Bigg Boss 5 Telugu: ఆమె బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పక తప్పదా!

Bigg Boss Telugu 5: Who Is Danger Zone In 7th Week Elimination At BB House - Sakshi

Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: బిగ్‌బాస్‌ గేమ్‌ ఎప్పుడు ఎటు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఊహించని ట్విస్టులతో, ఊహకందని ఎలిమినేషన్లతో ప్రేక్షకులకు తరచూ షాకుల మీద షాకులిస్తుంటాడు బిగ్‌బాస్‌. ఈసారి ఆయన నిర్వహించిన వెరైటీ నామినేషన్స్‌ ద్వారా శ్రీరామ్‌, సిరి, రవి, కాజల్‌, జెస్సీ, ప్రియ, యానీ.. ఏడుగురు ఎలిమినేషన్‌ జోన్‌లోకి వచ్చారు. సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబో నేరుగా నామినేట్‌ అవడంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షో నుంచి ఆరుగురు ఎలిమినేట్‌ అయ్యారు. అందులో సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఐదుగురు ఆడవాళ్లే కాగా ఒక మేల్‌ కంటెస్టెంట్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. దీంతో ఈసారి ఎవరిని పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

రవి, శ్రీరామ్‌ స్ట్రాంగ్‌ అండ్‌ పాపులర్‌ కంటెస్టెంట్స్‌, కాబట్టి బిగ్‌బాస్‌ వాళ్లను టచ్‌ చేసే ప్రయత్నం కూడా చేయడు. ఇక వరుస పెట్టి అమ్మాయిలను పంపించేసి గ్లామర్‌ను షోకు దూరం చేసిన బిగ్‌బాస్‌ సిరి ద్వారా దాన్ని బ్యాలెన్స్‌ చేస్తున్నాడు. పైగా షణ్ముఖ్‌తో దోస్తీ వల్ల అతడి ఫ్యాన్స్‌ కూడా సిరికే ఓట్లేస్తున్నారు. ఫలితంగా సిరి బయటకు వెళ్లే ఛాన్స్‌ లేదని తెలుస్తోంది. ప్రియకు బుల్లితెర సెలబ్రిటీల మద్దతు గట్టిగా ఉంది. ఎవరేంటో పసిగడుతూ ఆచితూచి అడుగు ముందుకు వేస్తూ గేమ్‌ ఆడుతోందీ నటి. ఈమె కంటే వీక్‌ కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి తను ఈ వారం నిశ్చింతగా ఉండొచ్చని తెలుస్తోంది.

మిగిలిందల్లా జెస్సీ, యానీ, లోబో. మొదట్లో జెస్సీని అందరూ చిన్నపిల్లాడని తీసిపారేశారు. కానీ రానురాను ఆటలోనే కాకుండా మాటల్లోనూ పదును తేలాడు. అయితే అందరితో కలవకుండా కేవలం షణ్ముఖ్‌, సిరిలతో మాత్రమే ఉంటున్నాడు. దీంతో అతడు సొంతంగా గేమ్‌ ఆడలేకపోతున్నాడని, సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. కానీ షణ్ముఖ్‌ నామినేషన్స్‌లో లేకపోవడంతో అతడి ఓట్లు జెస్సీకి పడి సేవ్‌ అయ్యే అవకాశాలున్నాయి. 

లోబోను ఫేక్‌ ఎలిమినేషన్‌తో సీక్రెట్‌ రూమ్‌కు పంపించారు. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపించి గేమ్‌ను రసవత్తరంగా మార్చేందుకు ఏదైనా డ్రామా ప్లాన్‌ చేసి ఉంటారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. లేదంటే సీక్రెట్‌ రూమ్‌ గడువు పూర్తయిన వెంటనే అతడు ఎలిమినేట్‌ అయ్యాడంటే ఫేక్‌ ఎలిమినేషన్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయినట్లేనని బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తారు జనాలు. కాబట్టి లోబో ఎలిమినేషన్‌కు 50-50 ఛాన్సులున్నాయి. మిగిలింది యానీ మాస్టర్‌.. ఫ్యాన్‌బేస్‌ పెద్దగా లేని యానీ మాస్టర్‌ ఈవారం గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. తనను ఎవరైనా నామినేట్‌ చేస్తే సహించలేకపోయే స్వభావం, ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం, నోరు జారడం.. ఇలా పలు అంశాలు ఆమెకు నెగెటివ్‌గా మారాయి.

శ్వేతను కూతురు కూతురు అంటూ అల్లుకుపోయిన యానీ.. ఓ టాస్క్‌లో మాత్రం తొక్కలో రిలేషన్స్‌ నాకొద్దు అని ఆవేశంతో ఊగిపోయి తన క్యారెక్టర్‌ను బ్యాడ్‌ చేసుకుంది. ఎక్కువగా కిచెన్‌కే పరిమితమైన ఆమె గేమ్‌లో పెద్దగా పర్ఫామ్‌ చేయలేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ వారం యానీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత వారమే కూతుర్ని(శ్వేత) పంపించేసిన బిగ్‌బాస్‌ ఈ వారం తల్లిని(యానీ మాస్టర్‌) కూడా బయటకు పంపిస్తాడేమో చూడాలి! లేదంటే ఇప్పటికే ఐదుగురు అమ్మాయిలను పంపించాం కాబట్టి, ఈసారి అబ్బాయిలనే పంపించాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం జెస్సీ ఎలిమినేట్‌ అవొచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top