గా సంచాలకుడి నిర్ణయం నచ్చలేదని చెప్పాడు మానస్. దీంతో నాగ్.. సంచాలకుడి నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశాడు. ఇక సన్నీ.. తనను చాలామంది ప్రొవోక్ చేశారని చెప్పగా అభ్యంతరం వ్యక్తం చేసిన నాగ్.. మీద మీదకు వెళ్లిపోతావా? అని నిలదీశాడు. ఒక మనిషి ఒక వస్తువు పట్టుకుంటే దాన్ని తన్నడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రూల్స్ ఉన్నాయి కాబట్టే వాళ్లు తిరిగి కొట్టలేదని చెప్తూ అతడి ఫొటోను చింపి పడేశాడు నాగ్. తర్వాత నాగ్.. కంటెస్టెంట్లతో వైకుంఠపాళి ఆడించాడు. రవి తన మైండ్ చదివేస్తాడేమోనని భయంగా ఉందన్నాడు షణ్ను. ఏంటి? రవి బ్రహ్మ మైండ్‌నే చదివేస్తున్నాడా! అని ఆశ్చర్యపోయాడు నాగ్. ఒకపక్క పంచాయితీలు, మరోపక్క టాస్క్‌ల వినోదాలు.. అన్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
షణ్ముఖ్‌కు ముద్దు పెట్టిన సిరి, కోపంతో ఊగిపోయిన యానీ మాస్టర్..
Bigg Boss 5 Telugu 5 Latest Promo: Siri Kiss To Shanmukh Jaswanth: తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్ ప్రారంభమై 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంతకాలం గొడవలు, వివాదాలు, అలకలతో సాగిన బిగ్‌బాస్ హౌజ్‌లో నేడు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ప్రోమో షణ్ను మాట్లాడుతూ.. ‘మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతాం’ అని అనగానే సిరి ‘నేను బాగానే ఉన్నా రా.. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా’ అని అంటుంది. వెంటనే ‘అయితే దూరం పెట్టుకో..’ అని షణ్ను అంటాడు. అలా వారి మధ్య సంభాషణ జరిగిన కాసేపటికి షణ్ముఖ్ ‘అరె.. ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్’ అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు ముద్దుపెట్టి వెళుతుంది. ఆ తర్వాత షణ్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ ‘అరె ఎంట్రా ఇది’ అంటూ ఎప్పటిలాగే తన డైలాగ్‌ను వాడతాడు. అలాగే ‘అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది’ అంటూ ఫన్నీగా అంటాడు. దీంతో సిరి-షణ్ముఖ్‌ల స్నేహం కాస్తా కొత్త బంధానికి తెరలెపనుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, అనీ, సన్నీ, మానస్లు పోటీలో విజయం సాధించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు బిగ్‌బాస్ ‘వెంటాడు వేటాడు’ అనే టాస్క్ ఇచ్చాడు. థర్మాకోల్‌తో నిండిన గోనె సంచులను కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన బిగ్‌బాస్.. బజర్ మోగేలోపు ఎవరి సంచిలో ఎక్కువ బాల్స్ ఉంటాయో వారే ఈ వారం కెప్టెన్ అవుతారని సూచించాడు. టాస్క్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రత్యర్థుల సంచులను ఖాళీ చేయడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. ఇక యానీ మాస్టర్.. సిరి-షణ్ముఖ్‌లపై రగిలి పోవడంతో ఈ టాస్క్‌లో కాస్తా ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. -
కాలితో తన్నిన సన్నీ, పోటుగాడివా అంటూ జెస్సీ ఫైర్
Bigg Boss 5 Telugu Promo, Final Fight For Captaincy: కెప్టెన్సీని దక్కించుకునేందుకు కొట్టుకోవడానికి కూడా వెనుకాడట్లేదు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. తాజాగా హౌస్‌లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్‌లో పెద్ద రగడ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను ఓడించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయితే సంచాలకుడైన జెస్సీ సర్కిల్ దాటి బయటకు వచ్చిన శ్రీరామ్, మానస్ ఇద్దరూ ఔట్ అని ప్రకటించాడు. కానీ అంతలోనే మాట మారుస్తూ శ్రీరామ్ ఇంకా ఆటలోనే ఉన్నాడని, అతడు కొనసాగొచ్చని వెల్లడించాడు. దీంతో షాకైన సన్నీ.. ఇద్దరూ ఔట్ అని చెప్పాక మళ్లీ కొత్తగా ఇదేంటని ఫైర్ అయ్యాడు. ఆవేశంతో జెస్సీ ముందున్న సంచిని కాలితో తన్నాడు. అతడి చర్యకు చిర్రెత్తుకొచ్చిన జెస్సీ.. కాలితో కొడతావేంటి? పెద్ద పోటుగాడిలాగా! అంటూ మండిపడ్డాడు. మరి జెస్సీ నిజంగానే గేమ్‌లో పక్షపాతం చూపించాడా? లేదా అనవసరంగా సన్నీ, మానస్ అతడితో గొడవకు దిగుతున్నారా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
కెప్టెన్‌గా అవతరించిన షణ్ముఖ్, ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
Bigg Boss 5 Telugu Promo, Shannu New Captain Of BB House: బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్సీ కోసం ఫైట్ నడుస్తోంది. 'అభయహస్తం' టాస్క్‌లో పెట్టిన పలు ఛాలెంజ్‌లను సమర్థవంతంగా పూర్తి చేసిన షణ్ను, మానస్, సన్నీ, సిరి, యానీ, శ్రీరామ్ 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పోరాడనున్నారు. ఈ గేమ్‌లో పోటీదారులు ఇతరుల థర్మాకోల్ బస్తాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆటలో భాగంగా శ్రీరామ్ సన్నీని నెట్టేయడంతో అతడు కింద పడ్డాడు. నన్నే నెట్టేస్తాడా? అని ఆవేశపడ్డ సన్నీ.. శ్రీరామ్ బస్తాను ఖాళీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఈ గేమ్‌లో మొదటగా సన్నీ అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఒక పక్క కోపం, మరోపక్క ఓటమి బాధతో రగిలిపోయిన ఈ కెప్టెన్ 'అటాక్ చేయండి' అని ఆదేశాలిచ్చాడు. దీంతో శ్రీరామ్ అతడిని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. 'సన్నీ ఇండింపెండెంట్ ప్లేయర్ అనుకున్నా, ఆడి ఓడిపోయినవ్.. గొంతు అదుపులో పెట్టుకో' అని వార్నింగ్ ఇస్తూనే గాల్లో ముద్దులు పంపాడు. ఈ గేమ్‌కు జెస్సీ సంచాలకుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ గేమ్‌లో షణ్ముఖ్ విజయం సాధించి బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు షణ్ను కెప్టెన్ అయ్యాడోచ్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. షణ్ను.. రేషన్ మేనేజర్ పోస్టును యానీకి ఇచ్చినట్లు సమాచారం! మరి కెప్టెన్‌గా షణ్ను బిగ్‌బాస్ హౌస్‌ను ఎలా చక్కబెడతాడు? తన కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
'ఎవడిక్కావాలి నీ సారీ'.. ఉలిక్కిపడ్డ శ్రీరామ్
Bigg Boss Telugu 5 Promo-Captaincy Task Fight Between Kajal and Sunny: ఈసారి కెప్టెన్సీ టాస్క్‌ను భిన్నంగా నిర్వహిస్తున్నాడు బిగ్‌బాస్. హౌస్‌నంతా లాక్డౌన్లో పెట్టి కంటెస్టెంట్లను బయటే ఉండాలని ఆదేశించాడు. తను ఇచ్చే టాస్కుల్లో గెలుపొందినవారు మాత్రమే ఇంటి లోపలికి వెళ్లేందకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు ఛాలెంజ్‌లు పూర్తి కాగా వాటిలో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ విజయం సాధించారు. నేడు జరగబోయే మరో రెండు ఛాలెంజ్‌లలో సన్నీ, యానీ మాస్టర్ గెలిచినట్లు సమాచారం. అయితే ఈ ఐదుగురితో పాటు ఇంకో కంటెస్టెంట్ కూడా కెప్టెన్సీకి పోటీపడేందుకు స్పెషల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఓ సర్కిల్ మధ్యలో బంతిని పెట్టి దాన్ని ముందుగా అందుకున్నవాళ్లు కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారని ప్రకటించాడు. ఈ గేమ్‌లో మానస్ గెలుపొందినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు షణ్ను, సిరి మరోసారి గొడవపడ్డారు. దీంతో ఎప్పటిలాగే సిరికి సారీ చెప్పాడు షణ్ను. అయితే అప్పటికే అలకమంచం ఎక్కిన సిరి.. నాకొద్దు నీ సారీ అంటూ బుంగమూతి పెట్టుకుంది. సారీ చెప్పాను కదా, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్? అని షణ్ను అనడంతో మండిపోయిన సిరి.. ఎవడిక్కావాలి నీ సారీ అంటూ ఫైర్ అయింది. సడన్‌గా ఏమైంది? అని శ్రీరామ్ ఉలిక్కిపడగా ఇదంతా మాకు మామూలే అంటూ ఓ లుక్కిచ్చాడు షణ్ను. -
కెప్టెన్సీ పోటీలో ఆరుగురు! తగ్గేదేలే అంటూనే జెస్సీ వెనకడుగు!
Bigg Boss Telugu 5, Captaincy Task Fight Between Priyanka Singh And Anee Master: కెప్టెన్ అవడానికి హోరాహోరీగా పోరాడుతున్నారు కంటెస్టెంట్లు. అందులో భాగంగా బిగ్‌బాస్ ఇస్తున్న ప్రతీ టాస్క్‌ను చీల్చి చెండాడేస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీకి పోటీపడేందుకు ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో మొదటి ఛాలెంజ్‌లో షణ్ముఖ్, రెండోదాంట్లో సిరి, మూడవ టాస్క్‌లో శ్రీరామచంద్ర గెలుపొందారు. నేడు మిగిలిన రెండు ఛాలెంజ్‌లు పూర్తి చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్. తాజాగా రిలీజైన ప్రోమో మేరకు.. రంగు పడుద్ది అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు ప్రియాంక సింగ్, యానీ మాస్టర్.. ఎవరికివారే తీవ్రంగా శ్రమించారు. ఇక ఐదో ఛాలెంజ్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై చర్చోపచర్చలు సాగించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కెప్టెన్ అయినంత మాత్రాన మళ్లీ కెప్టెన్సీకి ప్రయత్నించకూడదా? అని ఫైర్ అవుతున్నాడు జెస్సీ. అప్పుడెప్పుడో మూడోవారం కెప్టెన్ అయ్యానని, నేనెందుకు ఈ అవకాశాన్ని వదిలేసుకోవాలని ప్రశ్నించాడు. కానీ అతడితో ఎవరూ ఏకీభవించినట్లు కనిపించడం లేదు. దీంతో జెస్సీ తాను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనివల్ల తనకు వరస్ట్ పర్ఫామర్ ఇచ్చినా నాకనవసరం అని అసహనం వ్యక్తం చేశాడు. మొత్తంగా ఈవారం కెప్టెన్సీ కోసం యానీ, శ్రీరామ్, షణ్ను, మానస్, సిరి, సన్నీ పోటీపడుతున్నట్లు సమాచారం. -
బిగ్‌బాస్-5: టాప్ 5లో నేను, మానస్ ఉంటాం.. ప్రియాంక జోస్యం
నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా ఎప్పటిమాదిరే కలిసిపోయారు. కోపాలు, గొడవలను దూరంపెట్టి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. నేను మానస్ టాప్ 5లో ఉంటామని ప్రియాంక చెప్పగా... దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్ఫ్లూయన్స్ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ చెప్పాడు. ఆ తరువాత శ్రీరామ్ 'దుర్యోధనా..' అంటూ రవిని ఆటపట్టించాడు. మరోవైపు గతవారం నామినేషన్ ప్రక్రియలో జరిగిన సంఘటలను ఇమిటేట్ చేసి చూపించారు మానస్ అండ్ సన్నీ. టవల్ రీజన్‌తో ప్రియ రవిని నామినేట్ చేసిన ఘటనను ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. రవి ఏమో.. పింకీని ఇమినేట్ చూపించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘అభయహస్తం’అనే టాస్క్‌ని ఆడినట్లు ప్రోమోలో చూపించారు. -
బిగ్‌బాస్-5: లాక్డౌన్లో బిగ్‌బాస్ హౌస్.. షాక్‌లో ఇంటి సభ్యులు
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ ఐదో సీజన్ రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో ఏడువారాలను పూర్తి చేసుకొని ఎనిమిదోవారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎలిమినేషన్ రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్,షణ్ముఖ్ జస్వంత్, మానస్ ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘అభయహస్తం’అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇంటిని పూర్తిగా లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చాలెంజ్‌లో గెలిచిన సభ్యులకు మాత్రమే ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్-లోబో హోరా హోరిగా తలపడినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. (చదవండి: బిగ్‌బాస్: ప్రియ పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా?) బురదతో నిండిన బాత్‌టబ్ నుంచి కాయిన్స్‌ని సేకరించే టాస్క్‌లో లోబో-షణ్ణ్నూ పోటీ పడ్డారు. ఆ సమయంలో విశ్వ-షణ్ముఖ్, కాజల్-లోబో మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. ‘వందమంది వంద వాగుతారు అని షణ్ణ్నూ అనగా.. విశ్వ మధ్యలో కలగజేసుకొని.. అంతా ఇక్కడ ఉన్నోళ్లమే కదా డార్లింగ్ అని సీరియస్ అయ్యారు. ఆ వంద మందిలో నువ్వు ఉన్నావా.. అంటూ షణ్ముఖ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక కాజల్ ఏదో అనబోతుండగా.. కాసేపు ఏం మాట్లాడొద్దని లోబో అడ్డుకోబోయాడు. ‘నా ఇష్టం నేను మాట్లాడతా. నీకు ఇబ్బంది ఉంటే చెవులు మూసుకో’అంటూ లోబోపై కాజల్ ఫైర్ అయ్యారు. మరి ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టిందో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
అమ్మ క్యాన్సర్‌తో పోరాడింది, నేనూ ఈ బాధను తట్టుకుంటాను
Bigg Boss 5 Telugu, 8th week Nominations: నామినేషన్స్ అంటే చాలు ఉగ్రావతారమెత్తే కంటెస్టెంట్లు ఈసారి మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆగ్రహావేశాలకు పోకుండా చిరునవ్వుతో, పుట్టెడు దుఃఖంతో ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కారణం.. బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ డిఫరెంట్‌గా నిర్వహించాడు. కంటెస్టెంట్లకు వారి ప్రియమైనవారు లేఖలు పంపించారని ఊరిస్తూనే అందరూ వాటిని అందుకునేందుకు వీల్లేదని తెగేసి చెప్పాడు. ఎవరికి లెటర్స్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అనేది మీలో మీరే నిర్ణయించుకోండంటూ హౌస్మేట్స్ ఇష్టానికి వదిలేశాడు. కానీ ఎవరికైతే లెటర్ దక్కదో వారు నామినేట్ అవుతారని ప్రకటించాడు. ప్రియాంకకు తల్లిదండ్రుల నుంచి లెటర్ రాగా దాన్ని చించేయొద్దని కోరింది. ఇక రవి, లోబోలలో ఒకరికే లెటర్ అందుకునే అవకాశం వచ్చింది. దీంతో లోబో... రవితో నీ పాపను గుర్తుగా ఒక బొమ్మ, లేఖ ఉంది, కానీ నాకు అది కూడా లేదంటూ తాను లెటర్ తీసుకుంటానన్నాడు. ఇక విశ్వ-సిరికి కూడా ఇదే సంకటం ఎదురైంది. అయితే గుండె రాయి చేసుకున్న సిరి.. విశ్వ కోసం తన లెటర్‌ను త్యాగం చేసింది. దీంతో విశ్వ కృతజ్ఞతతో ఆమెకు చేతులెత్తి దండం పెట్టాడు. లెటర్ దక్కించుకునే ఆరాటంలో కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అయ్యారు. కళ్లముందే లెటర్స్ చినిగిపోతుంటే తట్టుకోలేకపోయారు. యానీ మాస్టర్ అయితే తన ఫ్యామిలీని తలుచుకుని ఏడ్చేసింది. నాకు నువ్వు లేకుంటే జీవితంలో ఏదీ లేదని బాధపడింది. ఇక షణ్ముఖ్ తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించాడు. 'అమ్మా... క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకుని ధైర్యాన్ని కూడదీసుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్. నేనూ ఈ బాధను జయిస్తాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. -
బిగ్‌బాస్: 8వ వారం నామినేషన్స్‌లో ఆరుగురు!
Bigg Boss 5 Telugu, 8th week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎప్పటికప్పుడు సరికొత్తగా నామినేషన్స్ నిర్వహించే బిగ్‌బాస్ ఈసారి హౌస్మేట్స్ ఎమోషన్స్‌తో ఆడుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. మీ అందరికీ మీ ప్రియమైనవారి నుంచి ఓ లేఖ పొందే అవకాశం లభిస్తుందన్న బిగ్‌బాస్ అంతలోనే మరో ట్విస్టు ఇచ్చాడు. జీవితంలో కోరుకున్న ప్రతీది దక్కదని, ఏదైనా దక్కించుకోవాలంటే వేరే ఏదైనా వదులుకోవాల్సి వస్తుందని చెప్పాడు. పవర్ రూమ్‌లోని సభ్యులు ఎవరికైతే లేఖ ఇస్తారో వారు సేఫ్ అవగా లెటర్ దక్కనివారు నామినేట్ అవుతారని బాంబు పేల్చాడు. నామినేషన్స్‌లో ఆరుగురు కాగా ఎనిమిదో వారం నామినేట్ అయిన సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి హన్మంత్, లోబో, యాంకర్ రవి నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. వీళ్లలో లోబో బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ వారం ఎవరో ఒకరు వైల్డ్ కార్డ్ లేదా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు కూడా వినపడుతున్నాయి. మరి ఈ జోస్యాలు నిజమవుతాయా? లేదా? అనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే! -
హౌస్‌లో నుంచి మాయమైన ప్రియ, యానీ! డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్
Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: సండే అనగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలవుతుంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్‌లో ఉన్నవారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతామోనని భయంతో వణికిపోతుంటారు. ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, కాజల్‌ను నాగ్ శనివారం ఎపిసోడ్లో సేవ్ చేశారు. సిరి, రవి, యానీ, ప్రియ, జెస్సీ, లోబో ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో యానీ, ప్రియ తప్ప అందరూ సేవ్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవనున్నట్లు కనిపిస్తోంది. వీళ్లిద్దరినీ హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించాడు నాగ్. అనంతరం వారిని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లమనగా ప్రియ, యానీ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఖాళీ బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సులపై ఉన్న లైట్స్ ఆఫ్ అవగా ఇంటిసభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటిని తెరిచి చూశారు. కానీ వాటిలో ఉన్న ప్రియ, యానీ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో షాకైన ఇంటిసభ్యులు ఎవరూ లేరేంటని అయోమయానికి లోనయ్యారు. వారిని మరింత టెన్షన్‌కు గురి చేస్తూ నాగ్.. ఇద్దరూ స్టేజీ మీదకు వస్తారేమో అంటూ డబుల్ ఎలిమినేషన్ ఉందన్నట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పటికే లీకువీరులు ప్రియ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో దండోరా వేసేశారు కాబట్టి నాగ్ మాటలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. 'డబుల్ ఎలిమినేషన్ అనగానే నమ్మేస్తాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, ప్రియ తట్టాబుట్టా సర్దేసుకుందని మాకు తెలిసిపోయిందిలే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే సన్నీ చెంప పగలగొడతాను!: నాగ్
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత నాగార్జున శనివారం హౌస్‌మేట్స్‌ను ఉతికారేస్తే ఆదివారం మాత్రం వారితో ఫన్ గేమ్స్ ఆడిస్తూ కూల్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ వారం కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను ప్రస్తావిస్తూ వాయించేసిన నాగ్ నేడు మాత్రం వారితో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇప్పుడు ఆడబోయే గేమ్స్‌లో ఎవరైతే గెలుస్తారో వారికి బిగ్‌బాస్ షీల్డ్ సొంతమవుతుందని ఆఫర్ ఇచ్చాడు నాగ్. మీరు అడుగుతారో, బతిమాలుకుంటారో, అడుక్కుంటారో, దొంగతనం చేస్తారో అది మీ ఇష్టం.. కానీ గెలుపు కోసం ట్రై చేయమని చెప్తాడు. మొదటి రౌండ్లో ఒక గుండ్రటి వలయంలో దిండ్లు పెట్టారు. వాటిని దక్కించుకున్న ఇంటిసభ్యులు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సన్నీ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే సన్నీ చెంప పగులుతుందని చెప్పంటూ శ్రీరామ్‌ను ఎంకరేజ్ చేశాడు. దీంతో సన్నీ బిత్తరముఖం వేశాడు. తర్వాతి రౌండ్లో నాగ్ చెప్పిన కలర్ ఉన్న వస్తువులను తీసుకురావాల్సి ఉండగా కిచెన్‌లోని సామానంతా పట్టుకొచ్చేశారు హౌస్మేట్స్. ఇక బంగారు కోడిపెట్టలోని ప్రభావతి అనే కోడిని నామినేషన్లో ఉన్నవారు తమను సేవ్ చేయమని బతిమాలుకుంటున్నారు. రవి బతిమాలేందుకు ప్రయత్నించడం స్టార్ట్ చేసేలోపే కుక్క అరిచిన సౌండ్ వినపడుతుంది. నీ చెంప పగలగొట్టను అని ప్రియ రిక్వెస్ట్ చేయగా సింహం సౌండ్ వినబడింది. దీంతో షణ్ముఖ్.. ఏంటి సార్, నటరాజ్ మాస్టర్ వచ్చాడంటూ జోక్ పేల్చాడు. తర్వాత ఆడిన మ్యూజికల్ చెయిర్ గేమ్‌లో సిరి ఓడిపోయింది. నువ్వు షణ్నుకు అన్నం తినిపించు అన్నట్లుగా నాగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో సిరి.. ఇందమాదిరి ఒరు రాడ్ అంటూ నాగ్ తనకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడని చెప్పకనే చెప్పింది. -
యానీ మాస్టర్ వల్ల సన్నీకి షాకివ్వబోతున్న నాగ్!
Bigg Boss Telugu 5 Promo: బుల్లితెర బాస్ బిగ్‌బాస్ షో ఏడోవారం ముగింపుకు చేరుకుంది. ఈ వారం జరిగిన కొట్లాటలను పంచాయితీ పెట్టి తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యాడు కింగ్ నాగ్. ముందుగా రవిని నిల్చోబెట్టి వాయించాడు. సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేశావని చెప్పగా రవి తాను దొంగతనం చేయలేదని, అవి దొరికాయని చెప్పాడు. నిన్నటివరకు స్టిక్కర్స్ దొంగిలించలేదంటూ బుకాయించిన రవి.. నాగ్ మాటలతో అడ్డంగా దొరికిపోయాడు. ఇక పదేపదే చెంప పగలగొడతానంటూ ఆవేశంతో ఊగిపోయిన ప్రియను అదే మాట ఎన్నిసార్లు అంటావని ప్రశ్నించాడు. అంతేకాకుండా కొట్టడానికి ఏకంగా పక్కనున్న పూలతొట్టి కూడా తీసుకున్నావని అడిగాడు. అది తాను చూడలేదని సన్నీ అనగా.. చూసినా ఏం చేయలేవులే అని నాగ్ పరువు తీసేశాడు. ఇక సన్నీ కెప్టెన్ అయ్యేందుకు కీలక పాత్ర వహించిన యానీ మాస్టర్ కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన పొరపాటును లేవనెత్తింది. అది ఇండివిడ్యువల్ టాస్క్ అని రాసి ఉన్నా కూడా సన్నీ, కాజల్ కలిసి ఆడారు. అది నాకు డిస్టర్బ్‌గా అనిపించిందంటూ ఎమోషనల్ అయింది. ఆమె చెప్పింది కరెక్టే అనుకున్న నాగ్ వ్యక్తిగత గేమ్‌లో గ్రూప్‌గా కలిసి ఆడినందుకు సన్నీ కెప్టెన్సీ రద్దయిందని ప్రకటించాడు. మరి నాగ్ నిజంగానే సన్నీ ఆనందానికి నాగ్ అడ్డుపుల్ల వేశాడా? లేదా ఇంకోసారి ఇలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించాడా? అన్నది ఎపిసోడ్లో తేలనుంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాత్రం కెప్టెన్సీ రద్దు చేసే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. -
మొత్తానికి సన్నీ అనుకున్నది సాధించాడుగా!
Bigg Boss 5 Telugu, VJ Sunny Is New Captain: సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం ఒక ఎత్తయితే ఇక్కడ ఎక్కువ వారాలు ఉండి ఏదో ఒకటి సాధించడం మరో ఎత్తు. కొందరు ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఆడితే మరికొందరు మాత్రం ఉన్న కొద్ది వారాలైనా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే చాలని సంతోషిస్తారు. ఇక మరికొందరు టాప్ 5లో ఉంటే అదే పదివేలని భావిస్తారు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎవరు టాప్ 5లో ఉంటారని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వీరిలో మానస్, సన్నీ, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర ఫినాలే వరకు వెళ్తారని కొందరు అభిప్రాయపడుతుండగా, షణ్ముఖ్ గ్యాంగ్‌తోపాటు ప్రియాంక సింగ్, సన్నీ ట్రోఫీ కోసం పోటీ పడతారని మరికొందరు అంటున్నారు. అయితే వీరిలో సన్నీకి ట్రోఫీ సాధించడం కన్నా ముందు మరొక కల ఉంది. అదే కెప్టెన్ కావడం. కొన్ని వారాలుగా కెప్టెన్సీ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. అయితే ఎట్టకేలకు అతడి కోరిక నెరవేరినట్లు తెలుస్తోంది. తాజాగా హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ గెలిచినట్లు లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అతడు కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడట! ఇప్పటివరకు లీకువీరులు చెప్పిన ప్రతీది నిజమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సన్నీ కెప్టెన్ కావడం కూడా ఖాయమే అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి అతడి కల నెరవేరిందని, కెప్టెన్సీ కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న డ్రెస్ ధరించే సమయం వచ్చేసిందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టుకతోనే నాకు ఆ సమస్య, మా అమ్మ బయటకు చెప్పుకోదు: జెస్సీ
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కొట్లాటలకు కొదువ లేకుండా పోయింది. ఫన్ కన్నా ఫ్రస్టేషన్, ఫైటింగ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని పక్కనపెట్టి కంటెస్టెంట్లతో ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. తాజాగా వారి జీవితంలోని జ్ఞాపకాలను పంచుకోమని ఆదేశించినట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోలో.. సన్నీ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ముగ్గురు అబ్బాయిలను ఒక మహిళ కష్టపడి పెంచడమనేది ఎంత ఛాలెంజింగో నాకు తెలుసు అంటూ తన స్టోరీ చెప్తున్నాడు. ఇక జెస్సీ వంతు రాగా.. 'నాకు గొంతు సమస్య ఉంది. దానివల్ల వాయిస్ సరిగా రాదు. అది నాకు పుట్టుకతోనే ఉంది. కానీ నేను గిన్నిస్‌బుక్ ఎక్కాను, ఫ్యాషన్ ఐకాన్ అయ్యాను, జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే మా అమ్మ ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని బయటకు చెప్పుకోదు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లి ఏమన్నా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి అని అందరూ అన్నారంటూ ఎమోషనల్ అయింది సిరి. హౌస్మేట్స్ చెప్పే జ్ఞాపకాలను వినాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్-5: లోబోకి స్పెషల్ పవర్.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కంటెస్టెంట్స్ అంతా ఒకటి ఆలోచిస్తే.. బిగ్‌బాస్ మరోకటి ఆలోచిస్తాడు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్‌బాస్. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్ అటాక్ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్ కావాలనే కసితో టాస్క్ ఆడుతున్నారు కంటెస్టెంట్స్. అయితే టాస్క్‌ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్‌బాస్. మధ్య మధ్యలో స్పెషల్ పవర్ ఉన్న ఎగ్స్ ఇస్తూ.. అదృష్ట పరీక్షలు పెడుతున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్) ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గేమ్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన లోబో చేతికి ఇచ్చాడు బిగ్‌బాస్. అతని చేతిలో బ్లాక్, గొల్డెన్ కలర్ ఎగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్ ఎగ్ ఎవరికిస్తే వారు ఈ టాస్క్ నుంచి ఔట్ అయినట్లు. గొల్డెన్ ఎగ్ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్-5: లోబో రీఎంట్రీ, మోసపోయానని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్
బిగ్‌బాస్ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘బంగారు కోడిపెట్ట’అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్కే సన్నీ, ప్రియల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. వీరిద్దరూ మాటలతో ఆగకుండా ఫిజికల్ అటాక్ వరకు వెళ్లారు. ఇలా నిన్నటి ఎపిసోడ్ అంతా వాడివేడిగా జరగ్గా.. ఎండింగ్లో మాత్రం భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో రీ ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమోలో తెలిపారు. మెయిన్ గెట్ తెరుచుకోవడం, అక్కడ లోబో నిలబడి ఉండటం చూసిన రవి.. లోబో వచ్చాడు అంటూ చెప్పడంతో అందరి ముఖంలో ఆనందం కనిపించింది. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకున్నాడు. మరోవైపు జెస్సీకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ త్రిమూర్తులు(షణ్ముఖ్, సిరి, జెస్సీ)మధ్య గొవడవకు దారి తీసినట్లు కనిపిస్తోంది. జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందరూ టాస్క్ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్ వాపోయాడు. జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను. నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం.. అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జెస్సీ, సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్ ఆగకుండా సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు. దీంతో సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్-సిరి-జెస్సీల మధ్య ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. -
Bigg Boss 5 Telugu: జెస్సీకి సీక్రెట్ టాస్క్.. బకరా అయిన సన్నీ!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వీకెండ్ దాకా కలిసి ఉన్న హౌస్మేట్స్.. నామినేషన్ రాగానే చెలరేగిపోతారు. ఇక టాస్క్‌ల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువ. స్నేహితులని కూడా చూడకుండా స్వార్థంగా ఆడుతూ.. టాస్క్ గెలిచేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఈ క్రమంలో స్నేహితులను తిట్టేస్తుంటారు. అయితే కొన్నిసార్లు బిగ్‌బాస్ ఇచ్చే షాక్‌కి హౌస్మేట్స్ దిమ్మతిరిగిపోతుంది. నేటి ఎపిసోడ్లో అలాంటి సంఘటననే జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చి మిగిలిప హౌస్‌మేట్స్‌ని బకరాలను చేశాడు బిగ్‌బాస్. (చదవండి: బిగ్‌బాస్: అలా చేస్తే చెంప పగిలిపోద్ది.. సన్నీకి ప్రియ వార్నింగ్) కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జెస్సీకి బిగ్‌బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన జెస్సీ.. సన్నీని ఓ ఆట ఆడేసుకున్నాడు. కావాలనే సన్నీని రెచ్చగొట్టాడు. ఇది సీక్రెట్ టాస్క్ అనే విషయం తెలియన సన్నీ.. జెస్సీపై ఫైర్ అయ్యాడు. మరోవైపు సిరికి కూడా ఈ సీక్రెట్ టాస్క్‌లో భాగమైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి తోడుగా ఉంటూ.. సన్నీకి మరింత కోపం వచ్చేలా చేసింది. ‘ఏం చేస్తే నీకెందుకురా’అంటూ సన్నీని రెచ్చగొట్టగా.. ఇంకోసారి ‘రా’అనకు.. అలా పిలిచే అర్హత నీకు లేదంటూ.. సన్నీ ఫైర్ అయ్యాడు. కట్ చేస్తే.. ఇదంతా సీక్రెట్ టాస్క్ అని బిగ్‌బాస్ అనౌన్స్ చేయడంతో అంతా తెల్లముఖాలు వేశారు. ఇక త్రిమూర్తుల్లో ఒకరైన షణ్ముఖ్ సైతం సీక్రెట్ టాస్క్ గురించి తెలుసుకొని షాకయ్యాడు. నాక్కూడా సీక్రెట్ టాస్క్ ఇవ్వమని బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్ చేయగా.. ముందైతే టాస్క్ సరిగా ఆడంటూ రవి సెటైర్ వేశాడు. మరి ఈ సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ సక్సెస్ అయ్యాడా లేదా తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: అలా చేస్తే చెంప పగిలిపోద్ది.. సన్నీకి ప్రియ వార్నింగ్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంతా కలిసి ఉండడం ఇష్టపడని బిగ్‌బాస్.. కొత్త కొత్త టాస్కులు ఇచ్చి హౌస్మేట్స్ మధ్య గొడవలు పెట్టిస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన ‘బంగారు కోడిపెట్ట’అనే కెప్టెన్సీ టాస్క్ హౌస్మేట్స్ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ముఖ్యంగా.సన్నీ- ప్రియా మధ్య మాటల యుద్దమే జరిగింది. అయితే నేడు ఆది కాస్త హద్దు దాటి ఫిజికల్ అటాక్‌కు దారి తీసినట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమోలో ప్రియ.. మళ్లీ సన్నీ గుడ్లను దొంగిలిస్తూ కనిపించింది. ఈ క్రమంలో సన్నీ ఆమెను పక్కకు తోసేశాడు. (చదవండి: మొన్న కూతురు, ఇప్పుడు తల్లి బిగ్‌బాస్‌ను వీడక తప్పదా!) దీంతో అతనిపై పూల కుండీ ఎత్తేసి.. ఫిజికల్ ఎటాక్ చేస్తే మరద్యాదగా ఉండదు.. చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. మిగిలిన ఇంటి సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి గొడవ తగ్గలేదు. ప్రియ మరింత రెచ్చిపోయి బుట్టను చించేసింది. ఈక్రమంలో సన్నీ ఏయ్ అన్నడంతో.. ప్రియా ఏయ్ ఏంటి అంటూ ఫైర్ అయ్యింది. చేతకాని మొహాలు వస్తారు ఇక్కడికి.. అంటూ సన్నీ అనడంతో.. చెంప పగిలిపోద్ది అని ప్రియా అంది. దాంతో కోపంతో రగిలిపోయిన సన్నీ దమ్ముంటే కొట్టి చూడు అంటూ ప్రియా మీదకు వెళ్ళాడు. మొత్తమీద ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ మంచి రసవత్తరంగా ఉండనుందని అర్ధమవుతుంది. -
చేతగాని వాళ్లలా ఆడకు, నా జోలికి వస్తే వదిలిపెట్ట: సన్నీ వార్నింగ్
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సన్నీ, ప్రియకు అస్సలు పడదన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. వారిద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! ప్రతివారం ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా కెప్టెన్సీ టాస్కులోనూ వీళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్నారు. నేను ఎవ్వడి జోలికి వెళ్ల, నా జోలికి వస్తే వదిలిపెట్టను అని హెచ్చరించాడు సన్నీ. 'నేనందరి జోలికొస్త, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి' అంటూ పవన్ కల్యాణ్ స్టైల్లో సమాధానమిచ్చింది ప్రియ. నా జోలికొస్తే ఊరుకోనని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు సన్నీ. అయినా పట్టించుకోని ప్రియ.. దమ్ముంటే దోచుకోమని సవాలు విసిరింది. 'చేతగాని వాళ్లలాగా ఆడకు, కొంచెం మంచిగా ఆడు' అంటూ సన్నీ కౌంటరివ్వగా.. 'బొమ్మలు దొబ్బేసి నేను తీయలే అంటారు చేతగానోళ్లు' అని పరోక్షంగా అతడికే రివర్స్ కౌంటర్ ఇచ్చిందీ నటి. చేతనయినోళ్లు దొంగతనం చేసి చెప్తారని చిటికేసి మరీ చెప్పింది. ఆమె తీరుతో చిర్రెత్తిపోయిన సన్నీ 'నా నిజ స్వరూపం చూపిస్తా' అని సమయం కోసం ఎదురు చూస్తుండగా 'మస్తు చూశేశిన..' అంటూ అతడిని కరివేపాకులా తీసిపారేసింది ప్రియ. ఇదంతా విన్న కాజల్.. మాటలు గుర్తుపెట్టుకో, వీకెండ్లో తీద్దాం అని సూచించింది. ఇక ప్రియ.. తన గుడ్డును మానస్‌కు ఇవ్వడం గమనార్హం. ఇదిలావుంటే సరదాగా ఆడుకుంటున్న శ్రీరామ్, సిరిని చూసి ఓర్వలేకపోయాడు షణ్ముఖ్. వీళ్లిద్దరూ మళ్లీ మొదలెట్టారని అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంలో సిరితో మరోసారి వాదులాటకు దిగినట్లు కనిపిస్తోంది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ఇప్పటివరకు మానస్, విశ్వ గెలిచినట్లు సమాచారం. మరి వీరితో పాటు ఎవరెవరు కెప్టెన్సీకి పోటీపడతారన్నది ఆసక్తికరంగా మారింది! -
దమ్ముంటే గేమ్ ఆడమన్న పింకీ, సన్నీ ఓడిపోయాడన్న షణ్ను
బిగ్‌బాస్ షోలో నిన్నటి నామినేషన్స్ చూస్తే వార్ వన్‌సైడ్ అయినట్లు కనిపించింది. బజర్ మోగినప్పుడు ముందుగా అరటిపండు సంపాదించిన కంటెస్టెంట్లు నామినేట్ చేసే అవకాశాన్ని పొందారు. కాకపోతే వారు చెప్పే కారణాలు విన్నాక ఆ నామినేషన్‌ను అంగీకరించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని వేటగాళ్ల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఇక్కడ విచిత్రమేంటంటే శ్రీరామ్, జెస్సీ, సన్నీ.. ముగ్గురు వేటగాళ్లైనప్పటికీ బజర్ మోగిన ప్రతిసారి డేరా నుంచి బయటకు వచ్చి నామినేషన్స్‌ను సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు సన్నీ. అయితే కొందరు కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేసినా కూడా సన్నీ వాటిని అంగీకరించడాన్ని చాలామంది విమర్శించారు. అదే సమయంలో నామినేషన్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్న విధానాన్ని పలువురూ మెచ్చుకున్నారు. ఏదేమైనా నిన్న బిగ్‌బాస్ పెట్టిన చిచ్చు ఇంకా చల్లారనట్లు కనిపిస్తోంది. ఇది నీ నామినేషన్లా ఉంది కానీ వాళ్ల నామినేషన్లా లేదని పెదవి విరిచాడు మానస్. వీడు తప్పు చేసి ఒప్పుకోడేంటి? అని రవి కామెంట్ చేయగా కాజల్ దాన్ని వ్యతిరేకించింది. సన్నీ తప్పు చేశాడంటే ఒప్పుకోనంటూ వాదనకు దిగింది. అయినా టాస్కుల్లో ఫ్రెండ్షిప్ చూపిస్తే ఓడిపోయినట్లేనని తేల్చేశాడు షణ్ముఖ్. దమ్ముంటే గేమ్ ఆడాలి, కానీ సేఫ్ గేమ్ ఆడొద్దంటూ చురకలంటించింది పింకీ. మొత్తంగా అందరూ తన మీద మాటల తూటాలు కురిపించడంతో విసిగి వేసారిపోయిన సన్నీ.. వాళ్లాడితే గేమ్.. నేనాడితే క్రైమా? అని చిర్రుబుర్రులాడాడు. ఇదిలా వుంటే హౌస్‌లో కొత్త కెప్టెన్సీ కోసం రంగం సిద్ధం చేశాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకునేందుకు బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చాడు. ఇందులో గుడ్డు పట్టుకునేందుకు గుద్దులాడుకుంటున్నారు కంటెస్టెంట్లు. ఈ క్రమంలో మరోసారి సన్నీ, ప్రియ మధ్య వార్ మొదలవనున్నట్లు తెలుస్తోంది. తన గుడ్లు పోయాయని, అవి ఎవరు తీసుకున్నారో తెలిసిందని సన్నీ కామెంట్ చేశాడు. అది విన్న ప్రియ.. నేనే తీసుకున్నా, బరాబర్ తీసుకుంటానని తేల్చి చెప్పింది. మరి ఈ బంగారు కోడిపెట్ట టాస్కులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా?: రవి ఆవేదన
నామినేషన్స్ అంటేనే రగడ. కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే ఈ నామినేషన్స్ నేడు వెరైటీగా నిర్వహించనున్నాడు బిగ్‌బాస్. నామినేషన్స్ బాధ్యతను ముగ్గురు హంటర్స్ అయిన జెస్సీ, శ్రీరామ్, సన్నీకి అప్పగించాడు. దీంతో గేమ్‌లో ఊహించని ట్విస్టులు ఇస్తూ హౌస్‌మేట్స్‌కు షాకుల మీద షాకులిస్తున్నారు హంటర్స్. తాజాగా రిలీజైన ప్రోమోలో అనీ మాస్టర్‌పై కవిత విసిరాడు రవి. 'అనీ, ఓ అనీ... చేస్తావు మమ్మల్ని నామినేషన్స్ స్ట్రాంగ్ అని! శ్వేత పోయింది.. ఎవర్నంటావు కూతురని!' అని చదవడంతో మాస్టర్ వహ్వా వహ్వా అంటూ చప్పట్లు కొట్టింది. ఇక నామినేషన్స్‌లో ప్రియ మరోసారి సిల్లీ రీజన్‌తో రవిని నామినేట్ చేసింది. సోఫా మీద టవల్ ఆరేయడం నచ్చలేదని చెప్పుకొచ్చింది.. ఆమె చెప్పిన కారణం విని ఖంగు తిన్న రవికి నోట మాట రాలేదు. ఇక ఈ టాస్క్‌లో సన్నీ, ప్రియ, పింకీలకు మధ్య పెద్ద ఫైటే జరిగినట్లు కనిపిస్తోంది. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫేక్ జనాలతో నేనుండలేను అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. ఇక సన్నీ.. రవిని నామినేట్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. శ్వేత ఉంటే నిన్ను కచ్చితంగా నామినేట్ చేసేదని రవికి చెప్పడంతో షాకైన అతడు శ్వేత నావల్ల వెళ్లిపోయిందా? అని ప్రశ్నించాడు. శ్వేత గురించి మాట్లాడొద్దంటూ సన్నీకి సూచించింది యానీ. అందరితో విసిగి వేసారిన సన్నీ.. ''గేమ్ మీరాడొద్దు, నేనాడుతా.. నామినేషన్స్ అంటే మజాక్ అయితుందా?'' అని ఫైర్ అయ్యాడు. -
బిగ్‌బాస్: నామినేషన్స్‌లో 8 మంది!
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల సంఖ్య తగ్గేకొలదీ హౌస్మేట్స్ మధ్య పోటీ ఉత్కంఠగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్స్ రోజు వారి నిజస్వరూపాలు బయటకు వస్తాయి. అయితే ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియను వెరైటీగా నిర్వహించాడు బిగ్‌బాస్. ముగ్గురు వేటగాళ్ల చేతిలో నామినేషన్ ప్రక్రియను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ చిందులు తొక్కుతోందీ ప్రియాంక. ఆరు వారాల నుంచి నామినేట్ అవుతున్నానని, ఈసారికి వదిలేయమని సన్నీని వేడుకున్నాడు రవి. ఇక సిరి.. మానస్‌ను, షణ్ముఖ్... యానీ మాస్టర్‌ను నామినేట్ చేయగా కాజల్.. ప్రియ పేరు చెప్పింది. ఇది విన్న ప్రియ.. ఇది ఊహించిందేనని చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్, ప్రియ, యానీ, రవి, కాజల్, జెస్సీ, సిరి నామినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బొమ్మలో భవిష్యత్తు.. భయంతో ఏడ్చేసిన షణ్ముఖ్
Bigg Boss Telugu 5 Promo, Bommalo bhavishayathu: సండే వచ్చిందంటే చాలు నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఎలిమినేషన్ టెన్షన్‌తో నిలువెల్లా వణికిపోతుంటారు. ఆరో వారానికి గానూ ఆల్రెడీ ఒకరిని పంపించివేయడంతో ఈ టెన్షన్ రెట్టింపు అయింది. అయితే లోబోది ఫేక్ ఎలిమినేషన్ అని మనందరికీ తెలిసిందే. ఇదిలా వుంటే నామినేషన్స్‌లో 10 మంది ఉంటే అందులో లోబో ఇప్పటికే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఇంకా 9 మందిలో ఎవరినీ సేవ్ చేయలేదు నాగ్. అయితే వారి భవిష్యత్తును నిర్ణయించేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఉన్నవారికి టెడ్డీబేర్స్ ఇచ్చి.. వాటిలో ఎవరి ఫొటో ఉంటుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని ప్రకటించాడు. దీంతో కంటెస్టెంట్లు ఊపిరి బిగపట్టుకుని బొమ్మలను ఓపెన్ చేసి చూస్తున్నారు. అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో శ్వేత ఎలిమినేట్ అయినట్లు లీక్ అవడంతో ప్రేక్షకులకు పెద్దగా సస్పెన్స్ లేకుండా పోయింది. ఇక ప్రోమో చివర్లో షణ్ను ఏడుస్తున్నట్లు చూపించారు. అంటే అందరూ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వస్తుండగా చివరగా శ్వేత, సిరి మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఎక్కడ సిరి ఎలిమినేట్ అవుఉందోనన్న భయంతో షణ్ను కంటతడి పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో షణ్ను ఫ్యాన్స్.. 'అరె ఏంట్రా ఇది అంత ఎమోషనల్ అవుతున్నావు, సిరిని ఇప్పుడప్పుడే పంపించరులేరా!' అని ఓదార్చుతూ కామెంట్లు చేస్తున్నారు. -
రవి గడ్డి తినమంటే తింటావా?: లోబోపై నాగ్ ఫైర్
సంచాలకులు తప్పు చేస్తే బిగ్‌బాస్ అనర్హత వేటు వేస్తాడని ఇంటిసభ్యులకు క్లారిటీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. కూతురు మీద, వాళ్ల మీద, వీళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకని యానీ మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. నామినేషన్స్‌లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగ్. యాక్టర్స్ అంటూ చిన్నచూపా? అని నిలదీశాడు. దీంతో శ్రీరామ్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. హౌస్ ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదన్న నియమం తెలియదా? అని లోబోను ప్రశ్నించాడు నాగ్. రవి చెప్తేనే అలా చేశానని అతడు సమాధానమివ్వడంతో రవి గడ్డి తినమంటే తింటావా? అని నిందించాడు హోస్ట్. అసలు ఈ ఐడియా ఇచ్చిన రవిని నిలదీశాడు నాగ్. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. శ్వేత కూడా కుషన్స్ కట్ చేస్తుందన్న విషయం తనకు తెలియదని చెప్తుండగా మధ్యలోనే అడ్డుకుంది శ్వేత. నేను కూడా తన ఐడియానే ఫాలో అవుతున్నానన్న విషయం రవికి తెలుసు అని చెప్పింది. దీంతో నాగ్.. ఇవన్నీ వింటుంటే నటరాజ్ మాస్టర్ చెప్పిందే నిజమనిపిస్తుందని అతడిని పరోక్షంగా గుంటనక్క అని పిలిచాడు నాగ్. దీంతో రవి సిగ్గుతో తల దించుకున్నాడు. ఈ గొడవలో నుంచి రవి ఎలా బయటపడతాడు? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే! -
బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా విశ్వ!
Bigg Boss Telugu 5 Promo: షణ్ముఖ్, శ్రీరామ్ మధ్య ఫైట్ ఇంకా నడుస్తోనే ఉంది. శ్రీరామ్ ఏం చేసినా తప్పు కాదు, కానీ మేము చేస్తే తప్పా? అని షణ్ను అసహనానికి లోనయ్యాడు. మరోపక్క శ్రీరామ్.. నేనెందుకు అతడి వెంట పడతాను, ఆయన ఇష్టముంటే మాట్లాడనీ, లేకపోతే లేదు అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు. ఇక సంచాలకురాలిగా కాజల్ ఎలా వ్యవహరించిందో ఇమిటేట్ చేసి చూపిస్తూ అందరినీ నవ్వించాడు సన్నీ. 'సీరియస్‌గా ఆడితేనే గెలుస్తామని, కామెడీగా ఆడితే ఎప్పుడూ ఓడిపోతాం' అని పింకీకి సలహా ఇచ్చాడు జెస్సీ. మరోపక్క షణ్ముఖ్, సిరికి మధ్య మరోసారి గొడవైనట్లు తెలుస్తోంది. పెద్ద పుడుంగి నడుచుకుంటూ వచ్చిందని షణ్ను సెటైర్ వేయడంతో సిరి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయింది. కానీ తర్వాత ఆమె రాకకోసం తెగ ఎదురుచూశాడు షణ్ను. సిరిని రమ్మనురా.. అని రిక్వెస్ట్ చేయడంతో షాకైన జెస్సీ.. నువ్వే వెళ్లి చెప్పు అని ఆన్సరిచ్చాడు. ఇక రాత్రిపూట మానస్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు. అతడు బాగుంటాడని సిరి కామెంట్ చేయగా 'నీ దిష్టే తగులుతుందే, ఏం కళ్లే అవి..' అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. దీంతో మరింత రెచ్చిపోయిన సిరి.. ఎంత క్యూట్ ఉన్నాడో అంటూ మానస్‌కేసి చూడగా వెంటనే పింకీ ఆమె చూపు తిప్పేస్తూ పడుకోబెట్టింది. ఇక హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌లో విశ్వ గెలిచి కెప్టెన్‌గా అవతరిచినట్లు సమాచారం! -
Bigg Boss: ఇదేందిరా భయ్.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా..సన్నీ ఫైర్
బిగ్‌బాస్ ఇంట్లో పత్తేపారం.. పలు గొడవలకు దారి తీస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటి సభ్యులు ఓ రేంజ్లో కష్టపడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ కోసం కంటెస్టెంట్స్ నానా పాట్లు పడుతున్నారు. నాలుగు టీమ్‌లుగా విడిపోయి.. బద్ధ శత్రువుల్లా కొట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలకురాలైన సిరిపై యానీ ఒంటికాలిపై లేచింది. ఇక నేటి ఎపిసోడ్లో కూడా ఓ రేంజ్లో గొడవలు జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సంచాలకులుగా కాజల్, సిరిలు సరిగా చేయడం లేదంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నాలుగు టీమ్‌ల సభ్యులు. కన్వేయర్ బెల్ట్‌పై నుంచి వచ్చే రా మెటీరియల్ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ‘ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ’అని సన్నీ ఊగిపోగా.. ‘సంచాలకులపై ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు అందరి ముందు సారీ చెప్పాలి’అని సిరి డిమాండ్ చేసింది. దీన్ని తేలిగ్గా తీసుకున్న సన్నీ.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ‘నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మరోవైపు కాజల్.. సంచాలకురాలిగా తనకు వచ్చి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంటి సభ్యులపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ‘మేం పెట్టిన రూల్‌ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలి’ అంటూ రూల్ పెట్టింది. దీనికి మేం ఒప్పుకోం అని ప్రియ విభేదించింది. అంతేకాదు ‘ నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు’ అంటూ ప్రియ సీరియస్ అయింది. ఈ సమయంలో సన్నీ విజిల్స్ వేస్తూ ‘అటు బస్సూ.. ఇటు బస్సూ ’అనే పాట పాడాడు. మరోవైపు బాగా డిస్టర్బ్ అయిన సిరిని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు షణ్ముఖ్. సిరిపై సన్నీ ఎందుకు ఫైర్ అయ్యాడు? కాజల్ అలాంటి రూల్ ఎందుకు పెట్టింది? తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
తొక్కలో రిలేషన్షిప్ నాకొద్దన్న యానీ.. కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత
బిగ్‌బాస్ ఇంట్లో ఆరోవారం గొడవల వారంగా మారింది. నామినేషన్ ప్రక్రియలో మొదలైన గొడవలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ అనే నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. అందులో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతలకు స్పెషల్ ఫవర్ లభించింది. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఆఫరే బిగ్‌బాస్ ఇంట్లో పెద్ద గొడవకు దారి తీసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. రవి టీమ్ సభ్యులు తమ స్పెషల్ పవర్‌ను ఉపయోగించి యానీ మాస్టర్ టీమ్ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో యానీ మాస్టర్ మరో ప్లాన్ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్ అయిన యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది. మరి యానీ అంతలా ఫైర్ అవడానికి కారణం ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: యానీ ఉగ్రరూపం.. అలా బ్లేమ్ చేయలేవంటూ సిరిపై ఫైర్
సోమవారం జరిరిగిన నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ ఇళ్లంతా గంభీరంగా మారింది. ఆరోవారంలో అత్యధికంగా 10 మంది( షణ్ముఖ్, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ )నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే..నామినేషన్ ప్రక్రియతో బాగా హర్ట్ అయిన ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా.. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బొమ్మల కోసం హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు గొడవ పడినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. ఇక జెస్సీ మాత్రం శ్వేతాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. టాస్క్‌లో భాగంగా.. యానీ మాస్టర్ 'నేను యాక్సెప్ట్ చేయను.. నేను గొడవ చేస్తా' అంటూ కాజల్-సిరిలతో చెప్పగా.. 'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను' అంటూ సిరి చెప్పకొచ్చింది. 'నాకు ముందొకటి వెనకొకటి మాట్లాడడం రాదు' అంటూ యానీ మాస్టర్ సిరికి వార్నింగ్ ఇచ్చింది. మరి యానీ-సిరిల గొడవ ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 5 Telugu: చర్రితలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి బ్రేకప్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఐదు వారాలను దిగ్విజయంగా ముగించుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దీంతో హౌస్ అంతా గంభీరంగా మారిపోయింది. ప్రతి సోమవారం బిగ్‌బాస్ ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం కామన్. అయితే ఈ వారం గొడవల మోతాదు కాస్త ఎక్కువైంది. దీంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నామినేషన్ ప్రక్రియ ముగియగానే ఇంటి సభ్యులంతా మళ్లీ ఒక్కటైనట్లు తెలుస్తోంది. సన్నీ అయితే ఎప్పటి మాదిరే తనదైన పంచులతో ఇంటి సభ్యులను నవ్వించాడు. శ్రీరామ్‌ను ఇమిటేట్ చేస్తూ పలకించిన హావభావాలు హౌస్‌లో నవ్వులు పూయించాయి. అలాగే హమిదా ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. మరోవైపు కాజల్, శ్రీరామ్‌లు మధ్య నామినేషన్ ప్రక్రియ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్ అయిన కాజల్.. శ్రీఆమ్ని ఉద్దేశిస్తూ.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్రిమూర్తులు (షణ్ముఖ్, జెస్సీ, సిరి) ఎప్పటి మాదిరే ఇతర సభ్యులపై పంచులేశారు. ‘ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు. -
శ్రీరామ్‌పై ప్రేమను బయటపెట్టిన హమీదా!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఐదో ఎలిమినేషన్ ఊహించినట్లుగానే జరిగింది. ముందు నుంచీ అనుకున్నట్లే హమీదా హౌస్ నుంచి నిష్క్రమించింది. అయితే ఆమె లేని లోటు అందరికన్నా ఎక్కువగా శ్రీరామ్‌ను వెంటాడనుంది. నిరంతంరం అతడినే అంటిపెట్టుకుని ఉంటూ అటు పనుల్లోనూ, ఇటు టాస్కుల్లోనూ శ్రీరామ్ చేయి విడవలేదు హమీదా. అలాంటిది సడన్‌గా అతడికి దూరం కావాల్సిరావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పేముందు శ్రీరామ్‌ను కళ్లారా చూసుకుని మనసారా ఏడ్చేసింది. అతడి మీదున్న ప్రేమను తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో బయటపెట్టిందీ బ్యూటీ. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైన హమీదా కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. షణ్ముఖ్ హౌస్‌లో పెదరాయుడు అని చెప్పుకొచ్చింది. సిరి.. గ్రూప్‌లో ఉందని, ఆమె చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం చేయడానికి ఆలోచిస్తుందని పేర్కొంది. శ్రీరామ్, మానస్ రెండు కళ్లు అన్న ప్రియాంక సింగ్ రిలేషన్‌షిప్‌ను ఫేక్ చేస్తుందని ఆరోపించింది. హౌస్ నుంచి ఏం తీసుకువెళ్తున్నావ్? అన్న అరియానా ప్రశ్నకు హమీదా క్షణం ఆలోచించకుండా శ్రీరామ్ అని సమాధానమిచ్చింది. అంతేకాకుండా శ్రీరామ్ ఫొటో చూడగానే సిగ్గుతో ముడుచుకుపోతూనే ఎమోషనల్ అవుతూ లవ్ సింబల్ చూపిస్తూ మనసులోని ప్రేమను బయటపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్యాయంగా శ్రీరామ్-హమీదాలను విడదీసారంటూ కామెంట్లు పెడుతున్నారు. -
నామినేషన్స్ లీక్: ఈసారి ఏకంగా 10 మంది, ఎవరెవరంటే?
Bigg Boss 5 Telugu, 6th Week Nominations: మండే.. అనగానే బిగ్‌బాస్ ప్రేక్షకులకు చటుక్కున గుర్తొచ్చేది నామినేషన్స్. అప్పటిదాకా చిరునవ్వుతో విప్పారిన ముఖాలు కాస్తా ఈ నామినేషన్స్ రాగానే కోపంతో ఎర్రబడిపోతాయి. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఒకరి మీద ఒకరు తెగ అరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నేడు ఆరోవారం నామినేషన్స్ జరగబోతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్లకు అగ్నిపరీక్ష పెట్టాడు బిగ్‌బాస్. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి పొటోలను మంటల్లో వేయమని ఆదేశించాడు. ఈ క్రమంలో మానస్ తనకు టాస్కులో సపోర్ట్ చేసిన జెస్సీని నామినేట్ చేశాడు. నీకు సపోర్ట్ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను హెచ్చరించింది యానీ మాస్టర్. రేషన్ మేనేజర్ అంటే అందరికీ సమానంగా ఫుడ్ పంచాలే తప్ప ఫస్ట్ మనమే వెళ్లి తినడం కాదు.. అంటూ విశ్వపై సెటైర్ వేసింది ప్రియ. ఆమె అలా మాట్లాడటం నచ్చని విశ్వ.. నా కడుపు నా ఇష్టం, తింటాను అని ఆన్సరిచ్చాడు. ఇక సిరి, శ్వేత మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కెప్టెన్ ప్రియ, షణ్ముఖ్, యానీ మాస్టర్, కాజల్ మినహా మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారట! అంటే సన్నీ, విశ్వ, సిరి, జెస్సీ, రవి, మానస్, శ్రీరామచంద్ర, లోబో, శ్వేత, ప్రియాంక సింగ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు భోగట్టా! ఒకవేళ ఇదే నిజమైతే లోబో, శ్వేత, సిరి, విశ్వ డేంజర్ జోన్లో ఉన్నట్లేనని గుసగుసలు పెడుతున్నారు నెటిజన్లు. -
మీరు ఉన్నన్ని రోజులు నామినేట్ చేస్తూనే ఉంటా: సన్నీ వార్నింగ్
Bigg Boss Telugu 5, Sixth Week Nominations: వారమంతా కలిసే ఉంటారు. కానీ సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడలేని కోపాలు ప్రదర్శిస్తుంటారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ నానారభస చేస్తుంటారు. కంటెస్టెంట్ల మధ్య వైరం పెరిగేది, మిత్రువులు కూడా శత్రువులుగా మారేది ఈ 'మండే' రోజే. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్‌తో భగభగ మండిపోతోంది బిగ్‌బాస్ హౌస్. ప్రతిసారి ఎధవ రీజన్లతో నామినేట్ చేస్తారంటూ తెగ చిరాకు పడింది ప్రియాంక సింగ్. టాస్క్‌లో నా జేబులో నుంచి కాయిన్లు దొంగతనం చేశాడంటూ లోబో జెస్సీని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణం విన్న జెస్సీ వెటకారంగా నవ్వుతూ తాను గేమ ఆడటానికి వచ్చానని, నమ్మకంతో పని లేదంటూ కౌంటరిచ్చాడు. అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోకండి అంటూ సిరిని నామినేట్ చేశాడు శ్రీరామ్. అలాగే షణ్ముఖ్‌ను సైతం నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నామినేషన్‌ను జీర్ణించుకోలేకపోయిన షణ్ను... బిగ్‌బాస్ హౌస్‌కు నువ్వో దేవుడివి, నువ్వేది చెప్తే అదే మేం పాటించాలి! అంతేనా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వీరిద్దమరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ప్రియ ఉన్నన్ని రోజులు తప్పకుండా ఆమెనే నామినేట్ చేస్తానన్నాడు సన్నీ. అతడి మాట విని అవాక్కైన ప్రియ.. వార్నింగ్ ఇస్తున్నావా? అంటూనే అతడి ఫొటోను మంటల్లో వేసింది. మొత్తానికి వాడివేడిగా సాగనున్న ఈ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. -
నాగార్జున పంచ్.. ఏడ్చేసిన యాంకర్ రవి
అందరూ కలిసి చేసుకునేదే పండగ. కానీ ఈ పండక్కి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అక్కడున్నవాళ్లతోనే వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది తప్ప వారివారి ఫ్యామిలీని కలుసుకునే, చూసుకునే ఛాన్సే లేదు. కానీ పండగ రోజు వారి మనసు కష్టపెట్టడం తగదనుకున్నాడో ఏమోకానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన వీడియోలు చూపించి హౌస్‌మేట్స్‌ను సర్ప్రైజ్ చేశాడు. దాదాపు నెల రోజులుగా ఇంట్లోవాళ్లను చూడకుండా ఉన్న కంటెస్టెంట్లు వారి మాటలు వినగానే ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా వుంటే నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన హైపర్ ఆది ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్ చేస్తూ నవ్వించాడు. శ్వేతతో పులిహోర కలపడం వచ్చుగానీ చపాతీ పిండి కలపడం రాదా? అని సెటైర్ వేశాడు. నేను టైటిల్ వెంట పడుతుంటే పింకీ నా వెంట పడుతుందేంటి? అని అనిపించిందా? అని మానస్‌ను గుచ్చిగుచ్చి అడిగాడు. కాజల్‌ను నిద్రలో నుంచి లేపి పేరేంటి? అని అడిగితే స్ట్రాటజీ అంటుందని ఆమెమీద పంచ్ వేయడంతో అందరూ ఘొల్లున నవ్వారు. ఇక నాగ్ కూడా రవిని.. ఏంటి, ఇన్ఫ్లూయెన్స్ చేస్తావా? అంటూ ఆటపట్టించడం గమనార్హం. ఆటలు, పాటలు, ఆనందాలు, కన్నీళ్లు.. అన్నింటి కలయికగా వస్తున్న నేటి ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. -
బిగ్‌బాస్: బుట్టబొమ్మను పడగొట్టమని అఖిల్ చాలెంజ్
ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయింది బిగ్‌బాస్. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలువురు సినీసెలబ్రిటీలు బిగ్‌బాస్ స్టేజీ మీదకు విచ్చేశారు. ఈ క్రమంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' హీరో అఖిల్ హీరోయిన్ పూజాహెగ్డేతో రొమాంటిక్ సాంగ్‌కు చిందులేశాడు. ఇది చూసిన నాగ్.. ఏరా? ఇది నీ ఇల్లనుకున్నావా? అని ఫైర్ అయ్యాడు. దీంతో అఖిల్.. ఈ స్టేజీ మీదేనని ఎవరో అన్నారని చెప్పాడు. దీనికి నాగ్.. ఇది కేవలం నాది మాత్రమేనంటూ కౌంటరిచ్చాడు. అనంతరం అఖిల్... హౌస్‌లో ఉన్న బ్యాచిలర్లు పూజాను పడగొట్టేందుకు ప్రయత్నించమని సవాలు విసిరాడు. మొదట శ్రీరామ్.. సామజవరగమన... పాటందుకుని ఆమెను బుట్టలో వేసేందుకు ప్రయత్నించాడు. మరి మిగతావాళ్లు బుట్టబొమ్మను ఎలా ఇంప్రెస్ చేశారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. 'నీళ్లు లేని సముద్రం ఎక్కడుంటుంది?' అని నాగ్ ప్రశ్న విసరగా.. నా ఇంటెలిజెన్స్ వాడతాను అని సన్నీ ముందుకొచ్చాడు. అయినా లేనిది ఎలా వాడతావు? అంటూ పరువు తీశాడు నాగ్. -
'నాకు నేనే కింగ్'.. ఇందుకే నామినేట్ చేశారని నాగ్ పంచ్
బిగ్‌బాస్ ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ 'రాజ్యానికి ఒక్కడే రాజు' గేమ్‌లో ఇద్దరు యువరాజులు రవి, సన్నీ పోటీపడ్డ విషయం మనందరికీ తెలిసిందే! ఇతర హౌస్మేట్స్ వేసిన ఎత్తులు, పై ఎత్తులతో వీరి రాజ్యాలు కిందామీదా పడి లేవగా.. చివరికి యువరాజు రవి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే తాజా ప్రోమోలో మరోసారి రాజును ఎన్నుకోమని ఆదేశించినట్లున్నాడు నాగ్. దీంతో కంటెస్టెంట్లు కొందరు తమకు బెస్ట్ అనిపించినవారికి కిరీటం అందిస్తున్నారు. ముందుగా కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్‌కు కిరీటాన్ని అలంకరించింది. తర్వాత షణ్ముఖ్.. ఈ వారం నాకు హమీదా కనిపించలేదంటూ ఆమెకు బానిస టోపీ పెట్టాడు. హౌస్ అంతా తన గురించి మాట్లాడేలాగా చేస్తున్న కాజల్ మహారాణి అన్నాడు శ్రీరామ్. ఇక హమీదా బానిసైపోతుందని అభిప్రాయపడ్డాడు మానస్. తర్వాత షణ్ను వంతురాగా తనకు తానే కింగ్ అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని కౌంటరిచ్చాడు. అయితే వాళ్లందరూ అందరిముందు ఓపెన్‌గా చేయలేదని రివర్స్ పంచ్ ఇచ్చాడు షణ్ను. మరి మెజారిటీ ఇంటిసభ్యులు ఎవరిని బానిసగా భావించారు? ఎవరిని రాజుగా ఎన్నుకున్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా?: నాగ్ సూటి ప్రశ్న
Bigg Boss Telugu 5 Promo: చూస్తుండగానే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఐదో వారం కూడా ముగింపుకు వచ్చేసింది. ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ను పలకరించింది. యంగ్ హీరో వైష్ణవ్‌తేజ్, దర్శకుడు క్రిష్ బిగ్‌బాస్ స్టేజీమీదకు వచ్చి కంటెస్టెంట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. కొండపొలం చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించాడు. ఇక నాగ్.. 'నీకు బిగ్‌బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా?' అని ప్రశ్నించగా.. అతడు బిగ్‌బాస్ టైటిల్ అని ఆన్సరిచ్చాడు. ఇది విన్న క్రిష్.. నేనైతే హమీద గారు ముఖ్యం అనేవాడిని అని బదులివ్వడంతో అందరూ చిరునవ్వులు చిందించారు. ఇక ఎప్పటిలాగే వారంలో జరిగిన గొడవలను ప్రస్తావనకు తెచ్చి పంచాయతీ మొదలుపెట్టాడు నాగ్. కిచెన్‌లో జెస్సీ, శ్రీరామ్ మధ్య జరిగిన ఫైటింగ్ గురించి సైతం చర్చించాడు. అంత రఫ్‌గా ఎలా ఆడావని శ్రీరామ్‌ను నిలదీయగా అతడు తాను కొట్టలేదని దీర్ఘం తీయడంతో వీడియో ప్లే చేయించాడు నాగ్. మరి కిచెన్‌లో జరిగిన లొల్లిలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
స్మోకింగ్ రూమ్‌లో ఏడ్చేసిన సన్నీ, మానస్..
సంతోషం, దుఃఖం, కోపం, వైరం, అలకలు, గిల్లికజ్జాలు, మనస్పర్థలు, పశ్చాత్తాపాలు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇవన్నీ సర్వసాధారణమే! అయితే పరిస్థితులను బట్టి వాటికి ఎదురీదుతూ ముందుకు వెళ్లాలి, అన్నింటినీ జయించగలగాలి! అప్పుడే గెలుపుకు చేరువయ్యేది! బిగ్‌బాస్ కంటెస్టెంట్లతోనే కాదు, వారి ఎమోషన్స్‌తోనూ ఆటలాడుతాడు. ఇందుకు తార్కాణంగా నిలిచిందీ ప్రోమో. తాజాగా రిలీజైన ప్రోమోలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సన్నీ, మానస్ స్మోకింగ్ రూమ్‌లో వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో లోబో, విశ్వ.. అటు సన్నీని, ఇటు మానస్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. 'నీకు ఎవరో ఒక్కరే ఇష్టముంటే వేరు.. కానీ అందరూ ఇష్టమైనవాళ్లే అంటే ఎలా డార్లింగ్?' అని సన్నీని ఊరడించాడు విశ్వ. ఏదేమైనా వీళ్లిద్దరూ ఇలా ఏడ్చేయడాన్ని చూసి అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. సన్నీ, మానస్.. ఇద్దరూ ఫైటర్లే అని, మీరు ఏడిస్తే మాకు బాధగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆటలో జరిగేవాటిని మనసుకు తీసుకోకూడదని హితవు పలుకుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ ఇద్దరి దుఃఖం వెనక గల కారణాలేంటో తెలియాలంటే ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! -
వరస్ట్ పర్ఫామర్ ఎవరు? ఈ వారం జైలుకు వెళ్లేది ఆవిడేనా?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సీజన్ మొత్తానికి కెప్టెన్ కాలేరన్న ప్రియను బిగ్‌బాస్ ప్రత్యేక అధికారంతో కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. దీంతో ఎవరు చెత్త ఆటగాళ్లనుకుంటున్నారో వారిని బలిపీఠం ఎక్కించి ముఖం మీద నీళ్లు గుమ్మరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శ్వేత మాట్లాడుతూ.. 'నాకు, సన్నీ, యానీ మేడమ్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, అది టాస్క్ వల్ల ఎండ్ అయ్యేది కాదు. సో ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేయకండి' అని సూచిస్తూ కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మరోసారి జెస్సీ, సిరి, షణ్ముఖ్ గ్యాంగ్‌కు శ్రీరామ్‌కు మధ్య రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. తాను వయొలెంట్‌గా ఉన్నానంటూ సిరి గ్యాంగ్ సభ్యులందరూ చేయెత్తడంతో శ్రీరామ్ ఖంగు తిన్నాడు. తర్వాత రవికి కాజల్‌కు మధ్య కూడా గట్టి ఫైట్ నడిచినట్లు కనిపించింది. ఎవరి మీదా చేయెత్తొద్దు అంటూ కాజల్‌కు నీతి వాఖ్యాలు బోధించాడు రవి. చివర్లో యానీ మాస్టర్ ఎవరి ముఖం మీదా నీళ్లు గుమ్మరించలేక తన ఫేస్ మీద తానే నీళ్లు చల్లుకోవడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారమైతే ఈవారం కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకు వెళ్లినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి! అనర్హత వేటు ఉన్న ఆమె కెప్టెనా?
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కెప్టెన్సీ పోటీ జరుగుతోంది. హౌస్‌లో ఎవరు కెప్టెన్ అవుతారన్నదానిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు యువరాజులైన రవి, సన్నీ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని కసితో రగిలిపోతున్నారు. వీరిద్దరిలోని ఏ రాజ్యంలో ఎక్కువ నాణాలు ఉంటే ఆ ఆస్థానంలోని ప్రజలే కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో యువరాజు రవి టీమ్ గెలిచిందట! దీంతో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ కెప్టెన్సీకి పోటీపడ్డట్లు సమాచారం. హమీదా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివరగా ప్రియ పోటీలో గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు లీకులు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో హమీదాకు ఓ పవర్ లభించింది. దీనిద్వారా ఆమె ఎంపిక చేసుకునే కంటెస్టెంట్ ఎప్పటికీ కెప్టెన్ కాలేరని బిగ్‌బాస్ వెల్లడించాడు. ఇందుకు హమీదా.. సీనియర్ నటి ప్రియ పేరు సూచించింది. దీంతో ఈ సీజన్ మొత్తంలో ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశమే లేదని, దాని వల్ల లభించే ఇమ్యూనిటీ కూడా ఆమెకు దక్కదని ప్రకటించాడు బిగ్‌బాస్. కానీ తాజాగా ప్రియ కెప్టెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్‌బాస్ చరిత్రలోనే ఈ కెప్టెన్సీ రికార్డుకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ ఆమెను కెప్టెన్‌గా ఒప్పుకోకపోతే ఆ పదవిని ప్రియ వేరే ఎవరికైనా అప్పగించే అవకాశమూ లేకపోలేదు! -
అబ్బాయైనా, అమ్మాయైనా.. మాకు సర్వం నువ్వే: పింకీ తండ్రి
Bigg Boss Telugu 5 Promo: అతడు ఆమెగా మారడం అంత ఈజీ కానే కాదు! ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆమెగా మారినా ఈ సమాజం వారికి అక్కున ఆదరించదు, పైగా సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తుంటుంది. అయినవాళ్లకు దూరమై, ఏమీకాని వాళ్లతో మాటలు పడే ట్రాన్స్జెండర్ల వ్యథలు వర్ణణాతీతం. అయితే ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బిగ్‌బాస్ వరకు వచ్చింది సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్. ఇప్పటివరకు తను అమ్మాయిగా మారానన్న విషయం తండ్రికి తెలియదని బిగ్‌బాస్ ప్రారంభమైన తొలినాడే స్టేజీ మీదే చెప్పి గుక్క పెట్టి ఏడ్చింది పింకీ. అలాంటి పింకీకి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. పింకీ అమ్మాయిగా మారడం తమకు సమ్మతమేనని తండ్రి మాట్లాడిన మాటలను వీడియో వేసి చూపించాడు. ఇది కలో, నిజమో అర్థం కాని పింకీ హౌస్‌లో తెగ ఎమోషనల్ అయింది. 'నాన్నా సాయితేజ, నువ్వు అబ్బాయైనా, అమ్మాయైనా.. మాకు సర్వం నువ్వే. నువ్వు అమ్మాయిగా మారావని మేము ఆదరించడం ఆపేస్తామని ఎప్పుడూ అనుకోకు' అని ధైర్యం చెప్పాడు. తండ్రి తనను ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించడంతో సంతోషం తట్టుకోలేకపోయింది పింకీ. ఇప్పటికీ సొంతింటికి దొంగలా వెళ్తానని, చాలాసార్లు నేనొచ్చిన విషయం పక్కింటివాళ్లకు కూడా తెలీదని చెప్పుకొచ్చింది. మా నాన్న నాలోని మార్పును యాక్సెప్ట్ చేయడం సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక బిగ్‌బాస్ పింకీ బర్త్‌డే ను పురస్కరించుకుని చీర, గాజులు, పువ్వులు, స్వీట్లు పంపించాడు. దీంతో అందంగా ముస్తాబైన పింకీ.. మానస్ కాళ్ల మీద ఆశీర్వాదం అందుకుంది. మొత్తంగా పింకీ బర్త్‌డే వేడుకలతో నేటి ఎపిసోడ్ మరింత ఎమోషనల్‌గా మారేటట్లు కనిపిస్తోంది. -
బిగ్‌బాస్: జెస్సీతో పోటీకి సై అన్న యానీ మాస్టర్
బిగ్‌బాస్ షోలో ఆడామగా అనే తేడా ఉండకూడదని నాగార్జున చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అదే రూల్‌ను పాటిస్తున్నారు హౌస్మేట్స్. కుస్తీపోటీకి ఇద్దరు మగవాళ్లు కాకుండా, ఒక లేడీ కంటెస్టెంట్, ఒక మేల్ కంటెస్టెంట్ పోటీపడ్డారు. సన్నీ రాజ్యంలో నుంచి జెస్సీ, యాంకర్ రవి రాజ్యంలో నుంచి యానీ మాస్టర్ ముఖాముఖిగా తలపడనున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. మరీ వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే అబ్బాయిలు, అమ్మాయిలకు మధ్య ఇలాంటి టాస్క్ పెట్టినప్పుడు బాయ్స్కే ఎక్కువ మైనస్ అంటున్నారు నెటిజన్లు. ఆడవాళ్లతో కలిసి వారు కంఫర్టబుల్‌గా గేమ్ ఆడలేరని, పూర్తి శక్తిని వినియోగించలేరని చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఎదురుగా ఉంది ఆడ, మగ అని కాకుండా కేవలం పోటీదారులుగా మాత్రమే చూడాలని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా జెస్సీ, యానీ మాస్టర్ల మధ్య ఫైటు మంచి రసపట్టుగా మారనున్నట్లు తెలుస్తోంది. -
శ్రీరామ్‌ను ఎత్తిపడేసిన జెస్సీ, ఇది కదా అసలైన కొట్లాట!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హింసకు తావు లేదని బిగ్‌బాస్ గతంలోనే హెచ్చరించినా కంటెస్టెంట్లు మరోమారు ఆ మాటను పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్కులో హౌస్మేట్స్ దెబ్బలు తాకినా, రక్తాలు కారినా తగ్గేదేలే అన్న రీతిలో పోరాడుతున్నారు. ఈ వారం బిగ్‌బాస్ 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా.. యువరాజులుగా ఉన్న రవి, సన్నీ సింహాసనాన్ని అధిష్టించేందుకు పోటీపడతారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాస్కులు కొనసాగేకొద్దీ కొందరు ప్రజలు తమ యువరాజుకు మద్దతును ఉపసంహరించుకునేందు ప్రయత్నిస్తుండగా మరికొందరు పట్టపగలే ఖజానాను దొంగిలించేందుకు యత్నించారు. ఇది చూసిన శ్వేత.. 'ఇంకా గేమ్ ఎందుకు ఆడటమో' అని సెటైర్ వేసింది. మరోవైపు సన్నీ వర్సెస్ రవి అని రాసి ఉన్న బోర్డులపై యువరాజుల ఫొటోలు పెట్టి ఉండగా హౌస్మేట్స్ దాన్ని విసిరి పారేసేందుకు తీవ్రంగా శ్రమించారు. బోర్డులను కింద పడేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేసినట్లు కనిపించింది. మరీ ఇంత అరాచకంగా మారిన ఈ గేమ్‌లో ఏ యువరాజును ఎవరెవరు గెలిపించారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది! -
సన్నీ Vs రవి: తొడగొట్టి సవాలు విసిరిన విశ్వ!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఈ రాజ్యానికి ఒక్కడే రాజు అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే కుర్చీ కోసం యాంకర్ రవి, సన్నీ ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఖజానాలోని నాణాలను కూడా పంచుతున్నారు. ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక సింగ్, లోబో, ప్రియ.. సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించగా.. రవికి.. విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించారు. ఇక ఇద్దరు రాజుల కోసం విశ్వ, మానస్ బురదలో ఫైట్ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి, కానీ దొంగబుద్ధులు ఏంది? అని తొడగొట్టి ప్రశ్నించాడు విశ్వ. పేరు తీసి మాట్లాడు, కానీ అందరినీ ఎందుకు అంటున్నావని ఆవేశపడ్డాడు మానస్. మరి హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు కెప్టెన్ అయ్యారు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: నీకు సరదానేమో.. నాకు కాదు: కాజల్‌కు రవి వార్నింగ్
Heated Argument Between Ravi and Kajal: బిగ్‌బాస్ ఐదో సీజన్లో గొడవల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సోమవారం ఎపిసోడ్లో కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో కెప్టెన్ శ్రీరామ్, జెస్సీ, షణ్ముఖ్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని కెప్టెన్ శ్రీరామ్ ఆదేశించడం.. దీనిపై సిరి, షణ్ను సీరియస్ అవ్వడంతో ఇంట్లో యుద్ద వాతావరణం కనిపించింది. చివరకు శ్రీరామ్ ప్లేట్లో అన్నం తీసుకొచ్చి జెస్సీ, షణ్నూలకు తిపిపించడంతో గొడవ సమసిపోయినట్లు అనిపించింది. దీంతో ఇంట్లో అంతా హ్యాపీగా గేమ్‌పై ఫోకస్ పెడుతారనుకుంటున్న క్రమంలో రవి, కాజల్‌ల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తాజాగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. బెడ్రూమ్లో పడుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్న రవి, లోబోల దగ్గరకు వెళ్లిన కాజల్.. ‘నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి’ అని సరదాగా ఆటపట్టిస్తూ చిందులేసింది. అదికాస్త పెద్ద గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాజల్ మాటలను సీరియస్‌గా తీసుకున్న రవి. అలా ఎలా అంటావంటూ. ఆమెపై ఫైర్ అయ్యాడు. ‘నేను సరదాగా అన్నాను’ అని కాజల్ చెప్పగా, ‘నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు’అంటూ రవి ఫైర్ అయ్యాడు. అంతే కాదు రెచ్చగొట్టడం నాకు కూడా వస్తుందంటూ కాజల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఇది నీ ఇల్లు కాదన్న షణ్ను, మధ్యలోకి రాకంటూ శ్రీరామ్ వార్నింగ్!
Bigg Boss Telugu 5 Promo, Shanmukh Vs Sreeram బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయా? అన్న ప్రశ్నకు మెజారిటీగా అవునని కొద్దిమంది మాత్రం కాదని సమాధానాలిస్తారు. అయితే తాజా ప్రోమోతో హౌస్‌లో గ్రూపులు ఉన్నాయన్న విషయం బట్టబయలైంది. గ్రూపులో ఉన్న ఏ ఒక్కరితో పెట్టుకున్నా మిగతా వాళ్లు గయ్యిమని లేస్తారని తేట తెల్లమైంది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు ఏ గ్రూప్‌తో ఏరికోరి గొడవ పెట్టుకున్నారు? వీటికి సమాధానాలు తెలియలాంటే తాజాగా వచ్చిన ప్రోమో చూసి తీరాల్సిందే! షణ్ముఖ్‌ను నామినేట్ చేసింది వీళ్లే అంటూ బిగ్‌బాస్ 8 మంది కంటెస్టెంట్ల ఫొటోలను టీవీలో వేసి చూపించాడు. అందులో యాంకర్ రవి, లోబో, శ్రీరామ్, ప్రియ, హమీదా, సన్నీ, విశ్వ, మానస్ ఉన్నారు. తన మీద అంతమంది పగపట్టారా? అని ఒక్క క్షణం పాటు షాకైన షణ్ను తనను నామినేట్ చేసినందుకు థాంక్యూ చెబుతూ ఓ స్మైల్ విసిరాడు. ఇక కిచెన్‌లో పెద్ద యుద్ధమే జరిగినట్లు కనిపిస్తోంది. ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్ పెడతాను అని కెప్టెన్ శ్రీరామ్ జెస్సీకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జెస్సీ ఫుడ్ ఇవ్వను, ఫుడ్ పెట్టను అనడం ఏంటని అసహనానికి లోనయ్యాడు. తన ఫ్రెండ్ జెస్సీ మీదకు శ్రీరామ్ ఫైర్ అవడం చూసిన సిరి, షణ్ను.. కెప్టెన్ మీద అరిచినంత పనిచేశారు. 'నీ ఇష్టం వచ్చినట్లు రూల్ పెట్టుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కౌంటరిచ్చాడు షణ్ను. విషయం తెలియకుండా మధ్యలోకి రావద్దని హెచ్చరించాడు శ్రీరామ్. అయినా నువ్వెవరు మాకు చెప్పడానికి అని సిరి సీరియస్ అవగా.. నువ్వొచ్చి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్. మొత్తంగా నేడు జరిగిన పరిణామాలను బాగా సీరియస్‌గా తీసుకున్న షణ్ను ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ హౌస్‌మేట్స్‌కు సవాలు విసిరాడు. మరి ఇప్పటికైనా షణ్ను గేమ్ ఆడటం మొదలు పెడతాడో? లేదో? చూడాలి! -
బిగ్‌బాస్: ఐదో వారం నామినేషన్లో 9 మంది!
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే నామినేషన్స్ ఉన్న మండేనే అసలైన ఫండే అంటారు బిగ్‌బాస్ వీక్షకులు. ఎప్పటిలాగే ఈ వారం కూడా కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియకు రెడీ అయిపోయారు. గేమ్ సరిగా ఆడలేకపోతున్నవారితో పాటు, గ్రూపిజం చేస్తూ తమ మీద ప్రతాపాన్ని చూపిస్తున్న కంటెస్టెంట్లను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అయితే ఈసారి బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను భిన్నంగా నిర్వహించాడు. ముఖాముఖిగా నామినేషన్స్ జరపకుండా సీక్రెట్ రూమ్‌కి పిలిచి నామినేట్ చేయాలనుకుంటున్నవారి పేర్లు, అందుకు తగిన కారణాలను చెప్పమని ఆదేశించాడు. అయితే సన్నీ.. ఇలా సీక్రెట్‌గా కాకపోయినా, బయట నామినేషన్స్ జరిగినా ఈ రెండు పేర్లే చెప్దామని డిసైడ్ అయ్యాను అని పేర్కొన్నాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం.. తనను నామినేట్ చేసినవాళ్లనే నామినేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. లోబో.. ఇంటిసభ్యుల్లోని కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. నేనా రోజు సైలెంట్‌గా మాట్లాడుంటే షణ్ముఖ్ ఎవరిని నామినేట్ చేసేవాడని ప్రశ్నించాడు. ఇక రవి.. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని జెస్సీ నా పేరు ట్యాగ్ చేయడం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనిపిస్తుందంటూ అతడిని నామినేట్ చేశాడు. సింగర్ శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్, జెస్సీ గ్రూపిజం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇలా అందరూ వారివారి కారణాలు చెప్తూ నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్‌కు సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తవడంతో ఈవారం ఎవరెవరు నామినేట్ అయ్యారనే లిస్టు సోషల్ మీడియాలో లీకైంది. అనూహ్యంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో యాంకర్ రవి, మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియ, విశ్వ, లోబో, హమీదా, జెస్సీ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సారి నామినేషన్లో ఊహించని కంటెస్టెంట్లు ఉండటంతో ఎలిమినేషన్ మరింత ఆసక్తికరంగా మారింది! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి: నాగార్జున
వీకెండ్ ఎపిసోడ్ అంటే చాలు కంటెస్టెంట్లు ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్ అన్నట్లుగా గమ్మునుండిపోతారు. వారమంతా ఎన్నో తప్పులు చేసినా కింగ్ నాగార్జున ముందు మాత్రం అమాయకంగా ఫేస్ పెడుతుంటారు. కానీ నాగ్ వారి పప్పులు ఉడకనిస్తాడా? తప్పులు చేసి తప్పించుకు తిరిగేవారిని నిలబెట్టించి మరీ చెడుగుడు ఆడేసుకుంటాడు. అలా గాడి తప్పుతున్న హౌస్‌ను ఓ దారిలో పెడుతుంటాడు. ఓ పక్క హౌస్‌ను సెట్ చేస్తూనే, మరో పక్క ఇంటిసభ్యులతో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఈ వారం బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో దాక్కో దాక్కో మేక టాస్క్ ఆడించాడు. మరో ప్రోమోలో ఇంటిసభ్యులు.. నిన్నే పెళ్లాడతా సినిమా వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆ మూవీలోని సాంగ్స్‌కు స్పెషల్ డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన నాగ్.. సంతోషంతో తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. ప్రోమోలో ఈ రేంజ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ మరి పూర్తి ఎపిసోడ్లో ఎంతమేరకు ఉంటుందో చూడాలి! -
నా మీద పడి ఏడవకు: అందరిముందే రవికి జెస్సీ వార్నింగ్
Bigg Boss Telugu 5 Promo: సింగర్ శ్రీరామ్, హమీదా మధ్య లవ్ ట్రాక్‌ను మరోసారి గుర్తు చేశాడు కింగ్ నాగార్జున. హమీదా కోసం గిటార్‌తో ఓ మ్యూజిక్ ప్లే చేయడం, హమీదా తనకు లవ్ ఫీలింగ్ వస్తుందనడం నిన్నటి ఎపిసోడ్లో చూశాం కదా! దీంతో నాగ్ కూడా గిటార్ అందుకుని సేమ్ మ్యూజిక్ ప్లే చేశాడు. పాట ఎలా ఉందని నాగ్ అడగ్గా.. లవ్ ఫీల్ వస్తుందని తెగ సిగ్గుపడిపోయింది హమీదా. గతవారం నటరాజ్‌ను గుంటనక్క ఎవరని అడిగిన నాగ్.. ఈసారి మాత్రం ఆ నత్త ఎవరు? అని ప్రశ్నించాడు. దీంతో నటరాజ్ తెలిసిపోయిందా అని పడీపడీ నవ్వాడు. అప్పటివరకు సరదాగా సాగిన వాతావరణం జెస్సీ ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. తనను ఫోకస్ చేయడం ఆపేయాలని యాంకర్ రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జెస్సీ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అందరిముందే హెచ్చరించడంతో రవి గుడ్లు తేలేశాడు. జెస్సీ వ్యాఖ్యలపై రవి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
షణ్ముఖ్, లోబోల పరువు తీసిన నాగార్జున!
బిగ్‌బాస్ హౌస్‌లో కంట్రోల్ తప్పిన కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు వీకెండ్ ఎపిసోడ్ ద్వారా రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఎవరు అతి చేశారో? ఎవరు అసలు ఆట ఆడకుండా ఉన్నారో? ఎవరు ఇన్ఫ్లూయెన్నస్ చేస్తున్నారో? ఇలా అన్ని లెక్కలు బయటపెడుతూ ఒక్కొక్కరికీ గట్టిగానే క్లాసులు పీకుతున్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మొదటగా షణ్ముఖ్‌ను మిర్చి తినమని చెబుతూ.. గేమ్ ఆడకుండా కూర్చుని కబుర్లు చెప్తున్నావ్, అంతేనని పరువు తీసేశాడు. ఇక సిరిని.. నీ ఆట నువ్వు ఆడని వార్నింగ్ ఇచ్చాడు. మీ ఇద్దరి మూలంగా జెస్సీ సఫర్ అవుతున్నాడని బాంబు పేల్చాడు. తర్వాత నామినేషన్స్ సమయంలో బయటపడ్డ లోబోలోని అపరిచితుడి బిహేవియర్‌ను ప్రస్తావిస్తూ అతడి తప్పులను ఎత్తి చూపాడు. అయితే లోబో మాత్రం నావరకు అంతా బరాబర్ చేశాను అని చెప్పగా.. అరవడం కూడా బరాబరేనా, అట్లాగే అరుస్తావా? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. దీంతో తటపటాయించిన లోబో గొంతైతే చించుకోలేదు సర్ అని ఆన్సరివ్వగా నాగ్ వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో లోబో.. ప్రియ పైపైకి వెళ్లి అరవడం స్పష్టంగా కనిపించింది. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న లోబో.. సారీ అంటూ నేలచూపులు చూశాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాను అని చెప్తున్నావు... ఇది బస్తీకాదు, విల్లా కాదు, బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ అందరూ సమానమే అని తేల్చి చెప్పాడు నాగ్. మొత్తానికి నేటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు వాయింపులు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్: నటరాజ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
బిగ్‌బాస్ షోను జంతుప్రదర్శనశాలగా మార్చేస్తున్నాడు నటరాజ్ మాస్టర్. ప్రతి ఒక్కరినీ ఒక్కో జంతువుతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. తననేమైనా అంటే చెడుగుడు ఆడేసే ఈయన మిగతా కంటెస్టెంట్లను మాత్రం నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. వారిని ఆయా జంతువులతో పోలుస్తూ టార్చర్ పెడుతుంటాడు. మొదట్లో హౌస్‌లో గుంటనక్క ఉందని ప్రచారం చేశాడు నటరాజ్. ఆ గుంటనక్క ఎవరు? అని స్వయంగా హోస్ట్ నాగార్జున అడిగినప్పటికీ ఆయన పెదవి విప్పలేదు. పైపెచ్చు హౌస్‌లో ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండూ ఎవరో చెప్తానన్నాడు. అయితే రానురానూ ఆ రెండింటితో పాటు పిల్లి, నెమలి, ఎలుగుబంటి.. ఇలా ఎన్నో రకాల జంతువులు ఆయన లిస్టులో చేరాయి. అయితే రవిని గుంటనక్క అన్న అతడు.. ఇప్పుడు అదే రవిని నత్తతో పోల్చాడు, అది కూడా లోబో దగ్గర! దీంతో లోబో ఈ విషయాన్ని రవి చెవిలో ఊదాడు. దీంతో మరోసారి ఖంగు తిన్న రవి.. ఆయన తననెందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదని తల పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా నటరాజ్ మాస్టర్ పద్ధతి బాగోలేదని విమర్శిస్తున్నారు. ఒకటీరెండుసార్లు ఏదైనా అంటే లైట్ తీసుకుంటారేమోకానీ పదేపదే జంతువులతో పోల్చడం ఏంటి? అని తిట్టిపోస్తున్నారు. ఈయన హౌస్‌మేట్స్‌కు పూటకో జంతువు పేరు పెడతాడంటూ నటరాజ్‌ను జంతుశాస్త్ర పితామహుడు అని సెటైర్లు వేస్తున్నారు. ఈయనను బిగ్‌బాస్‌లో కాకుండా జంతు ప్రదర్శనశాలలో ఉంచాల్సిందని కామెంట్ చేస్తున్నారు. #nattunuggets what amma, what is this amma?? New insect in bb house 🤦♀️ Votes enduku vesaramma , zoo ki velthe aipoyedi ga #BiggBossTelugu5 — Capri#ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@BbfanCapricorn) October 1, 2021 #Nuggets assemble kotha name vacchindhi 😪 Ravi anniyaaa ki — 𝑺. (@ShravanUniverse) October 1, 2021 అయ్యా #Biggboss గారు దయచేసి #NatrajMaster ని లాస్ట్ వరకు ఉంచండి 🙏 ఎందుకంటే ఆయన ద్వారా మేము మరిన్నీ Animal's పేర్లు ఆ Animal's కి సంబంధించిన వారి పోలికలు మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం 😂 pic.twitter.com/jfYLH2uFN1 — Balu Nadiminti (@Balu_nadiminti) October 1, 2021 Arey bb 5 lo entertainer lobo kadu ra #natrajmaster 😂😂 — nithin_13🇮🇳 (@Nithin_rss) October 1, 2021 Zoo ki kothaga natha vachindhi ippudu 😂 Nattu master mari ekkuva ayindhi idhi next week ayina vellipovali 😴😪 Okati rendu ok Ravi Kuda enni sarulu silent vuntadu Siri Shannu waste raa babu target cheyadam or influence cheyadam idhe pani...😿#BiggBossTelugu5 pic.twitter.com/mbpPbzjP36 — Jahnavi#ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@jahnavi003) October 1, 2021 Welcome to Bigg Boss house nattha garu. Go and meet guntanakka, nemali, oosaravelli, Baloo #BiggBossTelugu5 pic.twitter.com/vBOox1qmRP — RJ KAJAL ARMY (@bigbossstelugu5) October 1, 2021 #Ravi fed up with natraj finally One or two times Ok its will be irritation to anyone calling many times #BiggBossTelugu5 — 𝓢𝓷𝓮𝓪𝓴𝔂 ⛥ (@sneaky__7) October 1, 2021 -
కమిటెడ్ కాకపోతే సిరికి ట్రై చేసేవాడిని: శ్రీరామచంద్ర
బిగ్‌బాస్ షోను రక్తి కట్టించేది కొట్లాటలు, టాస్క్‌లు మాత్రమే కాదు, లవ్ ట్రాకులు కూడా! హౌస్‌లో ప్రేమాయణం నడిపే కంటెస్టెంట్లు షో ముగిశాక మాత్రం అబ్బే, మా మధ్య అలాంటిదేమీ లేదంటారు. కేవలం ఫ్రెండ్షిప్ అని పుకార్లకు చెక్ పెడుతుంటారు. ఇది ప్రతి సీజన్‌కు సర్వసాధారణమైపోయింది. ఈ సారి బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాకులు అనగానే మొదటగా గుర్తొచ్చే జంట శ్రీరామ్- హమీదా. వీళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడమే కాక హమీదాకు మసాజ్‌లు కూడా చేశాడు శ్రీరామ్. తమ మధ్య ఉన్నది రిలేషన్‌కు ఏ పేరు పెట్టాలో అర్థం కాక సతమతమయ్యారిద్దరూ! కానీ ప్రేక్షకులు మాత్రం వీళ్లను క్యూట్ కపుల్‌గా పేర్కొంటున్నారు. అయితే శ్రీరామ్ తాజా ప్రోమోలో చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని ప్రియ ప్రశ్నించగా.. 'సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకు ట్రై చేసేవాడిని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పా'నని మనసులోని మాటను బయటపెట్టాడు శ్రీరామ్. ఒక అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తావని ప్రశ్నించగా అతడు హమీదాను సూటిగా చూడటంతో ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇక సన్నీ తన యాంకరింగ్, ఇమిటేషన్‌తో మిగతా కంటెస్టెంట్లను కడుపుబ్బా నవ్వించాడు. -
నడుము వంక చూసిన లోబో, గగ్గోలు పెట్టిన ప్రియాంక
వరుస టాస్క్‌లతో హీటెక్కిపోయిన హౌస్‌ను చల్లార్చేందుకు హౌస్‌మేట్స్‌కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి ఆడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నల్లచీర కట్టుకుని అందంతో ఉడికిస్తున్న ప్రియాంక సింగ్‌ను చూసి శ్రీరామ్ వాలుకనులదానా.. అని పాట అందుకున్నాడు. తర్వాత ప్రియాంక సింగ్, లోబో కలిసి ఖుషీ స్కిట్ వేశారు. ఏదో ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నట్లుగా తెగ యాక్టింగ్ చేసిన లోబో మధ్యలో ఓరగా పింకీ నడుము వంక చూశాడు. ఆ చూపులను ఇట్టే గుర్తుపట్టిన పింకీ .. నీ చూపు సరిగా లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి. ఇదిలా వుంటే నటరాజ్ మాస్టర్ మరోసారి యాంకర్ రవి మీద పడ్డాడు. టాస్క్ చేస్తున్న సమయంలో అతడిని చూస్తుంటే నత్త గుర్తొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇక పదేపదే తన పేరు తీసి వాగుతున్నాడని రవి అసహనానికి లోనయ్యాడు. తన గురించి ఆయనకెందుకో అని చిరాకు ప్రదర్శించాడు. తర్వాత బిగ్‌బాస్ ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ప్రకటించమని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో శ్వేత.. కాజల్‌ను వరస్ట్ అని పేర్కొంది. మరి మెజారిటీ కంటెస్టెంట్లు ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారన్నది ఆసక్తికరంగా మారింది. -
కత్తితో కసితీరా పొడిచారు! తట్టుకోలేకపోయిన సన్నీ
బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడం ఒకెత్తైతే ఇక్కడ వాళ్లేంటో ప్రూవ్ చేసుకోవడం మరో ఎత్తు. ఇక్కడ వారి ప్రవర్తనను ఒక్కటే పరిశీలనలోకి తీసుకోరు ప్రేక్షకులు. టాస్కుల్లో ఆటతీరు, మిగతా ఇంటిసభ్యులతో వారి ప్రవర్తన.. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఓట్లు వేస్తుంటారు. ఇక ఈ వారం నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, యాంకర్ రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ నామినేషన్లో ఉన్నారు. వీరిలో సన్నీ కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నాడు. శ్వేత, శ్రీరామ్, సన్నీ కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడగా వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ప్రియ, లోబో, నటరాజ్ మాస్టర్, షణ్ముఖ్, సిరి సహా పలువురు సన్నీ కెప్టెన్ కాకూడదని అతడిని కత్తులతో పొడిచారు. త్వరగా ఆవేశపడతావని ప్రియాంక సింగ్ కత్తితో పొడవగా నా ఆవేశం ఇంకా చూడలేదని ఆన్సరిచ్చాడు సన్నీ. ఛాన్స్ రాగానే సన్నీని కత్తులతో కసాకసా పొడిచేద్దామనుకున్నానంది కాజల్. కానీ అప్పటికే ఎన్నో కత్తులు అతడి నడుముకు కట్టిన బెల్టుకు పొడిచి ఉండటంతో తటపటాయించింది. అయితే లోబో తనకు మద్దతివ్వకుండా ఇలా నేరుగా పొడుస్తాడని ఊహించలేదని సన్నీ మానస్ దగ్గర తన బాధను వ్యక్తం చేశాడు. కొందరు ఆడుతున్న సింపథీ గేమ్ ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో ఇంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి తట్టుకోలేకపోయాడు సన్నీ. దీంతో మానస్ అతడిని ఓదార్చుతూ.. టాస్కులో ఓడిపోవడం విషయం పక్కన పెడితే ఎవరేంటో తెలిసే అవకాశం వచ్చింది కదా అని ధైర్యం చెప్పాడు. -
సన్నీకి సపోర్ట్ చేయరు, హమీదాకు చేస్తారు!: శ్రీరామ్
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లను వెంటాడే భయం నామినేషన్స్. దీని నుంచి తప్పించుకోవడానికి బిగ్‌బాస్ ఓ ఆయుధమిచ్చాడు. అదే కెప్టెన్సీ! కెప్టెన్ అయిన వ్యక్తి ఒక వారం పాటు నామినేషన్స్‌లోకి రాలేడు. అందుకే ప్రతి కంటెస్టెంట్ ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని కలలు కంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఈవారం కెప్టెన్సీకి పోటీపడేవారిని ఎంచుకునేందుకు బిగ్‌బాస్ నెగ్గాలంటే తగ్గాల్సిందే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో సన్నీ- మానస్, శ్రీరామ్-హమీదా, శ్వేత- యానీ మాస్టర్ జోడీలు బరువు తగ్గి ముందంజలో ఉన్నాయి. అయితే ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీ కోసం పోటీపడేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆయాజోడీలు ఎవరు వెళ్లాలి? ఎవరు వెళ్లకూడదు అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎలాగో నువ్వు నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈసారి నేనే కెప్టెన్సీ కోసం పోటీ పడతాను అని హమీదాతో చెప్పుకొచ్చాడు శ్రీరామ్. హమీదా, శ్వేత, సన్నీ నిలుచుంటే.. హమీదాకు లేదా శ్వేతకు మాత్రమే సపోర్ట్ చేస్తారు, సన్నీకి చేయరు అని చెప్పాడు. అతడు చెప్పిందే కాస్త అటూఇటుగా నిజమైనట్లు తెలుస్తోంది. కాకపోతే హమీదా స్థానంలో శ్రీరామ్ బరిలో నిలిచినట్లు భోగట్టా! వీరిలో చాలామంది సన్నీకి సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేయగా శ్రీరామచంద్ర కెప్టెన్‌గా అవతరించాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి హమీదా తను కెప్టెన్ అయ్యి శ్రీరామ్‌ను రేషన్ మేనేజర్‌గా పెడతాననుకుంది. కానీ శ్రీరామ్ కెప్టెన్‌గా ఎన్నికై హమీదా రేషన్ మేనేజర్‌గా నియమించాడని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ హౌస్‌లో మటన్ బిర్యానీ, వీళ్లు ముక్క కూడా ముట్టలేదట!
Bigg Boss Telugu 5 Promo: 'తిండి కలిగితే కండ కలదోయ్' అంటారు! కానీ తిండిని కంట్రోల్లో పెట్టి బరువు తగ్గితే గెలుపు మీదేనోయ్ అంటున్నాడు బిగ్‌బాస్. ఓస్ అంతేనా అనేయకండి.. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల నోరూరించేలా టేస్టీ వంటకాలను హౌస్‌లోకి పంపిస్తూనే ఉన్నాడు. నోరు కట్టేసుకోలేక ఎవరో ఒకరు దాన్ని తింటూనే ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ అన్నం, ముద్ద పప్పు పంపించాడు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ విశ్వ ఆ ఫుడ్ అందుకుని ఆరగించాడు. తాజాగా నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ మటన్ బిర్యానీ పంపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిర్యానీని చూడగానే ఎన్నో గంటలుగా తిండీనిద్రా మాని ఉన్న కంటెస్టెంట్లలో నూతనోత్తేజం పొంగిపొర్లింది. ఇంకా కడుపు మాడ్చుకోవడం మా వల్ల కాదంటూ చాలామంది బిర్యానీని ఓ పట్టు పట్టారు. అయితే వీజే సన్నీ, శ్రీరామ్, హమీదా మాత్రం బిర్యానీని కనీసం ముట్టుకోలేదంటున్నారు లీకువీరులు. మరి ఇది నిజమేనా? కళ్ల ముందు బిర్యానీ కనిపిస్తున్నా ఆకలిని చంపుకుని నిలబడ్డారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు విశ్వ, పింకీ ఇద్దరూ కట్టెలు నరకడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. ఇందులో ఎవరు గెలిచారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
దయనీయం: చెత్తబుట్టలో నుంచి ఫుడ్ ఏరుకున్న లోబో
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడిపోమన్న బిగ్‌బాస్ వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్ షేక్, కొబ్బరి బోండాం నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు. దీంతో ఓవైపు ఆకలితో అలమటిస్తూనే మరోవైపు ఎలాగైనా టాస్క్‌లో గెలవాల్సిందేనని కసితో రగిలిపోతున్నారు కంటెస్టెంట్లు. కానీ ఆకలితో నకనకలాడిపోతున్న లోబో తన కడుపు మాడ్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాకయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. కాగా ఈ టాస్క్ ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఫుడ్ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్ తన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ కెప్టెన్ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటు అతని జోడీ కాజల్ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్ షాక్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్‌ను టెంప్ట్ చేసేందుకు బిగ్‌బాస్ ఫుడ్ పంపించగా ప్రియాంక సింగ్ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ ఊరిళ్లు వచ్చేలా ఆ వంటకాన్ని ఆవురావుమని ఆరగించింది. -
ఆమెను నా గర్ల్‌ఫ్రెండ్ చేయండి.. బిగ్‌బాస్‌కు జెస్సీ రిక్వెస్ట్
బిగ్‌బాస్ హౌస్‌లో జెస్సీ అంటే మిగతా కంటెస్టెంట్స్ అందరికి మంచి అభిప్రాయం ఉంది. అందరికి కంటే చిన్నోడు కావడం, అమాకత్వంగా వ్యవహరించడం అతనికి కలిసొస్తుంది.అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, షణ్ముఖ్ చెప్పింది చేయడం జెస్సీకి మైనస్ అనే చెప్పాలి. ఇదే విషయంపై హోస్ట్ నాగార్జున కూడా జెస్సీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అని సలహా కూడా ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..) అయితే కెప్టెన్‌గా జెస్సీ చెప్పే మాటలను కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు జెస్సీ ఇరిటేట్ అవుతున్నాడు కూడా. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలతో పులిహోర కలపడంలో జెస్సీ తక్కువేమి కాదు. చాన్స్ దొరికితే చాలు.. సిరి, హమిదా, శ్వేతలను ఫ్లటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. తన అమాయకమైన మాటలతో వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. తాజాగా శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్ పాత్ర ఇచ్చి ఓ టాస్క్ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్‌బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. మరి ఈ అమాయకపు చక్రవర్తి కోరికను బిగ్‌బాస్ నెరవేర్చాడో లేదో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: పికాక్ ఎగిరిపోయింది, అతనే ఊసరవెళ్లి.. విశ్వని ఇరికించిన నటరాజ్
బిగ్‌బాస్ హౌస్‌లో అందరి ప్రవర్తన ఒక తీరు అయితే నటరాజ్ మాస్టర్ ప్రవర్తన మరోతీరు. నామినేషన్ ప్రక్రియ మొదలైయ్యిందంటే చాలు.. ఊగిపోతాడు. ఎవరైనా తనను నామినేషన్ చేస్తే చాలు తన వెనుక ఎవరో ఉన్నారని, అందుకే తనను నామినేట్ చేశారని ఆరోపిస్తాడు. తొలి వారం నుంచి నటరాజ్ మాస్టర్ ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. హౌస్‌లో అంతా నటిస్తున్నారని, తాను మాత్రమే ఓపెన్‌గా ఉంటున్నానని తనకు తాను కితాబిచ్చుకుంటాడు. అంతేకాదు ఇంట్లో గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఉన్నాయంటూ హౌస్‌మేట్స్‌పై విరుచుకుపడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఎవరో చెప్పడానికి మాత్రం మాస్టర్ వెనకడుగు వేయడం ఇంటి సభ్యులకు మింగుడుపడటం లేదు. (చదవండి: ఏడేళ్లు సహజీవనం చేశా, నా ఆస్తి అడిగాడు: సరయూ) ఇక నిన్నటి నామినేషన్స్‌లో కూడా గుంటనక్క ఇష్యూ తెరపైకి వచ్చింది. గుంటనక్క అని నన్నే అన్నావ్ కదా అని యాంకర్ రవి అడగ్గా.. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ అని నటరాజ్ మాస్టర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈ రోజు కూడా గుంటనక్క ఇష్యూపై ఇంట్లో చర్చ జరిగినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. పికాక్ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్ చేశాడు నటరాజ్ మాస్టర్. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్ అయ్యాడు రవి. దీంతో నటరాజ్ మాస్టర్ రవి దగ్గర గుంటనక్క మ్యాటర్ ఓపెన్ అయ్యాడు. ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి గుంటనక్క అని కరెక్ట్‌గా పేరు పెట్టారని అన్నాడు అంటూ విశ్వని ఇరికించాడు మాస్టర్. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. మరోవైపు నామినేషన్ ప్రక్రియ రవి, కాజల్ మధ్య దూరం పెంచినట్లు తెలుస్తోంది. నన్ను చెంపపై కొట్టావని చెబుతూ రవి నామినేట్ చేయడాన్ని అస్సల్ రిసీవ్ చేసుకోలేకపోయింది కాజల్. నీతో మాట్లాడలని లేదు అని రవి ముఖం మీదే చెప్పింది. -
నామినేషన్స్: లోబోకు ఇచ్చిపడేసిన సిరి, షణ్ముఖ్
Bigg Boss Telugu 5 Promo: Housemates Fire on Nataraj Master: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూనే కనిపిస్తాడు. వాళ్లు గేమ్ సరిగా ఆడట్లేదని, వీళ్లు హౌస్‌కు కరెక్ట్ కాదంటూ తెగ చిరాకు ప్రదర్శిస్తుంటాడు. తను చెప్పింది అందరూ ఆచరించాలని చూస్తాడు, కానీ అక్కడ కనీసం అతడు చెప్పేది కూడా ఎవరూ వినిపించుకోరు. హౌస్‌లో గుంటనక్క, ఊసరవెల్లి ఉన్నారంటాడు, కానీ వాళ్లెవరనేది బయటపెట్టడు. అయితే అతడు ఎప్పుడు? ఎందుకు? ఎవరిని తిడుతున్నారో అర్థం కాని కంటెస్టెంట్లు ఈ సారి నామినేషన్లో మాస్టర్‌ను గట్టిగానే వేసుకున్నట్లు కనిపిస్తోంది. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారంటూ కాజల్ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పమని అభ్యర్థించాడు మానస్. అటు హమీదా కూడా తన పనిని ఎవరైనా ఆపితే నచ్చదంటూ మాస్టర్‌ను నామినేట్ చేసింది. విశ్వ, మాస్టర్‌కు మధ్య కూడా హీట్ డిస్కషన్ నడవగా 'సింహంతో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే' అని మాస్టర్ ఓ డైలాగ్ వదిలాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన విశ్వ.. 'ఎహె, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో' అని చిరాకు ప్రదర్శించాడు. నామినేషన్స్‌లో లోబో మరోసారి తను కింది స్థాయి నుంచి వచ్చానంటూ చెప్పడం ఆరంభించగా షణ్ముఖ్ మధ్యలోనే అడ్డుకున్నాడు. అందరం అక్కడి నుంచే వచ్చామని కౌంటరిచ్చాడు. ప్రతిసారి బస్తీ నుంచి, కింది స్థాయి నుంచి వచ్చానని చెప్పడం తప్పని దుమ్ము దులిపాడు. అటు సిరి కూడా నువ్వు సింపతీ కోసం ట్రై చేస్తున్నావనిపిస్తుందంటూ లోబోను నామినేట్ చేసింది. -
యాంకర్ రవి నిజ స్వరూపం బయటపెట్టిన నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్ వల్ల ఈసారి ఎలిమినేషనే తలకిందులయ్యేలా ఉంది. ప్రియ, యాంకర్ రవి వల్ల లహరి బ్యాడ్ అయింది. యాంకర్ రవి ఆడిన డబుల్ గేమ్ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ సఫర్ అయ్యారు. ఎలాగంటే.. యాంకర్ రవి.. ప్రియతో నామినేషన్స్ కంటే ముందు లహరి గురించి మాట్లాడాడు. 'ఆమె యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంది. కానీ 'సింగిల్ మెన్'(పెళ్లి కాని వాళ్లు)ను వదిలేసి నా వెంటే పడుతోంది. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అని వాపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రియ లహరి మీద ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో రవి, లహరి రాత్రిపూట వాష్‌రూమ్ దగ్గర హగ్ చేసుకోవడాన్ని చూసింది. నామినేషన్స్‌లో ఈ హగ్గు విషయాన్ని ప్రస్తావిస్తూ 'నువ్వు మగాళ్లతోనే బిజీ' అని లహరిని నానా మాటలు అంది. ఈ గొడవ పెద్దది కాగా అందులో యాంకర్ రవి కూడా ఇరుక్కున్నాడు. అయితే తాను సింగిల్ మెన్ అనే మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. నువ్వు అన్నావు కదా అని ప్రియ నిలదీసినప్పటికీ తను మాత్రం అనలేదని బుకాయించాడు. ప్రియ తనను బ్యాడ్ చేయడానికి అలా చేస్తుందని, తనకు ఫ్యామిలీ ఉంది, కూతురు ఉంది అని సెంటిమెంట్ డైలాగులు వల్లించడంతో లహరి రవి తప్పు లేదని నమ్మేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున.. రవిని.. ప్రియతో లహరి గురించి సింగిల్ మెన్ అన్నావా లేదా? అని నిలదీయగా.. వెంటనే 'అన్నాను సర్' అని మరోసారి మాట మార్చాడు. దీంతో షాకైన ప్రియ.. ఇప్పటివరకూ ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్ అని చెప్పింది. తర్వాత ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి నాగ్.. లహరికి ఆమె గురించి రవి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజస్వరూపం బయటపడింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రవికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అంటున్నారు. -
నటరాజ్ మాస్టర్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం గర్భవతి అయిన భార్యను వదిలేసి వచ్చాడు నటరాజ్ మాస్టర్. కానీ బేబీ పుట్టే సమయానికి తను పక్కన ఉండనని లోలోపలే కుమిలిపోతున్నాడు. అలాంటి వ్యక్తికి బిగ్‌బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ విశేషాలు తెలియజేస్తూ ఓ ప్రోమో వదిలాడు. ఈ ప్రోమోలో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టుండి పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో కంటెస్టెంట్లు ఆగమాగం అయ్యారు. ఎవరైనా ఇంట్లోకి వస్తున్నారా? అని ఆతృతగా గేటు వంక చూశారు, కానీ ఎవరూ రాలేదు. నిజానికి ఆ పసిపాప ఏడుపులు త్వరలో నటరాజ్ మాస్టర్ ఇంట వినిపించనున్నాయి. ఈ మధ్యే ఆయన భార్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే భార్యకు సీమంతం జరిగిందన్న విషయం మాస్టర్‌కు తెలియదు. ఆ శుభవార్తను బిగ్‌బాస్ వీడియోతో సహా నటరాజ్ మాస్టర్ కళ్లముందుంచాడు. భార్యను చూడగానే అతడి కళ్లు చెమర్చాయి. ఇలాంటి సమయంలో ఆమె పక్కన లేనని తల్లడిల్లిపోయాడు. ఇక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'రోజూ రాత్రి బేబీతో మాట్లాడేవాడివి కదా, ఇప్పుడు రోజూ బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని బేబీ నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది' అని చెప్పుకొచ్చింది. ఆమె గొంతు వినగానే మాస్టర్ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! ‘బిగ్‌బాస్’ ఫేం నటరాజ్ భార్య సీమంతం ఫొటోలు ఇక్కడ చూడండి -
బిగ్‌బాస్: వరస్ట్ పర్ఫామర్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాభిప్రాయం అన్నది అంత ఈజీ కాదు. అందులోనూ బెస్ట్, వరస్ట్ పర్ఫామర్స్ను ఎంచుకోమన్నప్పుడు కంటెస్టెంట్లు ఎవరికి వారు తామే బెస్ట్ ఇచ్చామని చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమకంటే ఎక్కువగా కష్టపడినట్లు అనిపించినప్పుడు మాత్రమే ఇతరుల పేర్లను చెప్తుంటారు. ఇక వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నప్పుడు కూడా కొందరు వ్యక్తిగత విబేధాలను మనసులో పెట్టుకుని, మరికొందరు ఆటను దృష్టిలో ఉంచుకుని ఆయా పేర్లను సూచిస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎంచుకోమని ఆదేశించాడు. దీంతో మానస్.. తననే వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అలా కుదరదని కెప్టెన్ జెస్సీ చెప్పడంతో మానస్ కెప్టెన్‌నే నామినేట్ చేశాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ ఎవరి మీదో బాగా ఫైర్ అవుతున్నాడు. ఎలా ఆడాలో కూడా తెలీదంటూ చిరాకు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈవారం చెత్త ఆటగాడిగా ఇంటిసభ్యులు మానస్‌ను ఎన్నుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. దీని ప్రకారం జెస్సీ, సన్నీల తర్వాత మానస్ జైలులో బందీ అవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
మళ్లీ తప్పులో కాలేసిన బిగ్‌బాస్, కెప్టెన్‌ను లీక్ చేశాడుగా!
Bigg Boss 5 Telugu: Jessie New Captain: బిగ్‌బాస్‌లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరు కెప్టెన్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న విషయాలను తెలుసుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ లీకువీరులు అన్ని విషయాలను ముందుగానే నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇది చాలదన్నట్లు స్వయంగా బిగ్‌బాసే వీరికి పోటీగా దిగినట్లు కనిపిస్తోంది. ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారన్న విషయాన్ని ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఫస్ట్ లవ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన ప్రోమోలో మోడల్ జశ్వంత్ చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది. దీంతో జెస్సీ ఈ వారం కెప్టెన్ అయ్యాడని స్పష్టమవుతోంది. అయితే అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా లీక్ చేశాడేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎడిటర్ నిద్రపోయినట్లున్నాడు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. ఏదేమైనా జెస్సీ కెప్టెన్‌గా అవతరించి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని మరికొందరు మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by jessie (@jaswanth__jessie__) View this post on Instagram A post shared by chusara_sirrr_eedi_memesu (@chusara_sirrr_eedi_memesu) View this post on Instagram A post shared by BiggBoss 5Telugu (@telugubiggboss_season5) -
నేను ప్రేమించినవాడు చనిపోయాడు: సిరి బ్రేకప్ లవ్ స్టోరీ!
Bigg Boss Telugu 5 Promo: తొలి ప్రేమ ఎప్పుడూ మధురమే! అది సఫలమైనా, విఫలమైనా! తొలి ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనసులో ఏదో తెలీని అనుభూతికి లోనవుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో సింగర్ శ్రీరామచంద్ర తన ఫస్ట్ లవ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు ఇదివరకే పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారన్నాడు. దీప్తి సునయన కంటే ముందే తను ఒకరిని ప్రేమించానని ఓ సీక్రెట్ బయటపెట్టాడు షణ్ముఖ్. ఇక జెస్సీ తను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమె సింగిల్ అయితే, తాను రెడీ టు మింగిల్ అని సిగ్నల్ ఇచ్చేశాడు. తనలో అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయని తెలిసింది తన ఫస్ట్ లవ్ వల్లేనంది శ్వేతవర్మ. ఇప్పుడు నేను మ్యారీడా? సెపరేటా? విడాకులయ్యాయా? అనేది నాకే తెలీదంటూ కుమిలిపోయింది ప్రియ. తను ప్రేమించినవాడు చనిపోయాడంటూ తన విషాద గాథ చెప్తూ కంటతడి పెట్టుకుంది సిరి. ఇక ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్.. తన ఫస్ట్ లవ్ గురించి చెప్తూ.. నేను ప్రేమించిన అబ్బాయి బండి వెళ్లిపోతుంటే ఆ బండి వెనక పరిగెత్తుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. మరి కంటెస్టెంట్ల ఫస్ట్ లవ్ స్టోరీల గురించి తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
Bigg Boss 5 Telugu: మళ్లీ నోరు జారిన షణ్ముఖ్.. కన్నీళ్లు పెట్టుకున్న సిరి
బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఇంట్లో నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక హౌస్‌లో మిగిలిన 17మంది గేమ్‌పై సీరియస్ ఫోకస్ పెట్టారు. ఫ్రెండ్షిప్ని పక్కకు పెట్టి సొంతంగా గేమ్ ఆడుతున్నారు. ఇక బయట మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్, సిరి మాత్రం ఇంట్లో కూడా తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలతో షణ్నూ మాత్రం సిరికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని జెస్సీతో కూడా చెప్పాడు. అనుకున్నట్లే సిరిని షణ్ముఖ్ దూరం పెట్టినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో సిరి, షణ్నూల మధ ఆసక్తికర చర్చ జరిగింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని షణ్ముఖ్‌ని నిలదీసింది సిరి. దానికి వద్దులే అంటు తప్పించుకునే ప్రయత్నం చేశాడు షణ్నూ. అయినప్పటికీ సిరి అతన్ని వదలలేదు. ‘నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్ ఉంది’అని సిరి అంటే.. ‘ఫీల్ అవరా లోన్లీగా.. టూ వీక్స్‌కి అలావాటైపోద్ది’అని సిరి ముఖం మీదే చెప్పేశాడు. అయినా సిరి వదల్లేదు. దీంతో ‘పోరా.. నేను అనవసరంగా నోరు జారుతా’ అని షణ్నూ స్వీట్ వార్నింగ్ ఇస్తే.. తిట్టినా పర్లేదని క్యూట్ చెప్పింది సిరి. . అయినా సరే షణ్ముఖ్ సిరిని దూరం పెట్టాడు. ఒకదశలో ‘నీతో ఫ్రెండ్షిఫ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు’అని షణ్నూ సిరి ఫేస్ మీదే అనేశాడు. దీంతో బాగా హర్ట్ అయిన సిరి.. దూరంగా వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు కెస్టెన్సీ టాస్క్‌లో భాంగా ఇంటి సభ్యులకు స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ పూల్‌లో ఉన్న అక్షరాలను టేబుల్ పై సెట్ చేయమని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్ హౌస్‌లో పెళ్లి, అంతలోనే బ్యాడ్ న్యూస్ అంటూ బాంబ్!
Bigg Boss Telugu 5 Promo: నామినేషన్స్‌తో ఫైర్ మీదున్న కంటెస్టెంట్లను కూల్ చేసేందుకు బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇచ్చిన హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి టాస్క్‌ను అటు హౌస్మేట్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా అబ్బాయి పాత్రలో జీవిస్తున్న శ్రీరామ్ అటు హమీదాతో, ఇటు సిరితో లవ్ ట్రాక్ నడుపుతూనే లహరితో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు లహరి కూడా మానస్‌ను ప్రేమిస్తూనే ఇటు శ్రీరామ్‌తో పెళ్లికి సై అంది. దీంతో మ్యారేజ్ బ్రోకర్ షణ్ముఖ్ సహాయంతో ఎంతగానో కష్టపడి శ్రీరామ్, లహరికి పెళ్లి జరిపించినట్లు ప్రోమోలో చూపించారు. ఇద్దరూ ఉంగరాలతోపాటు దండలు కూడా మార్చుకున్నారు. ఈ పెళ్లికి కంటెస్టెంట్లే పెద్దలు, అతిథులు అన్నీనూ! మొత్తానికి ఈ టాస్క్ అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఫోన్ రింగైంది. వెంటనే హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రియకు.. మీకో బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ అవతలి వ్యక్తి టెన్షన్ పెట్టేశాడు. మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? అది హౌస్ మొత్తానికా? లేదా ప్రియకు మాత్రమే బ్యాడ్ న్యూసా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
Bigg Boss 5 Telugu: మ్యారేజ్ బ్రోకర్‌గా షణ్ముఖ్.. హౌస్‌లో నవ్వులే నవ్వులు
గతవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘పంథం నీదా నాదా’అనే టాస్క్ ఇచ్చి హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం మాత్రం కామెడీ టాస్క్‌తో ముందుకు వచ్చాడు. కెప్టెన్సి కంటెండర్ టాస్క్‌గా ‘హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి’అనే ఫన్నీ గేమ్‌ని ఇచ్చాడు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిగా లహరి, అమెరికాగా అబ్బాయిగా శ్రీరామ చంద్ర సెలెక్ట్ అయ్యారు. ఇక అమ్మాయి మామయ్యగా రవి, అబ్బాయి మాజీ ప్రియురాలిగా హమిదాను సెలెక్ట్ చేశాడు బిగ్‌బాస్. సెలైంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కు మ్యారేజ్ బ్రోకర్ క్యారెక్టర్ ఇచ్చాడు. వీరికి ఇచ్చిన రోల్స్ ను సిరి చదువుతూ ఉంటే హౌస్ లో ఉన్నవారంతా పడిపడి నవ్వారు. (బిగ్‌బాస్: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) తమకు ఇచ్చిన పాత్రల్లో హౌస్మేట్స్ లీనమైపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతంది. మామయ్య పాత్ర అనగానే రవి గెటప్ చేంజ్ చేసుకున్నాడు. పొట్టపెంచుకొని రవి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. మరోవైపు మ్యారెజ్ బ్రోకర్ షణ్ముఖ్‌తో బేరాలాడుతున్నాడు మానస్. తనకు అమ్ము(లహరి)తో పెళ్లి కావాలని, ఎంత డబ్బులైనా తీసుకొని తన పెళ్లి జరిపించాలని కోరాడు.దీనికి లోబో ‘పది కోట్లు కావాలి ఇస్తావా’అంటూ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఇంట్లో ఇంత కామెడీ జరుగుతున్న క్రమంలో రవికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెడర్ పోటీ దారులయ్యే అవకాశాన్ని ఒక సీక్రెట్ టాస్క్ ద్వారా కల్పిస్తున్నట్లు రవికి చెప్పి బయటకు పంపించాడు. మరి రవికి ఇచ్చిన ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి? అందులో రవి గెలిచాడా లేదా? తెలియాలంటే స్టార్ మాలో నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న షణ్ముఖ్!
నిన్న కంటెస్టెంట్లకు ఓ రేంజ్లో క్లాస్ పీకిన నాగ్ ఇవాళ మాత్రం చాలా కూల్‌గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయిస్తూ వారి మీద పంచులు విసురుతూ ఎంతో చలాకీగా కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో.. కాజల్ తన జిహ్వచాపల్యాన్ని వెల్లడిస్తూ మటన్ బిర్యానీ తినాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. కానీ నాగ్ దగ్గర ఆమె పప్పులు ఉడకలేదు, అంతలా తినాలనిపిస్తే వండుకో అని కౌంటరిచ్చాడు. ఇక రవి లేడీ కంటెస్టెంట్లతో వేసిన డ్యాన్సులు చూసిన నాగ్.. పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయినట్టున్నావని సెటైర్ వేశాడు. తర్వాత కంటెస్టెంట్లతో ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు? అనే ఆట ఆడించాడు. అందులో భాగంగా లహరి.. ఉమాదేవిని స్వీట్ రాక్షసి అని పేర్కొనగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావన్నాడు నాగ్. ఇక శ్రీరామ్.. మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడేమోనని అభిప్రాయపడ్డాడు. షణ్ముఖ్ మాత్రం ఇంట్లోవాళ్లను ఎవరినీ సెలక్ట్ చేసుకోకుండా తనకు తానే దెయ్యాన్ని అని ప్రకటించుకున్నాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సిరి, సన్నీల మధ్య జరిగిన గొడవను నాగ్ శనివారం నాటి ఎపిసోడ్లో ప్రస్తావించారు. ఈ క్రమంలో సిరి షర్ట్ లోపల సన్నీ చేయి పెట్టాడని షణ్ను కుండ బద్ధలు కొట్టి చెప్పాడు. కానీ బిగ్‌బాస్ ఆ ఫుటేజీ చూపించగా సన్నీ సిరి షర్ట్ లోపల చేయి పెట్టలేదని, అతడు అమాయకుడని తేలింది. దీంతో అనవసరంగా సన్నీ మీద నింద వేశానన్న అవమాన భారంతోనే షణ్ను తనకు తానే దెయ్యం ట్యాగ్ ఇచ్చుకుని ఉంటాడని అంటున్నారు నెటిజన్లు. మరి ఇదే అసలు కారణమా? లేదా? ఇంకేదైనా అయి ఉండొచ్చా? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్: ఆ వీడియోతో బండారం బయటపెట్టనున్న నాగ్
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ ఇంట్లో హింసకు తావు లేదు అన్న నియమాన్ని తుంగలో తొక్కారు హౌస్మేట్స్. నామినేషన్స్‌లో బూతులు మాట్లాడుతూ, రంగు పూయమంటే ఏకంగా చెంప పగలగొడుతూ, టాస్క్‌లో ఒకరినొకరు తన్నుకుంటూ గుద్దుకుంటూ, కిందా మీదా పడుతూ నానా రభస చేశారు. రెండో వారానికే ఈ రేంజ్ కొట్లాటలేంట్రా బాబూ అని జనాలు ముక్కున వేలేసుకున్నారు. అయితే కంటెస్టెంట్ల తిక్క కుదర్చడానికి వీకెండ్ ఎపిసోడ్‌కు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఆటలు బానే ఆడారు, కానీ బిహేవియర్ బాలేదని తిట్టిపోశాడు. రెండో వారం నామినేషన్స్‌లో హమీదాను కొట్టినంత పని చేసిన శ్వేత ప్రవర్తనను నిలదీశాడు నాగ్. దీంతో ఆమె అందరి ముందే రెండు చేతులతో చెంపలు పగలగొట్టుకుంది. అనంతరం వీజే సన్నీ మీద ప్రశ్నల వర్షం కురిపించాడు నాగ్. సిరి డ్రెస్ లోపలున్న క్లాత్ ఎవరు తీశారు? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ క్వశ్చన్ ఎదురవుతుందని ముందే ఊహించిన సన్నీ.. తానసలు టచ్ చేయలేదని మరోసారి తేల్చి చెప్పాడు. దీంతో ఇదే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు షణ్ముఖ్‌ను అడగ్గా అతడు నిస్సంకోచంగా సన్నీ పేరు చెప్పాడు. దీంతో నాగ్ ఎవరిది అబద్ధం? ఎవరిది నిజం? అనేది అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించనున్నట్లు తెలుస్తోంది. మరి సన్నీ నిజంగానే సిరి షర్ట్ లోపల చేయి పెట్టాడా? లేదా అనవసరంగా సిరి అతడి మీద నిందలు వేసి అభాసుపాలు చేసిందా? అన్నది నేటి ఎపిసోడ్లో తేలిపోనుంది. -
లోబోలాగా రెడీ అయ్యానన్న చెర్రీ, ఎక్స్ప్రెషన్స్ మాత్రం అదుర్స్
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోకి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇచ్చాడు. అతడిని చూసిన ఇంటిసభ్యులు తెగ సర్ప్రైజ్ అయ్యారు. వారికి తెలీకుండానే లేచి నిలబడి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ హీరో లోపలకు వస్తే బాగుండని తెగ ఆశపడ్డారు. వీరి ఎగ్జయిట్మెంట్ చూసిన నాగ్.. వీకెండ్లో తను వచ్చినప్పుడు ఎప్పుడూ ఇలా లేచి నిలబడలేదని గుర్తు చేస్తూ చెర్రీ వచ్చినప్పుడు మాత్రం అందరూ లేచి నిలబడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను అని గుర్రుగా చూశాడు. ఇక చెర్రీ మాట్లాడుతూ.. తాను లోబోలాగా రెడీ అయి వచ్చాననడంతో అతడు సంతోషంతో నేలపై మోకరిల్లి నమస్కరించాడు. షణ్ముఖ్.. దొరికిందే చాన్స్ అని చెర్రీకి ఐ లవ్ యూ చెప్పాడు. ఇంతలో నాగ్ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు షణ్నూ నీకు చెప్పాడు, కానీ రోజూ దీప్తికి చెప్తాడని కౌంటరేశాడు. ఆ తర్వాత హమీదా గురించి మాట్లాడుతూ.. హమీదాను ప్రేమించడానికి శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడని, కానీ ఆమె మాత్రం ఇప్పటివరకు ఎస్ చెప్పలేదని నాగ్ అనడంతో చెర్రీ అవాక్కయ్యాడు. మొత్తానికి ప్రోమోలో చెర్రీ ఎక్స్ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. హౌస్మేట్స్ అందరి బాగోతాలు తెలుసుకున్న నాగ్ వాళ్లను ఎలాగైనా సెట్ చేస్తానని చెప్తున్నాడు. మరి నాగ్ ఎవరిని చెడుగుడు ఆడేయనున్నాడు? ఎవరెవరిని సెట్ చేయనున్నాడు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!