Bigg Boss 5 Telugu Promo: Priya Warns Sunny in Bangaru Kodipetta Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: అలా చేస్తే చెంప పగిలిపోద్ది.. సన్నీకి ప్రియ వార్నింగ్‌

Oct 20 2021 4:55 PM | Updated on Oct 20 2021 5:33 PM

Bigg Boss 5 Telugu Latest Promo: Priya Fires On VJ Sunny - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అంతా కలిసి ఉండడం ఇష్టపడని బిగ్‌బాస్‌.. కొత్త కొత్త టాస్కులు ఇచ్చి హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు పెట్టిస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన ‘బంగారు కోడిపెట్ట’అనే కెప్టెన్సీ టాస్క్‌ హౌస్‌మేట్స్‌ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ముఖ్యంగా.సన్నీ- ప్రియా మధ్య మాటల యుద్దమే జరిగింది. అయితే నేడు ఆది కాస్త హద్దు దాటి ఫిజికల్‌ అటాక్‌కు దారి తీసినట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమోలో ప్రియ.. మళ్లీ సన్నీ గుడ్లను దొంగిలిస్తూ కనిపించింది.  ఈ క్రమంలో సన్నీ ఆమెను పక్కకు తోసేశాడు.
(చదవండి: మొన్న కూతురు, ఇప్పుడు తల్లి బిగ్‌బాస్‌ను వీడక తప్పదా!)

దీంతో అతనిపై పూల కుండీ ఎత్తేసి.. ఫిజికల్ ఎటాక్ చేస్తే మరద్యాదగా ఉండదు..  చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. మిగిలిన  ఇంటి సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి గొడవ తగ్గలేదు. ప్రియ మరింత రెచ్చిపోయి బుట్టను చించేసింది.  ఈక్రమంలో సన్నీ ఏయ్ అన్నడంతో.. ప్రియా ఏయ్ ఏంటి అంటూ ఫైర్ అయ్యింది. చేతకాని మొహాలు వస్తారు ఇక్కడికి.. అంటూ సన్నీ అనడంతో.. చెంప పగిలిపోద్ది అని ప్రియా అంది. దాంతో కోపంతో రగిలిపోయిన సన్నీ దమ్ముంటే కొట్టి చూడు అంటూ ప్రియా మీదకు వెళ్ళాడు. మొత్తమీద ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ మంచి రసవత్తరంగా ఉండనుందని అర్ధమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement