
బిగ్‌బాస్ ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ 'రాజ్యానికి ఒక్కడే రాజు' గేమ్‌లో ఇద్దరు యువరాజులు రవి, సన్నీ పోటీపడ్డ విషయం మనందరికీ తెలిసిందే! ఇతర హౌస్‌మేట్స్ వేసిన ఎత్తులు, పై ఎత్తులతో వీరి రాజ్యాలు కిందామీదా పడి లేవగా.. చివరికి యువరాజు రవి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే తాజా ప్రోమోలో మరోసారి రాజును ఎన్నుకోమని ఆదేశించినట్లున్నాడు నాగ్. దీంతో కంటెస్టెంట్లు కొందరు తమకు బెస్ట్ అనిపించినవారికి కిరీటం అందిస్తున్నారు. ముందుగా కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్‌కు కిరీటాన్ని అలంకరించింది.
తర్వాత షణ్ముఖ్.. ఈ వారం నాకు హమీదా కనిపించలేదంటూ ఆమెకు బానిస టోపీ పెట్టాడు. హౌస్ అంతా తన గురించి మాట్లాడేలాగా చేస్తున్న కాజల్ మహారాణి అన్నాడు శ్రీరామ్. ఇక హమీదా బానిసైపోతుందని అభిప్రాయపడ్డాడు మానస్. తర్వాత షణ్ను వంతురాగా తనకు తానే కింగ్ అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని కౌంటరిచ్చాడు. అయితే వాళ్లందరూ అందరిముందు ఓపెన్‌గా చేయలేదని రివర్స్ పంచ్ ఇచ్చాడు షణ్ను. మరి మెజారిటీ ఇంటిసభ్యులు ఎవరిని బానిసగా భావించారు? ఎవరిని రాజుగా ఎన్నుకున్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.