breaking news
leg ingure
-
సీటు కోసం కాలిపై వేటు
జౌన్పూర్ (యూపీ): ‘నేను 2026లో ఎట్టి పరిస్థితు ల్లోనూ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి!’.. ఇది తన డైరీలో ఒక యువకుడు రాసుకున్న బలమైన నిశ్చయం. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఎంచుకున్న దారి చదివితే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వైద్య కళాశాలలో సీటు కోసం రిజర్వేషన్ పొందేందుకు ఒక విద్యార్థి తన కాలినే తెగ్గోసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది.వరుస వైఫల్యాలతో వికృత ఆలోచన!ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లా ఖలీల్పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ (20) అనే యువకుడు రెండుసార్లు ‘నీట్’ పరీక్ష రాసినా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించలేకపోయాడు. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైన సూరజ్, ఎలాగైనా మెడికల్ సీటు కొట్టాలని భయంకరమైన ప్లాన్ వేశాడు. దివ్యాంగుల కోటా ఉంటే తక్కువ మార్కులకే సీటు వస్తుందని గ్రహించిన అతను, తన కాలిని స్వయంగా నరుక్కున్నాడు.నేరస్తుల దాడి అంటూ ‘డ్రామా’!ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తన తమ్ముడిపై దాడి చేసి, కాలు నరికేసి పారి పోయారని సూరజ్ అన్న పోలీసులకు ఫిర్యాదు చేయ డంతో కథ మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. సూరజ్ మాటల్లో పొంతన లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది.దర్యాప్తులో షాకింగ్ నిజాలుపోలీసులు సూరజ్ ఫోన్‌ను, డైరీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్వహస్తాలతోనే కాలును వేరు చేసుకున్న సూరజ్, దానిని నేరస్తులపైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దివ్యాంగుల కోటా కింద మెడికల్ సీటు పొందడమే లక్ష్యంగా ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ యువకుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతనిపై ఏయే సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలో పోలీసులు న్యాయసలహా కోరుతున్నారు. మెడికల్ సీటు కోసం ఒక యువకుడు జీవితాంతం అంగవైకల్యంతో మిగిలిపోయే నిర్ణయం తీసుకోవడం.. అక్షరాలా ఒక సామాజిక అనారోగ్యానికి సంకేతం. -
షణ్ముఖ్ కాలికి గాయం.. ‘స్వీట్ అండ్ రాడ్ మెమోరీ’ అంటూ కామెంట్
బిగ్‌బాస్ రియాల్టీ షోలో కొన్ని టాస్కులు కాస్త కఠినంగానే ఉంటాయి. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతాయి. అయినప్పటికీ.. కంటెస్టెంట్స్ వాటిని పట్టించుకోకుండా టాస్క్‌ని సీరియస్‌గా తీసుకొని ఆడతారు. అయితే గతంలో టాస్కుల వల్ల చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యేవి. కానీ బిగ్‌బాస్-5లో మాత్రం కొన్ని టాస్కులు చాలా కఠినంగా ఉన్నాయి. వాటి వల్ల కంటెస్టెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మరీ ముఖ్యంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ అయితే దారుణమనే చెప్పాలి. దానివల్ల సిరి, శ్రీరామచంద్రల పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటున్నారా? ఆ టాస్క్‌లో సిరి, శ్రీరామ్ మాత్రమే కాదు.. షణ్ముఖ్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఐస్‌లో నిలబడి ఉండడం వల్ల అతని పాదాలు కమిలిపోయాయి. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ రాడ్ మెమోరీ’ఫన్నీగా కామెంట్ చేశాడు షణ్ముఖ్. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది బిగ్‌బాస్ హౌస్‌లో తగిలిన గాయమా.. లేదా ఇప్పుడు తగిలిన గాయమా అనేది తెలియాల్సి ఉంది. దీప్తి సునైనాతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ యాక్టింగ్ మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షణ్ముఖ్ ప్రకటించాడు. -
చిత్తూరు ఎమ్మెల్యే కాలికి గాయం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ బుధవారం తన నివాసంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడ్డారు. రాత్రి ఇంట్లోని తన గదిలో నడుస్తున్న సమయంలో కాలు జారి కిందపడ్డారు. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. గురువారం ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు కాలు ఎముక విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. ఆమె రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె బెంగళూరులోని ఆస్పత్రిలోనే ఉన్నారు.


