ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముక్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్! | Shanmukh Jaswanth Shared A Video Song Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth: 'అయ్యయ్యో' ఏంటీ బ్రో ఇది.. రివెంజ్ కోసమేనా!

Published Sun, Mar 19 2023 7:07 PM | Last Updated on Sun, Mar 19 2023 7:36 PM

Shanmukh Jaswanth Shared A Video Song Goes Viral In Social Media - Sakshi

యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్‌ బిగ్‌బాస్‌ ఎంట్రీతో మరింత పాపులర్‌ అయ్యాడు. అతని ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయనతోబ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి బయటకొచ్చాక దీప్తి షణ్నూకి గుడ్‌బై చెప్పేసింది. తాము కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పేసి విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎవరికీ వారే సొంతంగా యూట్యూబ్‌ సాంగ్స్ చేస్తున్నారు.

కానీ తాజాగా షణ్ను పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ రొమాంటిక్ సాంగ్‌ వీడియోను రిలీజ్ చేసిన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇది చూసిన అతని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  'అయ్యయ్యో' అనే పేరుతో సాంగ్‌ రీలీజ్‌ చేశాడు షణ్ముక్. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు. ఆ సాంగ్‌లో షణ్ను ముద్దులతో రెచ్చిపోయాడు. 

(ఇది చదవండి: ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?)

ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ దీప్తిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా టూమచ్ బ్రో.. ఇదంతా దీప్తి మీద రివెంజ్ కోసమేనా అని కొందరు కామెంట్స్ చేశారు. 'అరే ఏంట్రా ఇది' అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేయగా.. ఇది చూస్తే దీపు చాలా ఫీల్ అవుతుంది బ్రో అంటూ పోస్ట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement