Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri - Sakshi
Sakshi News home page

Bigg Boss 5: సిరి-షణ్నూల రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్నీ

Dec 20 2021 3:37 PM | Updated on Dec 20 2021 7:34 PM

Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri - Sakshi

Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్‌లో రియల్‌ ఎంటర్‌టైనర్‌ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్‌బాస్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్‌ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

'షణ్నూ-సిరిల రిలేషన్‌ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్‌ మీదే మాట్లాడాలి. సిరి, అండ్‌ షణ్ముఖ్‌ అలాంటి ఫ్రెండిష్‌ దొరకడం అదృష్టం. నాకు, మానస్‌కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్‌ అయ్యింది. 

Advertisement
 
Advertisement
Advertisement