బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా?: నాగ్‌ సూటి ప్రశ్న | Bigg Boss Telugu 5: Kondapolam Team Chit Chat With Housemates | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: జెస్సీని కొట్టలేదన్న శ్రీరామ్‌, వీడియో చూపించిన నాగ్‌!

Oct 9 2021 4:53 PM | Updated on Oct 9 2021 5:07 PM

Bigg Boss Telugu 5: Kondapolam Team Chit Chat With Housemates - Sakshi

'నీకు బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా?' అని ప్రశ్నించగా.. అతడు బిగ్‌బాస్‌ టైటిల్‌ అని ఆన్సరిచ్చాడు. ఇది విన్న క్రిష్‌.. నేనైతే హమీద గారు ముఖ్యం అనేవాడిని అని బదులివ్వడంతో..

Bigg Boss Telugu 5 Promo: చూస్తుండగానే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఐదో వారం కూడా ముగింపుకు వచ్చేసింది. ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క బుల్లితెర ప్రేక్షకులకు డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ను పలకరించింది. యంగ్‌ హీరో వైష్ణవ్‌తేజ్‌, దర్శకుడు క్రిష్‌ బిగ్‌బాస్‌ స్టేజీమీదకు వచ్చి కంటెస్టెంట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ.. కొండపొలం చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించాడు.

ఇక నాగ్‌.. 'నీకు బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా?' అని ప్రశ్నించగా.. అతడు బిగ్‌బాస్‌ టైటిల్‌ అని ఆన్సరిచ్చాడు. ఇది విన్న క్రిష్‌.. నేనైతే హమీద గారు ముఖ్యం అనేవాడిని అని బదులివ్వడంతో అందరూ చిరునవ్వులు చిందించారు. ఇక ఎప్పటిలాగే వారంలో జరిగిన గొడవలను ప్రస్తావనకు తెచ్చి పంచాయతీ మొదలుపెట్టాడు నాగ్‌. కిచెన్‌లో జెస్సీ, శ్రీరామ్‌ మధ్య జరిగిన ఫైటింగ్‌ గురించి సైతం చర్చించాడు. అంత రఫ్‌గా ఎలా ఆడావని శ్రీరామ్‌ను నిలదీయగా అతడు తాను కొట్టలేదని దీర్ఘం తీయడంతో వీడియో ప్లే చేయించాడు నాగ్‌. మరి కిచెన్‌లో జరిగిన లొల్లిలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement