Bigg Boss 5 Telugu Promo: BB Telugu 5 Contestants Are In Full Fun Mood - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: టాప్‌ 5లో నేను, మానస్‌ ఉంటాం.. ప్రియాంక జోస్యం

Oct 26 2021 8:08 PM | Updated on Oct 27 2021 7:44 AM

Bigg Boss 5 Telugu Promo: Contestants Are In Full Fun Mood - Sakshi

నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్‌ అంతా ఎప్పటిమాదిరే కలిసిపోయారు. కోపాలు, గొడవలను దూరంపెట్టి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. నేను మానస్‌ టాప్‌ 5లో ఉంటామని ప్రియాంక చెప్పగా... దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఇక మానస్‌ అయితే.. అంకుల్స్‌ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్‌ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్‌ ఇచ్చింది. ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్‌ఫ్లూయన్స్‌ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్‌ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ చెప్పాడు. ఆ తరువాత శ్రీరామ్ 'దుర్యోధనా..' అంటూ రవిని ఆటపట్టించాడు. 

మరోవైపు గతవారం నామినేషన్‌ ప్రక్రియలో జరిగిన సంఘటలను ఇమిటేట్‌ చేసి చూపించారు మానస్‌ అండ్‌ సన్నీ. టవల్‌ రీజన్‌తో ప్రియ రవిని నామినేట్‌ చేసిన ఘటనను ఇమిటేట్‌ చేస్తూ నవ్వులు పూయించారు. రవి ఏమో.. పింకీని ఇమినేట్‌ చూపించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘అభయహస్తం’అనే టాస్క్‌ని ఆడినట్లు ప్రోమోలో చూపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement