Shanmukh Jaswanth Admitted In Hospital, Pic Viral - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌, ఫ్యాన్స్‌ ఆందోళన

Sep 7 2022 11:23 AM | Updated on Sep 7 2022 11:53 AM

Shanmukh Jaswanth Joins in Hospital Photo Viral - Sakshi

యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్‌ బిగ్‌బాస్‌ ఎంట్రీతో మరింత పాపులర్‌ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్‌ గతేడాదిలో విడిపోయిన విషయం తెలిసిందే. లవ్‌ బ్రేకప్‌లో కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిన షణ్నూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నాడు. 

చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ట్రైలర్‌

ఇక ఇటీవల తిరిగి తన డాన్స్‌ వీడియోలు షేర్‌ చేస్తూ యాక్టివ్‌ అయ్యాడు. తిరిగి కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన షణ్నూ రీసెంట్‌గా 'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌' సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకిరించాడు. అంతేకాదు తరచూ సోషల్‌ మీడియాలో తన డాన్స్‌ వీడియోలు షేర్‌ చేస్తూ మళ్లీ ఫాలోవర్స్‌లో జోష్‌ నింపుతున్న క్రమంలో తాజాగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. దీంతో అతడి ఫాలోవర్స్‌ అంతా షణ్నూకి ఏమైందా? అని ఆందోళన వ్యక్తం చేస్తుండంతో కొద్ది సేపటికే తాను బాగానే ఉన్నానంటూ మరో పోస్ట్‌ పెట్టాడు. దీంతో అతడి ఫాలోవర్స్‌ కాస్తా ఊపరి పీల్చుకున్నారు. అయితే తన అనారోగ్యానికి గల కారణమేంటన్నది మాత్రం అతడు వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement