Bigg Boss 5 Telugu: సొంతింటికి దొంగలా వెళ్లేదాన్ని.. ఏడ్చేసిన ప్రియాంక సింగ్‌

Bigg Boss Telugu 5 Promo: Priyanka Singh Birthday Celebration in Telugu BB5 - Sakshi

Bigg Boss Telugu 5 Promo: అతడు ఆమెగా మారడం అంత ఈజీ కానే కాదు! ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆమెగా మారినా ఈ సమాజం వారికి అక్కున ఆదరించదు, పైగా సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తుంటుంది. అయినవాళ్లకు దూరమై, ఏమీకాని వాళ్లతో మాటలు పడే ట్రాన్స్‌జెండర్ల వ్యథలు వర్ణణాతీతం. అయితే ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బిగ్‌బాస్‌ వరకు వచ్చింది సాయితేజ అలియాస్‌ ప్రియాంక సింగ్‌.

ఇప్పటివరకు తను అమ్మాయిగా మారానన్న విషయం తండ్రికి తెలియదని బిగ్‌బాస్‌ ప్రారంభమైన తొలినాడే స్టేజీ మీదే చెప్పి గుక్క పెట్టి ఏడ్చింది పింకీ. అలాంటి పింకీకి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్‌. పింకీ అమ్మాయిగా మారడం తమకు సమ్మతమేనని తండ్రి మాట్లాడిన మాటలను వీడియో వేసి చూపించాడు. ఇది కలో, నిజమో అర్థం కాని పింకీ హౌస్‌లో తెగ ఎమోషనల్‌ అయింది.

'నాన్నా సాయితేజ, నువ్వు అబ్బాయైనా, అమ్మాయైనా.. మాకు సర్వం నువ్వే. నువ్వు అమ్మాయిగా మారావని మేము ఆదరించడం ఆపేస్తామని ఎప్పుడూ అనుకోకు' అని ధైర్యం చెప్పాడు. తండ్రి తనను ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించడంతో సంతోషం తట్టుకోలేకపోయింది పింకీ. ఇప్పటికీ సొంతింటికి దొంగలా వెళ్తానని, చాలాసార్లు నేనొచ్చిన విషయం పక్కింటివాళ్లకు కూడా తెలీదని చెప్పుకొచ్చింది. మా నాన్న నాలోని మార్పును యాక్సెప్ట్‌ చేయడం సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక బిగ్‌బాస్‌ పింకీ బర్త్‌డే ను పురస్కరించుకుని చీర, గాజులు, పువ్వులు, స్వీట్లు పంపించాడు. దీంతో అందంగా ముస్తాబైన పింకీ.. మానస్‌ కాళ్ల మీద ఆశీర్వాదం అందుకుంది. మొత్తంగా పింకీ బర్త్‌డే వేడుకలతో నేటి ఎపిసోడ్‌ మరింత ఎమోషనల్‌గా మారేటట్లు కనిపిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top