
మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడేమోనని శ్రీరామ్ అభిప్రాయపడ్డాడు. షణ్ముఖ్ మాత్రం ఇంట్లోవాళ్లను ఎవరినీ సెలక్ట్ చేసుకోకుండా తనకు తానే దెయ్యాన్ని అని ప్రకటించుకున్నాడు..
నిన్న కంటెస్టెంట్లకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన నాగ్ ఇవాళ మాత్రం చాలా కూల్‌గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయిస్తూ వారి మీద పంచులు విసురుతూ ఎంతో చలాకీగా కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో.. కాజల్ తన జిహ్వచాపల్యాన్ని వెల్లడిస్తూ మటన్ బిర్యానీ తినాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. కానీ నాగ్ దగ్గర ఆమె పప్పులు ఉడకలేదు, అంతలా తినాలనిపిస్తే వండుకో అని కౌంటరిచ్చాడు.
ఇక రవి లేడీ కంటెస్టెంట్లతో వేసిన డ్యాన్సులు చూసిన నాగ్.. పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయినట్టున్నావని సెటైర్ వేశాడు. తర్వాత కంటెస్టెంట్లతో ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు? అనే ఆట ఆడించాడు. అందులో భాగంగా లహరి.. ఉమాదేవిని స్వీట్ రాక్షసి అని పేర్కొనగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావన్నాడు నాగ్. ఇక శ్రీరామ్.. మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడేమోనని అభిప్రాయపడ్డాడు. షణ్ముఖ్ మాత్రం ఇంట్లోవాళ్లను ఎవరినీ సెలక్ట్ చేసుకోకుండా తనకు తానే దెయ్యాన్ని అని ప్రకటించుకున్నాడు.
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సిరి, సన్నీల మధ్య జరిగిన గొడవను నాగ్ శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో సిరి షర్ట్ లోపల సన్నీ చేయి పెట్టాడని షణ్ను కుండ బద్ధలు కొట్టి చెప్పాడు. కానీ బిగ్‌బాస్ ఆ ఫుటేజీ చూపించగా సన్నీ సిరి షర్ట్ లోపల చేయి పెట్టలేదని, అతడు అమాయకుడని తేలింది. దీంతో అనవసరంగా సన్నీ మీద నింద వేశానన్న అవమాన భారంతోనే షణ్ను తనకు తానే దెయ్యం ట్యాగ్ ఇచ్చుకుని ఉంటాడని అంటున్నారు నెటిజన్లు. మరి ఇదే అసలు కారణమా? లేదా? ఇంకేదైనా అయి ఉండొచ్చా? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!