Bigg Boss Telugu 5 Promo: VJ Sunny Reveals 3rd Finalist Name of BB 5 House - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ఫినాలేలో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే!

Dec 12 2021 4:43 PM | Updated on Dec 12 2021 5:18 PM

Bigg Boss Telugu 5 Promo: VJ Sunny Reveals 3rd Finalist Name of BB 5 House - Sakshi

నేటి ఎపిసోడ్‌లో సన్నీ చేతుల మీదుగా సిరి, సిరి చేతుల మీదుగా షణ్ముఖ్‌ ఫైనల్‌లో అడుగుపెట్టనున్నట్లు ప్రకటించనున్నారట.

Bigg Boss Telugu 5 Promo: పంతొమ్మిది మందితో మొదలైన బిగ్‌బాస్‌ ప్రయాణంలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో నేడు ఒకరు హౌస్‌ను వీడనున్నారు. అయితే ఎలిమినేట్‌ అయింది కాజల్‌ అంటూ లీకువీరులు ఒకరోజు ముందే ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో లీక్‌ చేసేశారు. కాజల్‌ ఎలిమినేషన్‌ను నాగార్జున అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలింది.

కాజల్‌ నిష్క్రమణ అనంతరం హౌస్‌లో ఉన్న మానస్‌, సిరి, షణ్ను, శ్రీరామ్‌, సన్నీ ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. టికెట్‌ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్‌ మొదటి ఫైనలిస్టుగా నిలవగా నిన్నటి ఎపిసోడ్‌లో సన్నీ ఫైనల్‌లో అడుగుపెట్టినట్లు వెల్లడించారు. నేటి ఎపిసోడ్‌లో సన్నీ చేతుల మీదుగా సిరి, సిరి చేతుల మీదుగా షణ్ముఖ్‌లను ఫైనలిస్టులుగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత నాగార్జున మానస్‌ సేవ్‌ అయి ఫైనల్‌కు వెళ్తున్నట్లు వెల్లడించనున్నారట. అయితే వీటన్నింటికన్నాముందు ఇది లాస్ట్‌ సండే అంటూ నాగ్‌.. వారితో సరదా టాస్కులు ఆడించినట్లు కనిపిస్తోంది. మరి ఈ ఫన్‌ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement