
Bigg Boss 5 Telugu Today Promo, Ticket To Finale: బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ దిగ్విజయంగా 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. వారిలో కెప్టెన్ షణ్ముఖ్, సన్నీ మినహా.. మిగతా ఇంటి సభ్యులంతా నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులంతా టాప్ 5లో ఉండాలని కలలు కంటున్నారు. ఈ ఒక్కవారం సేవ్ అయితే చాలు తర్వాత ఎలాగైనా నెట్టుకురావొచ్చనే భావనలో ఇంటి సభ్యులు ఉన్నారు. ఈక్రమంలో కంటెస్టెంట్స్‌కి బంపరాఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునే అవకాశం కల్పించాడు. దానికోసం ‘టికెట్ టు ఫినాలే’అనే టాస్క్ ఇచ్చాడు.
ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా మూడు చాలెంజ్‌లు ఇచ్చాడు. వాటిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెలిస్తే వారే నేరుగా ఫినాలేకు సెలెక్ట్ అవుతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్’టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్ గెలిచిందెవరు? మిగతా రెండు టాస్క్‌లు ఏంటి? చివరకు ‘టికెట్ టు ఫినాలే’ ను ఎవరు సొంతం చేసుకున్నారు?అనేది తెలియాలంటే బిగ్‌బాస్ షోని ఫాలో కావాల్సిందే.