యాక్టింగ్ నెం.1, ఇద్ద‌రూ కాలిపోతే స‌న్నీ మిగులుతాడు | Bigg Boss 5 Telugu: RJ Kajal Wants Sunny To Win The Game | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: యాక్టింగ్ నెం.1, ఇద్ద‌రూ కాలిపోతే స‌న్నీ మిగులుతాడు

Nov 19 2021 8:53 PM | Updated on Nov 19 2021 8:53 PM

Bigg Boss 5 Telugu: RJ Kajal Wants Sunny To Win The Game - Sakshi

యానీ, సిరి ఫొటోలు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇద్ద‌రూ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. మాన‌స్.. యానీని సేవ్ చేయాల‌నుకుంటే, సిరి మాత్రం కాజ‌ల్‌ను సేవ్ చేద్దామంటుంది.

Bigg Boss Telugu 5, Sunny Wins Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ప్ర‌వేశ‌పెట్టాడు. ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే ఈ పాస్ కోసం ఇంటిస‌భ్యులు పోటీప‌డుతున్నారు. ఆ పాస్‌ను ద‌క్కించుకునేందుకు బిగ్‌బాస్ 'నిప్పులే శ్వాస‌గా.. గుండెలో ఆశ‌గా' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బ‌జ‌ర్ మోగ‌గానే ఫైర్ ఇంజ‌న్ వ్యాన్‌లో కూర్చున్న ఇద్ద‌రు ఇంటిస‌భ్యులు.. ఎదురుగా ఉన్న రెండు ఫొటోల్లోనుంచి ఒక‌రిని సేవ్ చేసి మ‌రొక‌రి ఫొటోను కాల్చేయాలి. చివ‌రి వ‌ర‌కు ఎవ‌రి ఫొటో అయితే కాల‌కుండా ఉంటుందో వారికి ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ద‌క్కుతుంది.

ఈ క్ర‌మంలో బ‌జ‌ర్ మోగ‌గానే మాన‌స్‌, కాజ‌ల్ ట్ర‌క్ ఎక్కారు. వీరికి ఎదురుగా యానీ, సిరి ఫొటోలు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇద్ద‌రూ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. మాన‌స్.. యానీని సేవ్ చేయాల‌నుకుంటే, సిరి మాత్రం కాజ‌ల్‌ను సేవ్ చేద్దామంటుంది. కానీ వీళ్లిద్ద‌రూ కాలిపోతే స‌న్నీ మిగులుతాడు అని చెప్తుంది కాజ‌ల్‌. ఒక‌రిని సేవ్ చేసే అధికారం ఉన్న‌ప్పుడు ఇద్ద‌రి ఫొటోలు కాల్చేయ‌డం క‌రెక్ట్ కాదంటాడు ర‌వి. మొత్తంగా ఈ గేమ్‌లో స‌న్నీ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ గెలుచుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోప‌క్క యానీ.. పింకీని యాక్టింగ్ నెంబ‌ర్ 1 అన‌డంతో ఆమె విరుచుకుప‌డింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement