Bigg Boss Telugu 5: వెనకడుగేసిన జెస్సీ, కెప్టెన్సీ బరిలో ఆరుగురు!

Bigg Boss Telugu 5, Captaincy Task Fight Between Priyanka Singh And Anee Master: కెప్టెన్ అవడానికి హోరాహోరీగా పోరాడుతున్నారు కంటెస్టెంట్లు. అందులో భాగంగా బిగ్‌బాస్ ఇస్తున్న ప్రతీ టాస్క్‌ను చీల్చి చెండాడేస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీకి పోటీపడేందుకు ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో మొదటి ఛాలెంజ్‌లో షణ్ముఖ్, రెండోదాంట్లో సిరి, మూడవ టాస్క్‌లో శ్రీరామచంద్ర గెలుపొందారు. నేడు మిగిలిన రెండు ఛాలెంజ్‌లు పూర్తి చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్. తాజాగా రిలీజైన ప్రోమో మేరకు.. రంగు పడుద్ది అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు ప్రియాంక సింగ్, యానీ మాస్టర్.. ఎవరికివారే తీవ్రంగా శ్రమించారు.
ఇక ఐదో ఛాలెంజ్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై చర్చోపచర్చలు సాగించినట్లు తెలుస్తోంది. ఆల్‌రెడీ కెప్టెన్ అయినంత మాత్రాన మళ్లీ కెప్టెన్సీకి ప్రయత్నించకూడదా? అని ఫైర్ అవుతున్నాడు జెస్సీ. అప్పుడెప్పుడో మూడోవారం కెప్టెన్ అయ్యానని, నేనెందుకు ఈ అవకాశాన్ని వదిలేసుకోవాలని ప్రశ్నించాడు. కానీ అతడితో ఎవరూ ఏకీభవించినట్లు కనిపించడం లేదు. దీంతో జెస్సీ తాను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనివల్ల తనకు వరస్ట్ పర్ఫామర్ ఇచ్చినా నాకనవసరం అని అసహనం వ్యక్తం చేశాడు. మొత్తంగా ఈవారం కెప్టెన్సీ కోసం యానీ, శ్రీరామ్, షణ్ను, మానస్, సిరి, సన్నీ పోటీపడుతున్నట్లు సమాచారం.