లోబోలాగా రెడీ అయ్యానన్న చెర్రీ, ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రం అదుర్స్‌ | Bigg Boss Telugu 5 Promo: Mega Power Star Ram Charan on BB Telugu Stage | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: హౌస్‌మేట్స్‌ను చెడుగుడు ఆడనున్న నాగ్‌

Sep 18 2021 7:07 PM | Updated on Sep 18 2021 7:46 PM

Bigg Boss Telugu 5 Promo: Mega Power Star Ram Charan on BB Telugu Stage - Sakshi

షణ్ముఖ్‌.. దొరికిందే చాన్స్‌ అని చెర్రీకి ఐ లవ్‌ యూ చెప్పాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు షణ్నూ నీకు చెప్పాడు, కానీ రోజూ దీప్తికి చెప్తాడని కౌంటరేశాడు..

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లోకి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇచ్చాడు. అతడిని చూసిన ఇంటిసభ్యులు తెగ సర్‌ప్రైజ్‌ అయ్యారు. వారికి తెలీకుండానే లేచి నిలబడి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ హీరో లోపలకు వస్తే బాగుండని తెగ ఆశపడ్డారు. వీరి ఎగ్జయిట్‌మెంట్‌ చూసిన నాగ్‌.. వీకెండ్‌లో తను వచ్చినప్పుడు ఎప్పుడూ ఇలా లేచి నిలబడలేదని గుర్తు చేస్తూ చెర్రీ వచ్చినప్పుడు మాత్రం అందరూ లేచి నిలబడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను అని గుర్రుగా చూశాడు.

ఇక చెర్రీ మాట్లాడుతూ.. తాను లోబోలాగా రెడీ అయి వచ్చాననడంతో అతడు సంతోషంతో నేలపై మోకరిల్లి నమస్కరించాడు. షణ్ముఖ్‌.. దొరికిందే చాన్స్‌ అని చెర్రీకి ఐ లవ్‌ యూ చెప్పాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు షణ్నూ నీకు చెప్పాడు, కానీ రోజూ దీప్తికి చెప్తాడని కౌంటరేశాడు. ఆ తర్వాత హమీదా గురించి మాట్లాడుతూ.. హమీదాను ప్రేమించడానికి శ్రీరామ్‌ ప్రయత్నిస్తున్నాడని, కానీ ఆమె మాత్రం ఇప్పటివరకు ఎస్‌ చెప్పలేదని నాగ్‌ అనడంతో చెర్రీ అవాక్కయ్యాడు. మొత్తానికి ప్రోమోలో చెర్రీ ఎక్స్‌ప్రెషన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. హౌస్‌మేట్స్‌ అందరి బాగోతాలు తెలుసుకున్న నాగ్‌ వాళ్లను ఎలాగైనా సెట్‌ చేస్తానని చెప్తున్నాడు. మరి నాగ్‌ ఎవరిని చెడుగుడు ఆడేయనున్నాడు? ఎవరెవరిని సెట్‌ చేయనున్నాడు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement