8th Week Elimination Contestants List Of Bigg Boss 5 Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: నామినేషన్స్‌ లీక్‌, ఈసారి ఆరుగురు!

Oct 25 2021 4:47 PM | Updated on Oct 25 2021 7:12 PM

Bigg Boss 5 Telugu: 8th Week Elimination List Leaked - Sakshi

పవర్‌ రూమ్‌లోని సభ్యులు ఎవరికైతే లేఖ ఇస్తారో వారు సేఫ్‌ అవగా లెటర్‌ దక్కనివారు నామినేట్‌ అవుతారని తెలిపాడు. దీని ప్రకారం... ఎనిమిదో వారం నామినేట్‌ అయిన సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Bigg Boss 5 Telugu, 8th week Nominations: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎప్పటికప్పుడు సరికొత్తగా నామినేషన్స్‌ నిర్వహించే బిగ్‌బాస్‌ ఈసారి హౌస్‌మేట్స్‌ ఎమోషన్స్‌తో ఆడుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. మీ అందరికీ మీ ప్రియమైనవారి నుంచి ఓ లేఖ పొందే అవకాశం లభిస్తుందన్న బిగ్‌బాస్‌ అంతలోనే మరో ట్విస్టు ఇచ్చాడు. జీవితంలో కోరుకున్న ప్రతీది దక్కదని, ఏదైనా దక్కించుకోవాలంటే వేరే ఏదైనా వదులుకోవాల్సి వస్తుందని చెప్పాడు. పవర్‌ రూమ్‌లోని సభ్యులు ఎవరికైతే లేఖ ఇస్తారో వారు సేఫ్‌ అవగా లెటర్‌ దక్కనివారు నామినేట్‌ అవుతారని బాంబు పేల్చాడు. 

నామినేషన్స్‌లో ఆరుగురు
కాగా ఎనిమిదో వారం నామినేట్‌ అయిన సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌, సిరి హన్మంత్‌, లోబో, యాంకర్‌ రవి నామినేషన్‌లో ఉన్నట్లు సమాచారం. వీళ్లలో లోబో బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ వారం ఎవరో ఒకరు వైల్డ్‌ కార్డ్‌ లేదా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు కూడా వినపడుతున్నాయి. మరి ఈ జోస్యాలు నిజమవుతాయా? లేదా? అనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement