Shanmukh Jaswanth: కుక్కల వెనక రాయితో తిరిగేవాడు అచ్చం షణ్నూనే.. యూట్యూబర్‌పై అఖిల్‌ ఫైర్‌

Bigg Boss Telugu 5: Akhil Sarthak Support to Against Trolls for Shanmukh - Sakshi

Bigg Boss Telugu 5: Akhil Sarthak Support to Against Trolls for Shanmukh: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ 13 వారంలోకి అడుగు పెట్టింది. యాంకర్‌ రవి ఎలిమినేషన్‌తో టాప్‌ 5లో ఎవరుంటారో ఊహించడం కష్టంగా మారింది. ఎందుకంటే అది బిగ్‌బాస్‌ హౌస్‌.. అక్కడేమైనా జరగొచ్చు. ఇదిలా ఉంటే కంటెస్టెంట్ల పోట్లాటల కన్నా వాళ్ల అభిమానుల కొట్లాటలే ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొందరు తమకు నచ్చని కంటెస్టెంట్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారు.

తాజాగా ఓ యూట్యూబర్‌ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నును ఎక్కడో చూసినట్లుంది... పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్‌ నీలాగే ఉంటడు షణ్ను..' అంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గత సీజన్‌ రన్నరప్‌ అఖిల్‌ సార్థక్‌ ఘాటుగా స్పందించాడు. 'ఇంతకు ముందు మీ మీద గౌరవం ఉండేది, ఇప్పుడది పోయింది. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పు! ఒకరు మీకు నచ్చలేదంటే వాళ్లను మీరు బాడీ షేమింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. మరీ అంతలా ద్వేషించకండి! ఇది ఒక గేమ్‌ షో మాత్రమే.. చూసి ఎంజాయ్‌ చేయండంతే! మరీ ఇంత నెగెటివిటీ వద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్‌ షోలో ఉండి ఉంటే నిన్ను ఎవరైనా ఇలా ట్రోల్‌ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో! వయసు పెరగడం కాదు, బుద్ధి కూడా పెరగాలి' అని చురకలంటించాడు.

'మీకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం అవతలి వారిని కించపరచడం చాలా తప్పు. రోడ్ల మీద చిత్తుకాగితాలు ఏరుకునేవాళ్లలా ఉంది నీ ఫేసు.. అంటే వాళ్లు మనుషులు కాదా ఏంటి? మరీ ఇంతలా విమర్శించడం దేనికి బ్రదర్‌? నీ ఈగో సంతృప్తి చెందడానికా! రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదు, ఎందుకు బ్రో ఇంతగా నెగెటివిటీ.. ముఖం చూసి నువ్వు సపోర్ట్‌ చేస్తావేమో కానీ అందరూ అలా కాదు. వేధించడం మానేసి పాజిటివిటీని వ్యాప్తి చేయండి. గేమ్‌ షోను గేమ్‌ షోలా మాత్రమే చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై షణ్ను ప్రేయసి దీప్తి సునయన సైతం రియాక్ట్‌ అయింది. షణ్ను కోసం స్టాండ్‌ తీసుకున్నందుకు అఖిల్‌కు థ్యాంక్స్‌ తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-12-2021
Dec 01, 2021, 19:06 IST
రెండు వేల రూపాయలిస్తామంటే వాళ్ల తల్లిదండ్రుల గురించి కూడా చెడ్డగా రాసేవాళ్లు కొందరున్నారు. ఇంత దారుణమా? డబ్బు కోసం ఇంత...
01-12-2021
Dec 01, 2021, 16:38 IST
ఒకరిని విలన్‌ చేయడానికి సిరి రెడీగా ఉంటుందని చిరాకుపడ్డాడు సన్నీ. మరోపక్క మానస్‌ ఎక్కువ పాయింట్లతో ఈ గేమ్‌లో ఆధిక్యంలో ఉన్నాడట.. ...
30-11-2021
Nov 30, 2021, 23:58 IST
చిర్రెత్తిపోయిన పింకీ.. కాజల్‌ను షటప్‌ అని తిట్టి వెళ్లింది. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, రెచ్చగొట్టి..
30-11-2021
Nov 30, 2021, 15:09 IST
Bigg Boss Telugu shocking Eliminations: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు...
30-11-2021
Nov 30, 2021, 14:54 IST
Bigg Boss 5 Telugu Today Promo, Ticket To Finale: బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో...
30-11-2021
Nov 30, 2021, 09:19 IST
నిన్నేం చేసినా నువ్వు వాళ్లను నామినేట్‌ చేయవు, ఎదురు తిరగవని వాళ్ల నమ్మకం. నువ్వు వాళ్ల కంట్రోల్‌లో ఉన్నావనుకుంటున్నారు అని...
29-11-2021
Nov 29, 2021, 19:04 IST
రవిని ఎలిమినేట్‌ చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. తెలంగాణ వ్యక్తిని పంపించి మరోసారి కొట్లాట..
29-11-2021
Nov 29, 2021, 16:54 IST
ప్రియాంక ఏకంగా మానస్‌ను నామినేట్‌ చేసిందట. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య కాస్త గొడవ కూడా జరిగినట్లు వినికిడి..
29-11-2021
Nov 29, 2021, 16:14 IST
Bigg Boss Buzzz: Anchor Ravi Shocking Comments on Shannu and Siri Relationship: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో యాంకర్‌...
29-11-2021
Nov 29, 2021, 15:08 IST
Bigg Boss 5 Telugu Ravi Elimination Reason: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5లో 12వ వారం ఎలిమినేషన్‌ ఇప్పుడు టాక్‌...
29-11-2021
Nov 29, 2021, 01:39 IST
అతడిని బిగ్‌బాస్‌ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్‌ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం...
29-11-2021
Nov 29, 2021, 00:49 IST
తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ...
28-11-2021
Nov 28, 2021, 21:00 IST
నిజంగా ఆ ముగ్గురి కంటే రవికి తక్కువ ఓట్లు వచ్చినట్లైతే ఆ ఓట్ల లెక్క చూపించమని డిమాండ్‌ చేస్తున్నారు.
28-11-2021
Nov 28, 2021, 19:19 IST
టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ త్వరలోనే బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్నాడు..
28-11-2021
Nov 28, 2021, 17:51 IST
విచిత్రంగా శ్రీరామ్‌కు దగ్గరవుతున్న వాళ్లందరూ ఎలిమినేట్‌ అవుతున్నారు. దీంతో తనకంటూ ఒకరున్నారనుకులోపే..
28-11-2021
Nov 28, 2021, 16:31 IST
ఒకరిని సేవ్‌ చేసే అవకాశం మీలో ఒక్కరికే ఉందని నాగ్‌ వెల్లడించాడు. దీంతో సన్నీ తనకు దక్కిన ఎవిక్షన్‌ ఫ్రీ...
28-11-2021
Nov 28, 2021, 15:09 IST
Bigg Boss 5 Telugu: BB5 Title Winner Prize Money Details: బిగ్‌బాస్‌ సీజన్‌-5 మరో మూడు వారాల్లో ముగియనుంది....
28-11-2021
Nov 28, 2021, 14:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శనివారం దీప్తి సునైనా సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రియుడి షణ్ముఖ్‌ కోసం బిగ్‌బాస్‌ షోకి వచ్చిన...
28-11-2021
Nov 28, 2021, 14:26 IST
Bigg Boss 5 Telugu, Sunny Mother Kalavathi Request To All BB5 Fans: బిగ్‌బాస్‌ ఫినాలే ఎపిసోడ్‌కు ఇంకా...
28-11-2021
Nov 28, 2021, 13:53 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శనివారం ఎపిసోడ్‌ కొంచెం ఎమోషనల్‌గా, కొంచెం జాయ్‌ఫుల్‌గా సాగింది. కంటెస్టెంట్స్‌కు మరోసారి కుటుంబ సభ్యులను చూపించి, సంతోషపరిచాడు...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top