Bigg Boss 5 Telugu: ఎవరి తిండి వారే వండుకోవాలన్న కెప్టెన్‌, ఇది నీ ఇల్లు కాదని షణ్ను ఫైర్‌

Bigg Boss Telugu 5 Promo: Conflict Between Shanmukh and Sreerama Chandra - Sakshi

Bigg Boss Telugu 5 Promo, Shanmukh Vs Sreeram బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయా? అన్న ప్రశ్నకు మెజారిటీగా అవునని కొద్దిమంది మాత్రం కాదని సమాధానాలిస్తారు. అయితే తాజా ప్రోమోతో హౌస్‌లో గ్రూపులు ఉన్నాయన్న విషయం బట్టబయలైంది. గ్రూపులో ఉన్న ఏ ఒక్కరితో పెట్టుకున్నా మిగతా వాళ్లు గయ్యిమని లేస్తారని తేట తెల్లమైంది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు ఏ గ్రూప్‌తో ఏరికోరి గొడవ పెట్టుకున్నారు? వీటికి సమాధానాలు తెలియలాంటే తాజాగా వచ్చిన ప్రోమో చూసి తీరాల్సిందే!

షణ్ముఖ్‌ను నామినేట్‌ చేసింది వీళ్లే అంటూ బిగ్‌బాస్‌ 8 మంది కంటెస్టెంట్ల ఫొటోలను టీవీలో వేసి చూపించాడు. అందులో యాంకర్‌ రవి, లోబో, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, సన్నీ, విశ్వ, మానస్‌ ఉన్నారు. తన మీద అంతమంది పగపట్టారా? అని ఒక్క క్షణం పాటు షాకైన షణ్ను తనను నామినేట్‌ చేసినందుకు థాంక్యూ చెబుతూ ఓ స్మైల్‌ విసిరాడు. ఇక కిచెన్‌లో పెద్ద యుద్ధమే జరిగినట్లు కనిపిస్తోంది. ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్‌ పెడతాను అని కెప్టెన్‌ శ్రీరామ్‌ జెస్సీకి వార్నింగ్‌ ఇచ్చాడు.

దీంతో జెస్సీ ఫుడ్‌ ఇవ్వను, ఫుడ్‌ పెట్టను అనడం ఏంటని అసహనానికి లోనయ్యాడు. తన ఫ్రెండ్‌ జెస్సీ మీదకు శ్రీరామ్‌ ఫైర్‌ అవడం చూసిన సిరి, షణ్ను.. కెప్టెన్‌ మీద అరిచినంత పనిచేశారు. 'నీ ఇష్టం వచ్చినట్లు రూల్‌ పెట్టుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్‌ హౌస్‌' అని కౌంటరిచ్చాడు షణ్ను. విషయం తెలియకుండా మధ్యలోకి రావద్దని హెచ్చరించాడు శ్రీరామ్‌. అయినా నువ్వెవరు మాకు చెప్పడానికి అని సిరి సీరియస్‌ అవగా.. నువ్వొచ్చి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రివర్స్‌ కౌంటరిచ్చాడు శ్రీరామ్‌. మొత్తంగా నేడు జరిగిన పరిణామాలను బాగా సీరియస్‌గా తీసుకున్న షణ్ను ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌ అంటూ హౌస్‌మేట్స్‌కు సవాలు విసిరాడు. మరి ఇప్పటికైనా షణ్ను గేమ్‌ ఆడటం మొదలు పెడతాడో? లేదో? చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top