Bigg Boss Telugu 5: సిరి.. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం: రాజ్ తరుణ్

బిగ్‌బాస్ షోలో అనుభవించు రాజా టీమ్ సందడి
Bigg Boss Telugu 5, Anubhavinchu Raja Team Visits Bigg Boss House: బిగ్‌బాస్ షోలో అనుభవించు రాజా చిత్రయూనిట్ సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేశారు. రాజ్ తరుణ్‌ను చూడగానే సిరి ఎగిరి గంతేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని రాజ్ తరుణ్ చెప్పడంతో సిరి తెగ సిగ్గుపడిపోగా వెంటనే.. నీక్కాదులే అంటూ కౌంటరిచ్చాడు.
తర్వాత ఇంటిసభ్యులకు డ్రాయింగ్ గేమ్‌తో కంటెస్టెంట్లను గుర్తించమని టాస్క్ ఆడించారు. ఇందులో ప్రియాంక పిచ్చిగీతలు ఒక్క మానస్‌కు మాత్రమే అర్థమయ్యాయి. ఆమె గీసిన గీతలను బట్టి అది శ్రీరామ్ అని మానస్ ఆన్సరివ్వడంతో అందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. నామినేషన్స్ నుంచి అందరూ సేవ్ అవగా చివర్లో ప్రియాంక, యానీ ఇద్దరు మాత్రమే మిగిలినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఇద్దరిలో యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి అదెంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.