వాళ్లెవరూ కాదు, ఆ కంటెస్టెంటే సుందరి: శ్రీరామ్‌ | Bigg Boss Telugu 5: Nagarjuna Fun With Housemates | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: మార్పు మొదలైంది, అంతా మంచికే!

Nov 7 2021 4:29 PM | Updated on Nov 7 2021 5:15 PM

Bigg Boss Telugu 5: Nagarjuna Fun With Housemates - Sakshi

హౌస్‌లో నలుగురు అమ్మాయిలు ఉన్నప్పటికీ శ్రీరామ్‌ మాత్రం వాళ్లందరినీ కాదని సన్నీ పేరు చెప్తాడు. దీంతో నవ్వాపుకోలేకపోయిన నాగ్‌ చివరికి సన్నీని సుందరిని చేశారని కామెంట్‌ చేస్తాడు.

Bigg Boss 5 Telugu Promo: నాగార్జున క్లాస్‌ పీకిన తర్వాత హౌస్‌లో చాలా మార్పులు వచ్చాయి. సన్నీ తన కోపాన్ని వదిలేసి చాలా కూల్‌ అయిపోయాడు. దీంతో అతడితో ఎప్పుడూ గొడవ పడే శ్రీరామ్‌, షణ్ముఖ్‌ కూడా సన్నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇందుకు తాజా ప్రోమోనే నిదర్శనం. ఒక పాట ప్లే చేసిన నాగ్‌.. దీనికి సరిపోయే సుందరి ఎవరని ప్రశ్నించాడు. హౌస్‌లో నలుగురు అమ్మాయిలు ఉన్నప్పటికీ శ్రీరామ్‌ మాత్రం వాళ్లందరినీ కాదని సన్నీ పేరు చెప్పాడు.

దీంతో నవ్వాపుకోలేకపోయిన నాగ్‌ చివరికి సన్నీని సుందరిని చేశారని కామెంట్‌ చేస్తాడు. నేనెవర్ని గేమ్‌లో ఇంటిసభ్యులు ఒకరినొకరిని ఇమిటేట్‌ చేయడంతో పాటు డ్యాన్సులు చేశారు. ఈ క్రమంలో షణ్ను, సన్నీ కలిసి స్టెప్పులేశారు. ఇది చూసిన నెటిజన్లు మార్పు మంచిదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సన్నీ, మానస్‌ స్నేహాన్ని మిస్‌ అవుతున్నామంటున్నారు మరికొందరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement