టార్గెట్ ప్రియాంక‌.. ష‌ణ్నుతో అవ‌స‌రం లేద‌న్న సిరి | Bigg Boss 5 Telugu Promo: Super Villains Target Priyanka Singh | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ప్రియాంక గెలిచింది, కానీ చివ‌రికి ఓడిపోయింది!

Nov 4 2021 6:14 PM | Updated on Nov 4 2021 7:19 PM

Bigg Boss 5 Telugu Promo: Super Villains Target Priyanka Singh - Sakshi

బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజ‌న్ ప్రారంభ‌మై అప్పుడే 50 రోజులు పూర్తైపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లువురు కంటెస్టెంట్లు కెప్టెన్‌గా ఎన్నిక‌వ‌గా కొంత‌మంది కెప్టెన్సీ పోటీదారుల వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయారు. అలాంటివారు ఈసారి ఎలాగైనా కెప్టెన్ అయి తీరాల‌ని గ‌ట్టి క‌సి మీదున్నారు. ఈ క్ర‌మంలో ర‌వి టాస్క్‌లో సూప‌ర్ హీరోస్ ఇచ్చిన అరాచ‌క‌మైన టాస్కుల‌ను కూడా అతి సునాయాసంగా పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇక శ్రీరామ్ కూడా త‌న శ‌క్తి మేర ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయ్యాడు. తాజా ప్రోమో చూస్తుంటే ఈసారి ప్రియాంక వంతు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

సూప‌ర్ విల‌న్స్ టీమ్ పింకీను టార్గెట్ చేసింది. పేడ‌స్నానం, రంగు మీద పోసుకోవ‌డం వంటివే కాకుండా త‌న‌కు ఇష్టం లేని జ్యూస్‌లు తాగ‌మ‌ని ఇచ్చాడు ర‌వి. దీంతో పింకీ ఏడుపు ముఖం పెట్టింది. కానీ ఆమె మాట‌లు వింటుంటే దాన్ని తాగ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. నేను నా కోసం ఆడుతున్నాను అన్న పింకీ మాట విన్న ర‌వి.. దీని కోసం క‌దా, మీ అన్న‌య్య‌లంతా ఎదురుచూస్తోంది అన్నాడు. ఇది విన్న మాన‌స్‌.. క‌వ‌ర్ డ్రైవ్ అని గాలి తీసేశాడు.

మ‌రోప‌క్క ఈ సూప‌ర్ హీరోస్ వ‌ర్సెస్ సూప‌ర్ విల‌న్స్ టాస్క్ సిరి, ష‌ణ్నుల మ‌ధ్య అగాధాన్ని సృష్టించేలా క‌నిపిస్తోంది. నాతో నీకేదైనా ప్రాబ్లమా ష‌ణ్ను? అని సిరి అడ‌గ్గా అత‌డు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడ‌తాను అని చెప్పాడు. దీనికి సిరి అప్పుడు నువ్వు మాట్లాడినా నాక‌వ‌స‌రం లేదు అని తేల్చేసింది. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో విల‌న్స్ టీమ్ గెలిచిన‌ట్లు స‌మాచారం! అంటే హీరోస్ టీమ్‌లో పింకీ, శ్రీరామ్ గెలిచినప్ప‌టికీ వాళ్ల టీమ్ ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement