త‌న్న‌డం క‌రెక్టా?: స‌న్నీ ఫొటో చించి ప‌డేసిన నాగ్‌ | Bigg Boss 5 Telugu Promo: Nagarjuna Warns Housemates Their Mistakes | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: స‌న్నీ, యానీకి ఇచ్చిపడేసిన నాగ్‌.. ఫొటోలు చింపుతూ..

Oct 30 2021 5:32 PM | Updated on Oct 30 2021 6:00 PM

Bigg Boss 5 Telugu Promo: Nagarjuna Warns Housemates Their Mistakes - Sakshi

తొండిగా ఆడ‌టమేంట‌ని కాజ‌ల్ మీద సెటైర్ వేశాడు నాగ్‌. హౌస్‌లో ఏమైనా అన్యాయం జ‌రుగుతోందా? అని నాగ్ అడ‌గ్గా సంచాల‌కుడి నిర్ణ‌యం న‌చ్చ‌లేదని చెప్పాడు మాన‌స్‌. దీంతో నాగ్‌.. సంచాల‌కుడి నిర్ణ‌యమే ఫైన‌ల్ అని తేల్చేశాడు

Bigg Boss 5 Telugu Promo: కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద లొల్లే జ‌రిగింది. టాస్క్ ముగిసి ష‌ణ్ముఖ్ కెప్టెన్ అయినా కూడా స‌న్నీ, మాన‌స్ దాన్నే త‌లుచుకుంటూ ఓప‌క్క బాధ‌ప‌డుతూ, మ‌రోప‌క్క హౌస్‌మేట్స్ మీద నిప్పులు చెరిగారు. ముఖ్యంఆ ఆ టాస్క్‌లో సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన జెస్సీని ఆడేసుకున్నారు. అత‌డు కూడా వీళ్లిద్ద‌రికీ గ‌ట్టిగానే స‌మాధాన‌మిచ్చాడు. తాజాగా ఈ గొడ‌వ‌ను ప్ర‌స్తావిస్తూ స‌న్నీని ఆడేసుకున్నా హోస్ట్ నాగ్‌.

తొండిగా ఆడ‌టమేంట‌ని కాజ‌ల్ మీద సెటైర్ వేశాడు నాగ్‌. హౌస్‌లో ఏమైనా అన్యాయం జ‌రుగుతోందా? అని నాగ్ అడ‌గ్గా సంచాల‌కుడి నిర్ణ‌యం న‌చ్చ‌లేదని చెప్పాడు మాన‌స్‌. దీంతో నాగ్‌.. సంచాల‌కుడి నిర్ణ‌యమే ఫైన‌ల్ అని తేల్చేశాడు. ఇక స‌న్నీ.. త‌న‌ను చాలామంది ప్రొవోక్ చేశార‌ని చెప్పగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన నాగ్‌.. మీద మీద‌కు వెళ్లిపోతావా? అని నిల‌దీశాడు. ఒక మ‌నిషి ఒక వ‌స్తువు ప‌ట్టుకుంటే దాన్ని త‌న్న‌డం క‌రెక్ట్ అనుకుంటున్నావా? అని ప్ర‌శ్నించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రూల్స్ ఉన్నాయి కాబ‌ట్టే వాళ్లు తిరిగి కొట్ట‌లేద‌ని చెప్తూ అత‌డి ఫొటోను చింపి ప‌డేశాడు నాగ్‌.

త‌ర్వాత నాగ్‌.. కంటెస్టెంట్ల‌తో వైకుంఠ‌పాళి ఆడించాడు. ర‌వి త‌న మైండ్ చ‌దివేస్తాడేమోన‌ని భ‌యంగా ఉంద‌న్నాడు ష‌ణ్ను. ఏంటి? ర‌వి బ్ర‌హ్మ మైండ్‌నే చ‌దివేస్తున్నాడా! అని ఆశ్చ‌ర్య‌పోయాడు నాగ్‌. ఒక‌ప‌క్క పంచాయితీలు, మ‌రోప‌క్క టాస్క్‌ల‌ వినోదాలు.. అన్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement