
బాగా హర్టయిన షణ్ను ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. నా దగ్గరకు రాకు సిరి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో...
Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth Feels Alone: గొడవపడటం, తిరిగి కలిసిపోవడం కామన్.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో కూడా కంటెస్టెంట్లు టాప్ లేచిపోయేలా అరుచుకుంటారు, ఆ తర్వాత తిరిగి కలిసిపోతారు. కానీ ఆ గొడవలను మాత్రం చాలామటుకు మనుసులోనే పెట్టుకుని నామినేషన్స్ సమయంలో దాన్ని బయటకు తీస్తుంటారు. ఇది బిగ్‌బాస్ హౌస్‌లో సర్వసాధారణమైపోయింది. తాజాగా సిరి, షణ్ముఖ్ వాదులాడుకుంటున్నట్లు ప్రోమో వదిలారు.
ఏ విషయానికో బాగా హర్టయిన షణ్ను ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. అతడిని అలా చూడలేకపోయిన సిరి షణ్నును ఓదార్చాలనుకుంది. కానీ అతడు మాత్రం 'నేను ఏడ్వటం వల్ల నువ్వేం తక్కువైపోవు, నేనే తక్కువవుతాను, నువ్వు పైకి వెళ్తావు. నా దగ్గరకు రాకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో' అని చెప్పాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని, నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ఏడ్చుకుంటూ బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. షణ్ను బతిమాలినా సిరి గడియ తీయలేదు.
కంగారుపడ్డ హౌస్‌మేట్స్ పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని బతిమాలడంతో చివరలో డోర్ తెరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సిరి, షణ్నుకు మధ్య ఏం జరిగింది? ఈ గొడవకు ఎవరు కారణం? షణ్ను ఎందుకు ఒంటరిగా ఫీలవుతున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!