Bigg Boss 5 Telugu Latest Promo: Who Will Win In Captaincy Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఆ లేడీ కంటెస్టెంట్ కెప్టెన్‌, లీకైన విష‌యం

Nov 5 2021 11:59 AM | Updated on Nov 5 2021 2:07 PM

Bigg Boss 5 Telugu: Anee Master New Captain Of BB House - Sakshi

వీరిలో విశ్వ‌, సిరి, జెస్సీ, స‌న్నీ, శ్రీరామ్, ష‌ణ్ముఖ్‌ ఇదివ‌ర‌కే కెప్టెన్సీని అనుభ‌వించారు. కానీ కాజ‌ల్‌, ర‌వి, ప్రియాంక‌, మాన‌స్‌ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కెప్టెన్ కాలేక‌పోయారు...

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ  కంటెండ‌ర్స్ టాస్క్ ఓ కొలిక్కి చేరిన‌ట్లే క‌నిపిస్తోంది. 'సూప‌ర్ హీరోస్ వ‌ర్సెస్ సూప‌ర్ విల‌న్స్' టాస్క్‌లో విల‌న్లు గెలిచిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆ టీమ్‌లో ఉన్న ర‌వి, యానీ, స‌న్నీ విశ్వ‌, సిరి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక‌య్యారు. అయితే కెప్టెన్సీ పోటీలో యానీ విజ‌యం సాధించి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా అవ‌త‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఆమె క‌ష్టానికి ఇంటిస‌భ్యుల స‌హ‌కారం తోడ‌వ‌డంతోనే యానీ కెప్టెన్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆమె ఎవ‌రిని రేష‌న్ మేనేజ‌ర్‌గా ఎంచుకుంటారో చూడాలి!

కాగా ప్ర‌స్తుతం హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో విశ్వ‌, సిరి, జెస్సీ, స‌న్నీ, శ్రీరామ్, ష‌ణ్ముఖ్‌ ఇదివ‌ర‌కే కెప్టెన్సీని అనుభ‌వించారు. కానీ కాజ‌ల్‌, ర‌వి, ప్రియాంక‌, మాన‌స్‌ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కెప్టెన్ కాలేక‌పోయారు. ప్ర‌తిసారి ఎలాగైనా గెలుద్దామ‌ని కెప్టెన్సీ కోసం గ‌ట్టిగా పోటీప‌డిన‌ప్ప‌టికీ చివ‌రి క్ష‌ణంలో ఓటమిపాల‌వుతున్నారు కెప్టెన్ కోసం పోటీప‌డుతూ చివ‌రిదాకా వ‌చ్చి ఆగిపోతున్నారు. మ‌రి రానున్న‌రోజుల్లో వీరు కెప్టెన్ అవుతారో, లేదో చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement