Bigg Boss 5 Telugu: రెచ్చగొట్టడం నాక్కూడా వస్తుంది... కాజల్‌కు రవి వార్నింగ్‌

Bigg Boss Telugu 5 Promo: Heated Argument Between Ravi and Kajal - Sakshi

Heated Argument Between Ravi and Kajal: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో గొడవల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సోమవారం ఎపిసోడ్‌లో కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో  కెప్టెన్‌ శ్రీరామ్‌, జెస్సీ, షణ్ముఖ్‌, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. జెస్సీ ఫుడ్‌ జెస్సీనే వండుకుని తినాలని కెప్టెన్‌ శ్రీరామ్‌ ఆదేశించడం.. దీనిపై సిరి, షణ్ను సీరియస్‌ అవ్వడంతో ఇంట్లో యుద్ద వాతావరణం కనిపించింది. చివరకు శ్రీరామ్‌ ప్లేట్‌లో అన్నం తీసుకొచ్చి జెస్సీ, షణ్నూలకు తిపిపించడంతో గొడవ సమసిపోయినట్లు అనిపించింది. దీంతో ఇంట్లో అంతా హ్యాపీగా గేమ్‌పై ఫోకస్‌ పెడుతారనుకుంటున్న క్రమంలో రవి, కాజల్‌ల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తాజాగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. 

బెడ్‌రూమ్‌లో పడుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్న రవి, లోబోల దగ్గరకు వెళ్లిన కాజల్‌.. ‘నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్‌ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి’ అని సరదాగా ఆటపట్టిస్తూ చిందులేసింది. అదికాస్త పెద్ద గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాజల్‌ మాటలను సీరియస్‌గా తీసుకున్న రవి. అలా ఎలా అంటావంటూ. ఆమెపై ఫైర్‌ అయ్యాడు. ‘నేను సరదాగా అన్నాను’ అని కాజల్‌ చెప్పగా, ‘నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు’అంటూ  రవి ఫైర్‌ అయ్యాడు. అంతే కాదు రెచ్చగొట్టడం నాకు కూడా వస్తుందంటూ కాజల్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top