Bigg Boss 5 Telugu Latest Promo: Bigg Boss Given Secret Task to Jessie - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: జెస్సీకి సీక్రెట్‌ టాస్క్‌.. బకరా అయిన సన్నీ!

Oct 20 2021 6:59 PM | Updated on Oct 20 2021 7:52 PM

Bigg Boss 5 Telugu Latest Promo: Secret task To Jessie - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వీకెండ్‌ దాకా కలిసి ఉన్న హౌస్‌మేట్స్‌.. నామినేషన్‌ రాగానే చెలరేగిపోతారు. ఇక టాస్క్‌ల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువ. స్నేహితులని కూడా చూడకుండా స్వార్థంగా ఆడుతూ..  టాస్క్‌ గెలిచేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఈ క్రమంలో స్నేహితులను తిట్టేస్తుంటారు. అయితే కొన్నిసార్లు బిగ్‌బాస్‌ ఇచ్చే షాక్‌కి హౌస్‌మేట్స్‌ దిమ్మతిరిగిపోతుంది. నేటి ఎపిసోడ్‌లో అలాంటి సంఘటననే జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చి మిగిలిప హౌస్‌మేట్స్‌ని బకరాలను చేశాడు బిగ్‌బాస్‌.  
(చదవండి: బిగ్‌బాస్‌: అలా చేస్తే చెంప పగిలిపోద్ది.. సన్నీకి ప్రియ వార్నింగ్‌)

కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జెస్సీకి బిగ్‌బాస్‌ ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన జెస్సీ.. సన్నీని ఓ ఆట ఆడేసుకున్నాడు. కావాలనే సన్నీని రెచ్చగొట్టాడు. ఇది సీక్రెట్‌ టాస్క్‌ అనే విషయం తెలియన సన్నీ.. జెస్సీపై ఫైర్‌ అయ్యాడు. మరోవైపు సిరికి కూడా ఈ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి తోడుగా ఉంటూ.. సన్నీకి మరింత కోపం వచ్చేలా చేసింది. ‘ఏం చేస్తే నీకెందుకురా’అంటూ సన్నీని రెచ్చగొట్టగా.. ఇంకోసారి ‘రా’అనకు.. అలా పిలిచే అర్హత నీకు లేదంటూ.. సన్నీ ఫైర్‌ అయ్యాడు. కట్‌ చేస్తే.. ఇదంతా సీక్రెట్‌ టాస్క్‌ అని బిగ్‌బాస్‌ అనౌన్స్‌ చేయడంతో అంతా తెల్లముఖాలు వేశారు. ఇక త్రిమూర్తుల్లో ఒకరైన షణ్ముఖ్‌ సైతం సీక్రెట్‌ టాస్క్‌ గురించి తెలుసుకొని షాకయ్యాడు. నాక్కూడా సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వమని బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్‌ చేయగా.. ముందైతే టాస్క్‌ సరిగా ఆడంటూ రవి సెటైర్‌ వేశాడు. మరి ఈ సీక్రెట్‌ టాస్క్‌లో జెస్సీ సక్సెస్‌ అయ్యాడా లేదా తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement