Shanmukh Jaswanth: Bigg Boss 5 Contestant Leg Injury, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ కాలికి గాయం.. ‘స్వీట్‌ అండ్‌ రాడ్‌ మెమోరీ’ అంటూ కామెంట్‌

Jan 13 2022 11:15 AM | Updated on Jan 13 2022 12:51 PM

Bigg Boss Contestant Shanmukh Jaswanth Leg Injury Photos Goes Viral - Sakshi

దీప్తి సునైనాతో బ్రేకప్‌ తర్వాత షణ్ముఖ్‌ యాక్టింగ్‌ మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో కొన్ని టాస్కులు  కాస్త కఠినంగానే ఉంటాయి. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతాయి. అయినప్పటికీ.. కంటెస్టెంట్స్‌ వాటిని పట్టించుకోకుండా టాస్క్‌ని సీరియస్‌గా తీసుకొని ఆడతారు. అయితే గతంలో టాస్కుల వల్ల చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యేవి. కానీ బిగ్‌బాస్‌-5లో మాత్రం కొన్ని టాస్కులు చాలా కఠినంగా ఉన్నాయి. వాటి వల్ల కంటెస్టెంట్స్‌ చాలా ఇబ్బంది పడ్డారు. మరీ ముఖ్యంగా టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఐస్‌ టాస్క్‌ అయితే దారుణమనే చెప్పాలి. దానివల్ల సిరి, శ్రీరామచంద్రల పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి.

అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటున్నారా?  ఆ టాస్క్‌లో సిరి, శ్రీరామ్‌ మాత్రమే కాదు..  షణ్ముఖ్‌ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఐస్‌లో నిలబడి ఉండడం వల్ల అతని పాదాలు కమిలిపోయాయి. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘స్వీట్‌ అండ్‌ రాడ్‌ మెమోరీ’ఫన్నీగా కామెంట్‌ చేశాడు షణ్ముఖ్‌. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే అది బిగ్‌బాస్‌ హౌస్‌లో తగిలిన గాయమా.. లేదా ఇప్పుడు తగిలిన గాయమా అనేది తెలియాల్సి ఉంది. దీప్తి సునైనాతో బ్రేకప్‌ తర్వాత షణ్ముఖ్‌ యాక్టింగ్‌ మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షణ్ముఖ్‌ ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement