Bigg Boss Telugu 5: కుస్తీపోటీకి రంగంలోకి దిగిన యానీ మాస్టర్‌

Bigg Boss 5 Telugu: Fight Between Jessie And Anne For Captaincy Task - Sakshi

బిగ్‌బాస్‌ షోలో ఆడామగా అనే తేడా ఉండకూడదని నాగార్జున చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అదే రూల్‌ను పాటిస్తున్నారు హౌస్‌మేట్స్‌. కుస్తీపోటీకి ఇద్దరు మగవాళ్లు కాకుండా, ఒక లేడీ కంటెస్టెంట్‌, ఒక మేల్‌ కంటెస్టెంట్‌ పోటీపడ్డారు. సన్నీ రాజ్యంలో నుంచి జెస్సీ, యాంకర్‌ రవి రాజ్యంలో నుంచి యానీ మాస్టర్‌ ముఖాముఖిగా తలపడనున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. మరీ వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది. 

అయితే అబ్బాయిలు, అమ్మాయిలకు మధ్య ఇలాంటి టాస్క్‌ పెట్టినప్పుడు బాయ్స్‌కే ఎక్కువ మైనస్‌ అంటున్నారు నెటిజన్లు. ఆడవాళ్లతో కలిసి వారు కంఫర్టబుల్‌గా గేమ్‌ ఆడలేరని, పూర్తి శక్తిని వినియోగించలేరని చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఎదురుగా ఉంది ఆడ, మగ అని కాకుండా కేవలం పోటీదారులుగా మాత్రమే చూడాలని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా జెస్సీ, యానీ మాస్టర్‌ల మధ్య ఫైటు మంచి రసపట్టుగా మారనున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top