Bigg Boss Telugu 5: దమ్ముంటే డైరెక్ట్‌గా ఆడాలి, దొంగబుద్ధులు ఏంది?: విశ్వ

Bigg Boss 5 Telugu Promo: Captaincy Task Between Ravi And Sunny - Sakshi

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఈ రాజ్యానికి ఒక్కడే రాజు అని కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అయితే కుర్చీ కోసం యాంకర్‌ రవి, సన్నీ ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఖజానాలోని నాణాలను కూడా పంచుతున్నారు. ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్‌, జెస్సీ, ప్రియాంక సింగ్‌, లోబో, ప్రియ.. సన్నీకి సపోర్ట్‌ చేస్తున్నట్లు కనిపించగా.. రవికి.. విశ్వ, శ్రీరామ్‌, హమీదా, శ్వేత, యానీ సపోర్ట్‌ చేస్తున్నట్లు కనిపించారు.

ఇక ఇద్దరు రాజుల కోసం విశ్వ, మానస్‌ బురదలో ఫైట్‌ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి, కానీ దొంగబుద్ధులు ఏంది? అని తొడగొట్టి ప్రశ్నించాడు విశ్వ. పేరు తీసి మాట్లాడు, కానీ అందరినీ ఎందుకు అంటున్నావని ఆవేశపడ్డాడు మానస్‌.  మరి హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు కెప్టెన్‌ అయ్యారు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top