Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల పనికి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని నాగ్ భావోద్వేగం

వీకెండ్ ఎపిసోడ్ అంటే చాలు కంటెస్టెంట్లు ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్ అన్నట్లుగా గమ్మునుండిపోతారు. వారమంతా ఎన్నో తప్పులు చేసినా కింగ్ నాగార్జున ముందు మాత్రం అమాయకంగా ఫేస్ పెడుతుంటారు. కానీ నాగ్ వారి పప్పులు ఉడకనిస్తాడా? తప్పులు చేసి తప్పించుకు తిరిగేవారిని నిలబెట్టించి మరీ చెడుగుడు ఆడేసుకుంటాడు. అలా గాడి తప్పుతున్న హౌస్‌ను ఓ దారిలో పెడుతుంటాడు. ఓ పక్క హౌస్‌ను సెట్ చేస్తూనే, మరో పక్క ఇంటిసభ్యులతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఈ వారం బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో దాక్కో దాక్కో మేక టాస్క్ ఆడించాడు.
మరో ప్రోమోలో ఇంటిసభ్యులు.. నిన్నే పెళ్లాడతా సినిమా వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆ మూవీలోని సాంగ్స్‌కు స్పెషల్ డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన నాగ్.. సంతోషంతో తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. ప్రోమోలో ఈ రేంజ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ మరి పూర్తి ఎపిసోడ్‌లో ఎంతమేరకు ఉంటుందో చూడాలి!