డేటింగ్‌ యాప్‌లో ఓ అమ్మాయిని కలిశా: సన్నీ | Bigg Boss 5 Telugu Promo: Sunny Met Someone In Dating App | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5 Promo: డేటింగ్‌ యాప్‌ సాయంతో ఓ అమ్మాయిని కలిశా, కానీ ఆమె బాయ్‌ఫ్రెండ్‌..

Dec 18 2021 8:08 PM | Updated on Dec 18 2021 9:40 PM

Bigg Boss 5 Telugu Promo: Sunny Met Someone In Dating App - Sakshi

మీరెప్పుడైనా డేటింగ్‌ యాప్‌లో ఎవర్నైనా కలిశారా? అని అడిగాడు. దీనిపై సన్నీ మాట్లాడుతూ.. 'ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కానీ ఆమె..

Bigg Boss 5 Telugu, Five Time Fun Before The Grand Finale: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కథ రేపటి గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌తో ముగియనుంది. ఈ కథలో ఎవరు హీరో అయ్యారు? కాదు కాదు ప్రేక్షకులు ఎవరిని హీరో చేశారన్న ప్రశ్నకు రేపు సమాధానం దొరకనుంది. దానికన్నా ముందు ఫైనలిస్టులను సరదాగా నవ్వించేందుకు ప్లాన్‌ చేశాడు బిగ్‌బాస్‌. గత సీజన్ల కంటెస్టెంట్లను పంపించి ప్రస్తుతం ఉన్న హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకోమన్నాడు. ఈ క్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చారు. బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారిపోవడంతో అందరూ పగలబడి నవ్వారు.

ఇక అఖిల్‌ సార్థక్‌.. మీరెప్పుడైనా డేటింగ్‌ యాప్‌లో ఎవర్నైనా కలిశారా? అని అడిగాడు. దీనికి సన్నీ ఆన్సరిస్తూ.. 'ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కానీ ఆమె నా ముచ్చట వదిలేసి తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్తూ పోయింది' అని చెప్పడంతో హౌస్‌మేట్స్‌ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. మరి ఈ సరదా ఎపిసోడ్‌ను చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

 

Advertisement
 
Advertisement
Advertisement