సిరి కోసం ఆడుతున్న షణ్ను, ఆమెను గెలిపిస్తాడా? | Bigg Boss Telugu 5: Ticket To Finale Task Final Competition | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: షణ్ను సిరిని గెలిపిస్తాడా?

Dec 3 2021 5:30 PM | Updated on Dec 3 2021 5:30 PM

Bigg Boss Telugu 5: Ticket To Finale Task Final Competition - Sakshi

మెమొరీ ఎందుకు వద్దంటున్నావని మానస్‌ ప్రశ్నించగా.. అది నీకుంది, కానీ మాకు లేదు అని ఆన్సరివ్వడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు...

Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale: బిగ్‌బాస్‌ షో 13వ వారం ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునేందుకు బిగ్‌బాస్‌ 'టికెట్‌ టు పినాలే' ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సన్నీ, మానస్‌, శ్రీరామ్‌, సిరి ఈ గేమ్‌లో కొనసాగుతుండగా కాజల్‌, ప్రియాంక, షణ్ముఖ్‌ రేసు నుంచి తప్పుకున్నారు. 

ఏ ఛాలెంజ్‌ ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు సిరి.. మెమొరీ తప్ప ఏదైనా సరే అని బదులిచ్చింది. మెమొరీ ఎందుకు వద్దంటున్నావని మానస్‌ ప్రశ్నించగా.. అది నీకుంది, కానీ మాకు లేదు అని ఆన్సరివ్వడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. కాజల్‌తో తిరిగి సైకోలా మారావంటూ మానస్‌తో జోక్‌ చేశాడు సన్నీ. చివరగా ఫోకస్‌ అనే ఛాలెంజ్‌ ఎంపిక చేసుకోగా ఇందులో శబ్ధాల సౌండు వినిపిస్తే దాన్ని వరుసగా బోర్డు మీద రాయాలి. అయితే అందరూ సరిగ్గా రాస్తే సిరి మాత్రం హెలికాప్టర్‌ సౌండ్‌ను ట్రాక్టర్‌ అని రాయడం విశేషం.

తర్వాత అక్యురసీ ఛాలెంజ్‌లో అన్ని బల్బ్స్‌ వెలిగేలా స్విచ్‌ ఆన్‌ చేయాలి. ఈ గేమ్‌లో షణ్ను సిరి తరపున గేమ్‌ ఆడినట్లు కనిపిస్తోంది. ఐస్‌ క్యూబ్స్‌ టాస్క్‌ ఎఫెక్ట్‌ వల్ల ఇప్పటికీ సిరి నడవలేకపోతోంది. దీంతో నిన్నటి గేమ్‌లో సిరి  తరపున ఆడి ఆమెను గెలిపించిన షణ్ను తన గేమ్‌లో మాత్రం ఓడిపోయాడు. మరి నేడు కూడా ఆమె కోసం ఆడుతున్న షణ్ను సిరిని గెలిపిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement