Bigg Boss: ఇదేందిరా భయ్.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా..సన్నీ ఫైర్‌ | Bigg Boss 5 Telugu Latest Promo: Sunny Fries On Sri Hanumanth | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఇదేందిరా భయ్.. తొక్కలో ఆట.. సారీ చెప్పను: సన్నీ

Oct 13 2021 8:05 PM | Updated on Oct 13 2021 8:18 PM

Bigg Boss 5 Telugu Latest Promo: Sunny Fries On Sri Hanumanth - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో పత్తేపారం.. పలు గొడవలకు దారి తీస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ కోసం ఇంటి సభ్యులు ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారు. బిగ్‌బాస్‌ ఇచ్చే  బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్‌ కోసం కంటెస్టెంట్స్‌ నానా పాట్లు పడుతున్నారు. నాలుగు టీమ్‌లుగా విడిపోయి.. బద్ధ శత్రువుల్లా కొట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో సంచాలకురాలైన సిరిపై యానీ ఒంటికాలిపై లేచింది. ఇక నేటి ఎపిసోడ్‌లో కూడా ఓ రేంజ్‌లో గొడవలు జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సంచాలకులుగా కాజల్, సిరిలు సరిగా చేయడం లేదంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు నాలుగు టీమ్‌ల సభ్యులు.  
 

కన్వేయర్‌ బెల్ట్‌పై నుంచి వచ్చే  రా మెటీరియల్‌ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ‘ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ’అని సన్నీ ఊగిపోగా..  ‘సంచాలకులపై ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు అందరి ముందు సారీ చెప్పాలి’అని సిరి డిమాండ్‌ చేసింది. దీన్ని తేలిగ్గా తీసుకున్న సన్నీ.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు.

‘నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మరోవైపు కాజల్‌.. సంచాలకురాలిగా తనకు వచ్చి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంటి సభ్యులపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ‘మేం పెట్టిన రూల్‌ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలి’ అంటూ రూల్ పెట్టింది. దీనికి మేం ఒప్పుకోం అని ప్రియ విభేదించింది. అంతేకాదు ‘ నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు’ అంటూ ప్రియ సీరియస్‌ అయింది. ఈ సమయంలో సన్నీ విజిల్స్‌ వేస్తూ ‘అటు బస్సూ.. ఇటు బస్సూ ’అనే పాట పాడాడు. మరోవైపు బాగా డిస్టర్బ్‌ అయిన సిరిని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు షణ్ముఖ్‌. సిరిపై సన్నీ ఎందుకు ఫైర్‌ అయ్యాడు? కాజల్‌ అలాంటి రూల్‌ ఎందుకు పెట్టింది? తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement