బిగ్‌బాస్‌: బుట్టబొమ్మను పడగొట్టమని అఖిల్‌ చాలెంజ్‌ | Bigg Boss 5 Telugu: Housemates Try To Impress Pooja Hegde | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: పూజాహెగ్డేను పడగొట్టేది ఎవరు?

Oct 10 2021 4:36 PM | Updated on Oct 10 2021 4:43 PM

Bigg Boss 5 Telugu: Housemates Try To Impress Pooja Hegde - Sakshi

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హీరో అఖిల్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేతో రొమాంటిక్‌ సాంగ్‌కు చిందులేశాడు. ఇది చూసిన నాగ్‌.. ఏరా? ఇది నీ ఇల్లనుకున్నావా? అని ఫైర్‌...

ప్రేక్షకులకు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అయింది బిగ్‌బాస్‌. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలువురు సినీసెలబ్రిటీలు బిగ్‌బాస్‌ స్టేజీ మీదకు విచ్చేశారు. ఈ క్రమంలో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' హీరో అఖిల్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేతో రొమాంటిక్‌ సాంగ్‌కు చిందులేశాడు. ఇది చూసిన నాగ్‌.. ఏరా? ఇది నీ ఇల్లనుకున్నావా? అని ఫైర్‌ అయ్యాడు. దీంతో అఖిల్‌.. ఈ స్టేజీ మీదేనని ఎవరో అన్నారని చెప్పాడు. దీనికి నాగ్‌.. ఇది కేవలం నాది మాత్రమేనంటూ కౌంటరిచ్చాడు.

అనంతరం అఖిల్‌... హౌస్‌లో ఉన్న బ్యాచిలర్లు పూజాను పడగొట్టేందుకు ప్రయత్నించమని సవాలు విసిరాడు. మొదట శ్రీరామ్‌.. సామజవరగమన... పాటందుకుని ఆమెను బుట్టలో వేసేందుకు ప్రయత్నించాడు. మరి మిగతావాళ్లు బుట్టబొమ్మను ఎలా ఇంప్రెస్‌ చేశారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. 'నీళ్లు లేని సముద్రం ఎక్కడుంటుంది?' అని నాగ్‌ ప్రశ్న విసరగా.. నా ఇంటెలిజెన్స్‌ వాడతాను అని సన్నీ ముందుకొచ్చాడు. అయినా లేనిది ఎలా వాడతావు? అంటూ పరువు తీశాడు నాగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement