Bigg Boss Telugu 5 Winner And Runner Up: Is this contestant fifth season winner?
Sakshi News home page

Bigg Boss 5 Telugu: విజేతగా అవతరించిన సన్నీ! రెండో స్థానంలో షణ్ముఖ్‌!!

Dec 19 2021 7:53 PM | Updated on Dec 20 2021 7:46 PM

Bigg Boss Telugu 5 Winner VJ Sunny - Sakshi

అందరూ ఊహించినట్లుగా వీజే సన్నీ విజేతగా అవతరించాడని చెప్తున్నారు. ఇక రెండో ర్యాంకు కోసం శ్రీరామ్‌, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ షణ్ను రన్నరప్‌గా నిలవగా శ్రీరామ్‌ సెకండ్‌ రన్నరప్‌ స్థానంతో సరిపెట్టుకున్నాడట!

Bigg Boss Telugu 5 Winner And Runner up: బిగ్‌బాస్‌ షోలో నామినేషన్స్‌, ఎలిమినేషన్స్‌నే వదలిపెట్టని లీకువీరులు గ్రాండ్‌ ఫినాలేను మాత్రం వదులుతారా? ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిన్న సిరి, మానస్‌ ఎలిమినేట్‌ అయ్యారని వెల్లడించిన లీకువీరులు తాజాగా మిగిలిన ముగ్గురిలో విజేత ఎవరో తేలిపోయిందంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

అందరూ ఊహించినట్లుగా వీజే సన్నీ విజేతగా అవతరించాడని చెప్తున్నారు. ఇక రెండో ర్యాంకు కోసం శ్రీరామ్‌, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ షణ్ను రన్నరప్‌గా నిలవగా శ్రీరామ్‌ సెకండ్‌ రన్నరప్‌ స్థానంతో సరిపెట్టుకున్నాడట! ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ట్రోఫీని సన్నీ ఎగరేసుకుపోయాడోచ్‌ అంటూ అతడి అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. దాదాపు ఇదే నిజమయ్యే అవకాశాలున్నాయి. మరి సన్నీ ట్రోఫీ అందుకున్న క్షణాలను ఆస్వాదించాలంటే కాసేపు ఆగాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement