Shannu And Deepu Breakup: Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat - Sakshi
Sakshi News home page

Shanmukh: దీప్తి సునయన లైవ్‌ చూసి హార్ట్‌ బ్రేక్‌ అయిన షణ్నూ!

Published Mon, Jan 3 2022 8:40 PM

Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat - Sakshi

Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat: దీప్తి సునయన- షణ్ముఖ్‌ బ్రేకప్‌ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. 5ఏళ్లు రిలేషన్‌ షిప్‌లో ఉన్న ఈ జంట బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ తమ దారులు వేరంటూ షణ్ముఖ్‌తో దీప్తి సునయన తెగదెంపులు చేసుకుంది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చింది.

తాజాగా బ్రేకప్‌ అనంతరం తొలిసారి అభిమానులతో ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి సునయన ఎంతో ఎమోషనల్‌ అయ్యింది. ఇన్నేళ్లలో తన లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదని, ఇకపై వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అంటూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అకస్మాత్తుగా లైవ్‌ నుంచి వెళ్లిపోయింది.

అయితే దీప్తి లైవ్‌ చాట్‌ తర్వాత కాసేపటికే షణ్ముఖ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. హృదయం ముక్కలైపోయిన ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం షణ్నూ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మరోవైపు ఇలాంటి కష్ట సమయంలో మేం అండగా ఉంటాం అంటూ షణ్ముఖ్‌ ఫ్యాన్స్‌ అతనికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. 

చదవండి: Shrihan: బిగ్‌బాస్‌ రేపిన చిచ్చు.. సిరి-శ్రీహాన్‌ కూడా విడిపోతారా?
రౌడీ హీరో విజయ్‌తో రష్మిక డేటింగ్‌? లీకైన ఫోటోలు

Advertisement

తప్పక చదవండి

Advertisement