Bigg Boss 5 Telugu: VJ Sunny Superb Memories At BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: అప్నా టైం ఆయేగా.. సన్నీపై బిగ్‌బాస్‌ ప్రశంసల వర్షం

Dec 14 2021 6:57 PM | Updated on Dec 14 2021 8:58 PM

Bigg Boss 5 Telugu: VJ Sunny Superb Memories At BB House - Sakshi

సన్నీ..  బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ఏకైక ఎంటర్‌టైనర్. హౌస్‌లో ఎంత కోపం ప్రదర్శించాడో అంతే ప్రేమను పంచాడు. అందరిని నవ్విస్తూ బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. నామినేషన్స్‌ని నవ్వుతూ స్వీకరించి.. ప్రేక్షకుల మనసు గెలుచుకొని టాప్‌ 5కి చేరాడు. సన్నీ ఆట, మాట ప్రేక్షకులను బాగా నచ్చింది.. అందుకే చాలా వారాలు నామినేట్‌ అవుతూ వచ్చినప్పటికీ.. ప్రతిసారి అతన్ని సేవ్‌ చేస్తూనే వచ్చారు. ఈ ఆదివారం (డిసెంబర్‌ 19)తో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి శుభం కార్డు పడనుంది. దీంతో హౌస్‌లో ఉన్న టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ శ్రీరామ్‌, మానస్‌, సిరి, షణ్ముఖ్‌, సన్నీలకు తమ తమ జర్నీలను చూపిస్తున్నాడు బిగ్‌బాస్‌.

ఇప్పటికే శ్రీరామ్‌, మానస్‌ల బ్యూటిఫుల్‌ జర్నీ చూపించిన బిగ్‌బాస్‌.. తాజాగా సన్నీ బిగ్‌బాస్‌ ప్రయాణాన్ని చూపించి, ఆనందపరిచాడు. హౌస్ లో సన్నీ మెమొరీస్ కి సంబంధించిన ఫొటోలన్నీ వేర్వేరు ప్లేసెస్ లో పెట్టి, సన్నీని ఆహ్వానించాడు. తన ఫోటోలను చూసి సన్నీ నవ్వుకున్నాడు. అక్కడ ఓ కోతి బొమ్మ  ఉండే.. ‘ఓ కాజల్‌ ఎట్లున్నావ్‌.. బాగున్నావా’అంటూ తనదైన శైలీలో కామెడీ చేసి నవ్వులు పూయించాడు. ఇక పక్కనే ఉన్న కేక్‌ ముక్క ఉంటే.. దాన్నీ తీసుకొని వాసన చూసి..  'వెయిట్ ఫర్ ది క్లైమాక్స్' అంటూ వేరో చోటుకి వెళ్లిపోయాడు. 

ఆ తరువాత బిగ్ బాస్ సన్నీను ప్రశంసిస్తూ.. 'సరదా.. సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలవుతాయని మీరు గుర్తుచేశారు. గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చి ఎంటర్‌టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చే మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా.. పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన ప్రయాణమే మళ్లీ రుజువు చేస్తోంది. అప్నా టైం ఆయేగా.. సన్నీ.. మీ సమయమొచ్చేసింది' అంటూ సన్నీని ఓ రేంజ్‌లో పొగిడేశాడు బిగ్‌బాస్‌. మరి హౌస్‌లో సన్నీ ఇంకెంత కామెడీ చేశారో నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement